బొమ్మలాగా కనిపించే చిన్న కారు.. 228 కి.మీ వెళ్లొచ్చు.. ముందు వైపే డోర్, ఇద్దరికే సీట్లు!

ప్రపంచవ్యాప్తంగా చిన్న పరిమాణంలోని కార్లకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. ముఖ్యంగా యూరప్ వంటి దేశాల్లో ఇరుకైన రోడ్లు, పార్కింగ్ సమస్యలు ఎక్కువగా ఉండటంతో చిన్న కార్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. తక్కువ ధర, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, నగరాల్లో సులభంగా నడపగలగడం వంటి కారణాలతో ఈ కార్లను ఎక్కువ మంది ఎంచుకుంటారు. అయితే భారతదేశంలో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ఒకప్పుడు సామాన్యుల కారు అనే పేరుతో టాటా మోటార్స్ తీసుకొచ్చిన టాటా నానో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ ప్రపంచ మార్కెట్లో నానో కంటే కూడా చిన్న పరిమాణంలో ఉండే కార్లు ఇప్పటికీ విజయవంతంగా అమ్ముడవుతున్నాయి.

అలాంటి కార్లలో అత్యంత ఆసక్తికరమైన మోడల్ 'మైక్రోలినో (Microlino)'. యూరప్‌కు చెందిన మైక్రో కంపెనీ తయారు చేస్తున్న ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు, ప్రస్తుతం పలు యూరోపియన్ దేశాల్లో విక్రయించబడుతోంది. సైజు పరంగా భారత మార్కెట్లో లభించే ఎంజీ కామెట్ EV కంటే చిన్నది. దీని పొడవు కేవలం 2,519 మిల్లీమీటర్లు మాత్రమే. మహీంద్రా XUV 7XO వంటి మధ్యతరహా SUV పొడవులో దాదాపు సగం మాత్రమే ఉంటుంది.

Smallest Electric Car Microlino Specifications And Price Details Inside

అలాగే దీని వెడల్పు 1,473 మిల్లీమీటర్లు, ఎత్తు 1,501 మిల్లీమీటర్లు మాత్రమే కావడంతో నగర రోడ్లపై చాలా సులభంగా ప్రయాణించగలదు. ఇరుకైన వీధులు, రద్దీ ప్రాంతాలు, చిన్న పార్కింగ్ స్థలాల్లో కూడా ఈ కారును సులభంగా ఉపయోగించుకోవచ్చు. మైక్రోలినోను మొదటిసారి చూసిన వారిని ఆశ్చర్యపరిచే అంశం దీని డిజైన్. సాధారణ కార్ల మాదిరిగా పక్కల డోర్లు ఇందులో ఉండవు. ఈ కారుకు ప్రధాన డోర్ ముందు భాగంలోనే ఉంటుంది.

అంటే బోనెట్ ఉన్న చోటే డోర్ అమర్చారు. డోర్‌ను తెరిచిన వెంటనే స్టీరింగ్ వీల్ కూడా డోర్‌తో పాటు బయటకు వస్తుంది. అందువల్ల కారులోకి ఎక్కడం, బయటకు దిగడం చాలా సులభం. ఈ ప్రత్యేకమైన డిజైన్ పాతకాలపు క్లాసిక్ కార్లను గుర్తు చేస్తూనే ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త గుర్తింపును తీసుకొచ్చింది. ఈ కారులో ఇద్దరు వ్యక్తులు కూర్చునేలా క్యాబిన్‌ను రూపొందించారు. నగర ప్రయాణాలకు ఇది చాలా అనువుగా ఉంటుంది.

Smallest Electric Car Microlino Specifications And Price Details Inside

సాధారణ కార్లతో పోలిస్తే దీని రూపం పూర్తిగా భిన్నంగా ఉండటంతో ఎక్కడ కనిపించినా అందరి దృష్టిని ఆకర్షించే ప్రత్యేకత మైక్రోలినోకు ఉంది. పరిమాణంలో చిన్నదైనా, పనితీరు విషయంలో మాత్రం మైక్రోలినో ఏమాత్రం తక్కువ కాదు. ఇందులో 17 hp పవర్, 17.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే రియర్-వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించారు. దీనికి 15 kWh NCA (నికెల్ కోబాల్ట్ అల్యూమినియం) బ్యాటరీ ప్యాక్ జత చేశారు.

ఈ సెటప్‌తో ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 228 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. అలాగే దీని గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. ఛార్జింగ్ విషయానికి వస్తే, 2.2 kW టైప్-2 AC ఛార్జర్‌తో బ్యాటరీని 0-80 శాతం వరకు సుమారు 5.5 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. అంతేకాకుండా, మరింత శక్తివంతమైన మోటార్, ఎక్కువ వేగంతో వచ్చే ఇతర మైక్రోలినో వేరియంట్లను కూడా కంపెనీ విక్రయిస్తోంది.

Smallest Electric Car Microlino Specifications And Price Details Inside

అయితే ఈ కారులో చిన్నది కానిది ఒక్కటే ఉంది.. అది ధర. యూరప్‌లో ఈ ఎలక్ట్రిక్ కారు భారత కరెన్సీలో సుమారు రూ.18 లక్షల నుంచి రూ.29 లక్షల మధ్య విక్రయించబడుతోంది. ఇటీవల యూరప్ వెలుపల తొలిసారిగా మలేషియాలో కూడా దీనిని ప్రదర్శించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మైక్రోలినో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

Article Published On: Wednesday, July 1, 2026, 11:37 [IST]
English summary
Smallest electric car microlino specifications and price details inside
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+