లక్షలు ఆదా చేసుకోండి.. బేస్ వేరియంట్ లోనే ప్రీమియం ఫీచర్లను ఎంజాయ్ చేయండి

మధ్యతరగతి భారతీయుడికి కారు అనేది ఒక వాహనం మాత్రమే కాదు.. వారికి అదో భావోద్వేగం. అందులోనూ ఎస్‌యూవీ(SUV) అంటే ఉండే క్రేజే వేరు. దర్జాగా రోడ్డుపై వెళ్తుంటే వచ్చే ఆ రాజసం కోసం చాలామంది తమ బడ్జెట్‌ను దాటి మరీ అప్పులు చేసి టాప్ ఎండ్ మోడల్స్ కొంటుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి.. కేవలం కొన్ని అదనపు హంగుల కోసం లక్షల రూపాయలు ఎందుకు తగలేయాలి? ఒకప్పుడు బేస్ మోడల్ అంటే స్టీరింగ్, టైర్లు తప్ప లోపల ఏమీ ఉండేవి కావు.

కానీ ఇప్పుడు కాలం మారింది. మార్కెట్లో పెరిగిన పోటీ వల్ల కంపెనీలే దిగొచ్చి బేస్ మోడల్స్‌లోనే ప్రీమియం ఫీచర్లను దట్టించి ఇస్తున్నాయి. అందుకే తెలివైన వారు ఇప్పుడు టాప్ మోడల్ జోలికి వెళ్లకుండా, బేస్ వేరియంట్ కొని ఆ మిగిలిన డబ్బుతో కొన్నేళ్ల పాటు పెట్రోల్ ఖర్చులను వెనకేసుకుంటున్నారు. మరి బేస్ మోడల్ కొన్నా టాప్ ఎండ్ ఫీలింగ్ ఇచ్చే ఆ 5 అదిరిపోయే ఎఎస్‌యూవీల గురించి వివరంగా తెలుసుకుందాం.

Smart Buyers Guide Top 5 SUVs in India with Feature-Packed Base Models

1. కియా సెల్టోస్ (Kia Seltos):
ఎస్‌యూవీ విభాగంలో కియా సెల్టోస్ ఒక ట్రెండ్ సెట్టర్. ఫీచర్ల విషయంలో కియాను కొట్టేవాడే లేడు అనే లెవల్‎కు ఈ కారు చేరుకుంది. చాలా కార్లలో బేస్ వేరియంట్ అంటే చిన్న రేడియో సెట్ ఇస్తారు, కానీ సెల్టోస్‌లో ఏకంగా 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12-అంగుళాల డిజిటల్ క్లస్టర్ వంటి హై-ఎండ్ ఫీచర్లు బేస్ మోడల్ నుంచే మొదలవుతాయి.

లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు సౌకర్యంగా ఉండేలా క్రూయిజ్ కంట్రోల్, పవర్ విండోలు, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎంలు (ORVMs) కూడా ఉన్నాయి. రూ.10.99 లక్షలకే ఈ స్థాయి ఫీచర్లు అంటే, ఇది నిజంగా కస్టమర్లకు లాభదాయకమైన డీల్. టాప్ ఎండ్ కోసం రూ.20 లక్షలు పెట్టలేని వారికి ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయం.

Smart Buyers Guide Top 5 SUVs in India with Feature-Packed Base Models

2. స్కోడా కుషాక్ (Skoda Kushaq):
యూరోపియన్ కార్లంటేనే సేఫ్టీకి, లగ్జరీకి కేరాఫ్ అడ్రస్. స్కోడా కుషాక్ విషయంలో కంపెనీ ఒక అడుగు ముందుకు వేసి, బేస్ మోడల్ లోనే సామాన్యుడి కలను నిజం చేస్తోంది. సాధారణంగా బేస్ మోడల్స్ లో సన్‌రూఫ్ ఊహించలేము, కానీ కుషాక్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తో పాటు సన్‌రూఫ్ కూడా లభిస్తుంది.

దీనికి తోడు 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇవ్వడం విశేషం. రూ.10.69 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ కారు, బేస్ మోడల్ కొన్నా సరే పక్కన ఉన్న వారికి ఇది టాప్ ఎండ్ కారు అనే భ్రమ కలిగిస్తుంది.

Smart Buyers Guide Top 5 SUVs in India with Feature-Packed Base Models

3. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue):
హ్యుందాయ్ వెన్యూ బేస్ వేరియంట్ మధ్యతరగతి ఫ్యామిలీలకు ఒక వరమనే చెప్పాలి. కేవలం రూ.7.99 లక్షల నుండే ప్రారంభమయ్యే ఈ కారులో, లగ్జరీ కార్లలో ఉండే 10.25 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేను అందించారు.

వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేస్తాయి. ముఖ్యంగా వేసవిలో వెనుక కూర్చునే వారికి ఇబ్బంది లేకుండా రియర్ ఏసీ వెంట్స్ ఇవ్వడం మెచ్చుకోదగ్గ విషయం. బడ్జెట్ తక్కువగా ఉండి, కారులో అన్ని సౌకర్యాలు కావాలనుకునే వారికి వెన్యూ బేస్ మోడల్ పర్ఫెక్ట్ ఛాయిస్.

Smart Buyers Guide Top 5 SUVs in India with Feature-Packed Base Models

4. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun):
ఫోక్స్‌వ్యాగన్ టైగన్ బేస్ వేరియంట్ ఒక కంప్లీట్ ప్యాకేజీ. జర్మన్ ఇంజనీరింగ్ తో తయారైన ఈ కారులో బిల్డ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఎల్ఈడీ లైట్లు, అలాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్ వంటివి బేస్ వేరియంట్ లోనే అందుబాటులో ఉన్నాయి.

సేఫ్టీ విషయంలో రాజీ పడకుండా 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ గా ఇస్తున్నారు. రూ.10.99 లక్షల ధరలో ఒక క్లాస్ లక్ తో కూడిన పవర్‌ఫుల్ ఎఎస్‌యూవీ కావాలనుకుంటే టైగన్ ను మించిన ఆప్షన్ లేదు.

Smart Buyers Guide Top 5 SUVs in India with Feature-Packed Base Models

5. రెనాల్ట్ డస్టర్ (Renault Duster):
భారతదేశంలో ఎఎస్‌యూవీ క్రేజ్ మొదలైందే డస్టర్ తో. ఇప్పుడు మళ్ళీ కొత్త రూపంలో వస్తున్న డస్టర్, తన బేస్ వేరియంట్ లోనే 17-అంగుళాల స్టీల్ వీల్స్, ఎల్ఈడీ లైట్స్, 7-అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే వంటి మోడ్రన్ ఫీచర్లను అందిస్తోంది.

దీని రోడ్ ప్రజెన్స్, కంఫర్ట్ లెవల్స్ టాప్ ఎండ్ కార్లకు ఏమాత్రం తీసిపోవు. రూ.10.49 లక్షల ప్రారంభ ధరతో వచ్చే ఈ కారు, కఠినమైన రోడ్లపై కూడా సునాయాసంగా వెళ్ళగలదు. బేస్ మోడల్ కొని దానిని మనకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకునే వీలు కూడా ఇందులో ఉంది.

కారు అనేది అవసరం కోసం కొనేది, కేవలం ప్రదర్శన కోసం లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేయడం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అంత మంచి నిర్ణయం కాదు. పైన చెప్పిన 5 ఎఎస్‌యూవీలు తమ బేస్ మోడల్స్‌లోనే అత్యవసరమైన, విలాసవంతమైన ఫీచర్లను అందిస్తున్నాయి. మీరు స్మార్ట్ బయర్ అయితే ఈ బేస్ వేరియంట్లను పరిశీలించి మీ బడ్జెట్ ను కాపాడుకోవచ్చు.

Article Published On: Tuesday, April 28, 2026, 17:26 [IST]
English summary
Smart buyers guide top 5 suvs in india with feature packed base models
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+