దేశంలోనే అత్యంత తక్కువ మెయింటనెన్స్ కారు.. ధర చాలా తక్కువ! ఏడాదిలోనే 50 వేల మార్క్ పూర్తి
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో స్కోడా కైలాక్ (Skoda Kylaq) చాలా తక్కువ కాలంలోనే ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో ప్రవేశించిన ఈ మోడల్, భారతీయ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా రూపొందించబడడంతో వేగంగా ప్రజాదరణ పొందింది. స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీల్, స్కోడా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కలిసి కైలాక్‌ను కుటుంబాలకూ, యువతకూ ఒక ఆకర్షణీయ ఎంపికగా మార్చాయి. స్కోడా కైలాక్‌ను కంపెనీ డిసెంబర్ 2024లో అధికారికంగా భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. లాంచ్ అయిన కొద్ది రోజులకే ఈ SUVపై మంచి స్పందన రావడంతో, డెలివరీలు జనవరి 27, 2025 నుంచి ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచే కైలాక్‌కు స్థిరమైన డిమాండ్ కొనసాగుతూ వస్తోంది.
ముఖ్యంగా నగరాల్లో వినియోగానికి అనువైన సైజ్, SUV లుక్, ఫీచర్ల కలయిక దీనిని సెగ్మెంట్‌లో బలమైన పోటీదారుగా నిలబెట్టాయి. ఆరంభమైన క్షణం నుంచి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయ్యే సరికి, స్కోడా కైలాక్ కీలక మైలురాయిని చేరుకుంది. అదే రోజైన జనవరి 27, 2026న అంటే నిన్నఈ కాంపాక్ట్ SUV ఉత్పత్తి పరంగా 50,000 యూనిట్ల మార్క్‌ను దాటింది. ఇది స్కోడా ఇండియాకు మాత్రమే కాకుండా, కైలాక్ విజయానికి నిదర్శనం.

ఈ మైలురాయి సాధించడమే స్కోడా కైలాక్‌పై కస్టమర్ల విశ్వాసం ఎంత బలంగా ఉందో చూపిస్తోంది. తీవ్రమైన పోటీ ఉన్న సబ్-4 మీటర్ SUV సెగ్మెంట్‌లో కూడా, కైలాక్ తక్కువ సమయంలోనే ఇంత పెద్ద సంఖ్యను చేరుకోవడం నిజంగా ప్రశంసనీయం. మొత్తంగా చూస్తే, స్కోడా కైలాక్ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని, రాబోయే రోజుల్లో ఇది మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
స్కోడా కైలాక్ విజయానికి వెనుక ఉన్న మరో ముఖ్యమైన అంశం దాని తయారీ కేంద్రం, ధర. స్కోడా ఇండియాకు చెందిన ప్రధాన తయారీ ఫ్యాక్టరీ మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణేలో ఉంది. ఇదే ఫ్యాక్టరీలో స్కోడా కైలాక్‌ను పూర్తిగా తయారు చేస్తున్నారు. దేశీయంగా తయారీ జరగడం వల్ల ఖర్చులు నియంత్రణలో ఉండగా, భారతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరను చాలా ఆకర్షణీయంగా నిర్ణయించడానికి స్కోడాకు అవకాశం లభించింది.

ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర కేవలం రూ. 7.59 లక్షలు(ఎక్స్-షోరూమ్) మాత్రమే. ఈ ధరతో, స్కోడా ఇప్పటివరకు భారతదేశంలో విక్రయించిన కార్లలోనే అత్యంత చౌకైన మోడల్‌గా గుర్తింపు పొందింది. సాధారణంగా స్కోడా అంటే ప్రీమియం బ్రాండ్ అన్న భావన ఉండగా, అంత తక్కువ ధరకు ఒక SUVని అందించడం కస్టమర్లను భారీగా ఆకర్షించింది. అంతేకాదు, నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉండటం కైలాక్‌కు మరో పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.
పనితీరు విషయానికి వస్తే, స్కోడా కైలాక్ తన సెగ్మెంట్‌లో బలమైన ఇంప్రెషన్‌ను సృష్టిస్తోంది. ఈ కాంపాక్ట్ SUVలో 1.0 లీటర్, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ను అందిస్తున్నారు. ఇంజిన్ ఎంపిక ఒక్కటే అయినప్పటికీ, పనితీరు పరంగా వినియోగదారులను పూర్తిగా సంతృప్తిపరచగల శక్తిని కలిగి ఉంది. టర్బో టెక్నాలజీ కారణంగా తక్కువ ఆర్‌పిఎమ్ నుంచే మంచి పికప్ అందిస్తూ, నగర డ్రైవింగ్‌తో పాటు హైవే ప్రయాణాల్లో కూడా స్మూత్ అనుభూతిని ఇస్తుంది.

ఈ ఇంజిన్ గరిష్టంగా 115 PS శక్తిను, అలాగే 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసేలా ప్రత్యేకంగా ట్యూన్ చేయబడింది. ఈ అవుట్‌పుట్ సంఖ్యలు చూస్తేనే, స్కోడా కైలాక్ కేవలం లుక్ పరంగానే కాదు, డ్రైవింగ్ అనుభూతి పరంగానూ ఒక అడుగు ముందుందనే విషయం అర్థమవుతుంది. ఓవర్‌టేకింగ్ సమయంలో అవసరమైన పంచ్, లోడ్‌తో ప్రయాణించినప్పటికీ ఇంజిన్ చూపించే స్థిరత్వం ఈ SUVకి ప్లస్ పాయింట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








