647 కిమీ రేంజ్, 28 నిమిషాల్లోనే 80% ఛార్జింగ్.. కియా, హ్యుందాయ్ కంపెనీలకు పోటీ ఇవ్వనున్న కొత్త స్కోడా SUV

ప్రముఖ అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ స్కోడా (Skoda) ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఒక భారీ అడుగు వేసింది. భారత్‌లో ప్రస్తుతం ఐసీఈ (ICE) పెట్రోల్, డీజిల్ కార్లపై ఫోకస్ చేస్తున్న ఈ కంపెనీ, గ్లోబల్ మార్కెట్ల కోసం తమ మోస్ట్ పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ స్కోడా పీక్ (Skoda Peaq)ను అధికారికంగా ఆవిష్కరించింది. స్కోడా ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో ఇది అత్యంత టాప్ ఎండ్ మోడల్‌గా నిలవనుంది. ఇది మార్కెట్లోకి వస్తే.. ప్రస్తుతం లగ్జరీ ఈవీ సెగ్మెంట్‌లో ఉన్న కియా EV9, హ్యుందాయ్ ఐయోనిక్ 9, వోల్వో EX90 వంటి ఫుల్ సైజ్ లగ్జరీ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సరికొత్త స్కోడా పీక్ ఎలక్ట్రిక్ కారును కస్టమర్ల అవసరాలకు తగ్గట్లుగా 60, 90, 90x అనే మూడు విభిన్న వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని బేస్ వేరియంట్ పీక్ 60లో 63kWh బ్యాటరీని ఇచ్చారు, ఇది 459 కిమీల రేంజ్‌ను, 204hp పవర్‌ను జనరేట్ చేస్తుంది.

skoda peaq flagship electric suv global debut range charging price features news

ఇక మిడ్ వేరియంట్ పీక్ 90లో పెద్దదైన 91kWh బ్యాటరీ కలదు, ఇది సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 647 కిమీల అద్భుతమైన రేంజ్‌ను, 286hp పవర్‌ను ఆఫర్ చేస్తుంది. ఇవి రెండు రేర్-వీల్-డ్రైవ్ (RWD) ఆప్షన్లు కాగా.. టాప్ ఎండ్ పీక్ 90x వేరియంట్ ఆల్-వీల్-డ్రైవ్ (AWD) డ్యూయల్ మోటార్ సిస్టమ్‌తో, 299hp పవర్, 613 కిమీల రేంజ్‌ను అందిస్తుంది.

పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. టాప్ ఎండ్ మోడల్ పీక్ 90x కేవలం 6.7 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీల వేగాన్ని అందుకుంటుంది. ఛార్జింగ్ విషయంలో కూడా స్కోడా సరికొత్త రికార్డులను సృష్టించింది. 199kW డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించడం ద్వారా ఇందులోని పెద్దదైన 91kWh బ్యాటరీని కేవలం 28 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతానికి ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే బేస్ మోడల్ లోని 63kWh బ్యాటరీని 160kW డీసీ ఛార్జర్ సహాయంతో కేవలం 27 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. దీనివల్ల లాంగ్ రైడ్స్ వెళ్లే వారికి ఛార్జింగ్ టెన్షన్ అస్సలు ఉండదు.

skoda peaq flagship electric suv global debut range charging price features news

స్కోడా పీక్ కారును కంపెనీ తమ సరికొత్త మోడ్రన్ సాలిడ్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించింది. కారు ముందు భాగంలో ఎల్‌ఈడీ వర్టికల్ స్లాట్స్ ఉన్న గ్లోస్-బ్లాక్ టెక్ డెక్ గ్రిల్, టీ-షేప్ మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, ఐబ్రో-షేప్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు చాలా అగ్రెసివ్ లుక్‌ను ఇస్తాయి.

ఎరోడైనమిక్స్ మెరుగుపరచడానికి వీలుగా కారుకు ఫార్వర్డ్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 19 నుంచి 21 ఇంచుల పెద్ద ఏరో-ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. కారు వెనుక భాగంలో కూడా సన్నని టీ-షేప్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ ఆకట్టుకుంటాయి. ఈ కారులో వెనుక సీట్లు ఫోల్డ్ చేస్తే ఏకంగా 935 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది.

కారు లోపలి భాగం (Cabin) డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్ థీమ్‌తో చాలా లగ్జరీగా ఉంటుంది. ఇందులో 13.6-ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, బ్రాండ్ నేమ్ ఉన్న హీటెడ్ టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను అందించారు. వినోదం కోసం 16-స్పీకర్ల ప్రీమియం సోనోస్ (Sonos) సౌండ్ సిస్టమ్, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్ కలవు.

skoda peaq flagship electric suv global debut range charging price features news

వినూత్నంగా ఇందులో బై-డైరెక్షనల్ ఛార్జింగ్ (V2L) ఫీచర్‌ను ఇచ్చారు, దీని ద్వారా కారు బ్యాటరీ నుంచి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు లేదా మీ ఇంటి పవర్ గ్రిడ్‌కు కూడా కరెంట్ ఇచ్చుకోవచ్చు. అలాగే మీ స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్‌తోనే కారును లాక్, అన్‌లాక్ చేయవచ్చు.

భద్రత విషయంలో స్కోడా ఎప్పుడూ టాప్ లో ఉంటుంది. ఈ పీక్ ఈవీలో స్టాండర్డ్‌గా ఏకంగా 10 ఎయిర్‌బ్యాగ్‌లను అందించారు. వీటితో పాటు 360-డిగ్రీ కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) సూట్, ఆటో పార్క్ అసిస్ట్ వంటి అద్భుతమైన ఫీచర్లను జోడించారు.

వైపర్‌తో పాటే వాషర్ ఇంటిగ్రేట్ అయి వచ్చే సరికొత్త ఫీచర్ కలిగిన మొదటి స్కోడా కారు ఇదే కావడం విశేషం. అంతేకాకుండా వినియోగదారుల కోసం ఆప్షనల్ రేంజ్‌లో ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) బేస్డ్ హెడ్-అప్ డిస్‌ప్లే (HUD)ని కూడా స్కోడా ఆఫర్ చేస్తోంది. గ్లోబల్ మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర అంచనా ప్రకారం రూ.15 లక్షల నుంచి రూ.21 లక్షల ఎక్స్-షోరూమ్ రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.

Article Published On: Wednesday, June 24, 2026, 17:15 [IST]
English summary
Skoda peaq flagship electric suv global debut range charging price features news
Read more on: #skoda #electric car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+