ఆటోమొబైల్ చరిత్రలోనే ఇలాంటి ఆఫర్ ఉండదు.. కారు కొని మూడేళ్లు వాడుకున్న కంపెనీ 75శాతం క్యాష్ ఇస్తుంది

సొంతంగా ఒక లగ్జరీ ఎస్‌యూవీ (SUV) కారు కొనాలని కలలు కనే వారికి మార్కెట్లో అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా కొత్త కారు కొని కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత దాని రీసేల్ వాల్యూ (సెకండ్ హ్యాండ్ ధర) సగానికి పైగా పడిపోతుంది. కానీ, ప్రస్తుతం ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కస్టమర్ల కోసం అదిరిపోయే అష్యూర్డ్ బైబ్యాక్ ఆఫర్లను లైవ్ చేశాయి.

ఈ ప్రత్యేకమైన స్కీమ్ కింద కారును కొనుగోలు చేసి, కొన్ని సంవత్సరాల పాటు వాడుకున్న తర్వాత తిరిగి కంపెనీకే ఇచ్చేయవచ్చు. దీనికి బదులుగా కంపెనీ సదరు కారు అసలు ఎక్స్-షోరూమ్ ధరలో గరిష్టంగా 75 శాతం వరకు డబ్బును తిరిగి కస్టమర్‌కు చెల్లిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మూడు అత్యుత్తమ ఎస్‌యూవీలపై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

suv assured buyback offers india volkswagen taigun jeep compass meridian price specifications

ఫాక్స్ వ్యాగన్ టైగన్‌పై దేశంలోనే హయ్యెస్ట్ బైబ్యాక్ ఆఫర్
జర్మన్ కార్ల తయారీ దిగ్గజం ఫోక్స్ వ్యాగన్ (Volkswagen) ఇటీవల భారత మార్కెట్లో లాంచ్ చేసిన తన సరికొత్త ఫేస్‌లిఫ్టెడ్ టైగన్ (Taigun) ఎస్‌యూవీపై ఎవరూ ఊహించని రేంజ్‌లో ఏకంగా 75 శాతం అష్యూర్డ్ బైబ్యాక్ వాల్యూను ప్రకటించింది. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ (ICE) వాహనాలపై లభిస్తున్న అత్యధిక బైబ్యాక్ ఆఫర్లలో ఇది ఒకటి కావడం విశేషం.

కంపెనీ నిబంధనల ప్రకారం.. కస్టమర్ కారు కొన్న తర్వాత మూడేళ్ల ఓనర్‌షిప్ ముగిశాక, దాని ఒరిజినల్ ఎక్స్-షోరూమ్ ధరలో 75 శాతాన్ని తిరిగి పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్ కేవలం 30,000 కిలోమీటర్ల లోపు తిరిగిన కార్లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో టైగన్ ధర రూ. 10.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 19.29 లక్షల వరకు ఉంది. ఇందులో 115 PS పవర్ ఇచ్చే 1.0-లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్ కలదు.

suv assured buyback offers india volkswagen taigun jeep compass meridian price specifications

జీప్ కంపాస్‌పై కాన్ఫిడెన్స్ 7 ప్యాకేజీ ధమాకా
ప్రముఖ లగ్జరీ ఎస్‌యూవీల బ్రాండ్ జీప్ (Jeep) సైతం తన కస్టమర్ల కోసం కాంప్రహెన్సివ్ కాన్ఫిడెన్స్ 7 ఓనర్‌షిప్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక ప్రోగ్రామ్ కింద జీప్ కంపాస్ (Jeep Compass) కొనుగోలు చేసే కస్టమర్లకు గరిష్టంగా మూడు సంవత్సరాల తర్వాత అసలు ఎక్స్-షోరూమ్ ధరపై 60 శాతం వరకు బైబ్యాక్ గ్యారెంటీ లభిస్తుంది. అయితే కారు అంతిమ ధర అది తిరిగిన మైలేజ్, కారు కండిషన్, వయస్సుపై ఆధారపడి ఉంటుంది.

కంపాస్ మోడల్ కోసం ఈ కాన్ఫిడెన్స్ 7 ప్యాకేజీ ధరను రూ.41,926గా నిర్ణయించారు. బైబ్యాక్ ఆఫర్‌తో పాటు కస్టమర్లకు 7 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ, 7 ఏళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, లాంగ్ టర్మ్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ వంటి అదనపు ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి. జీప్ కంపాస్ ప్రస్తుత ధర రూ. 17.99 లక్షల నుంచి రూ. 30.70 లక్షల మధ్య ఉంది.

suv assured buyback offers india volkswagen taigun jeep compass meridian price specifications

జీప్ మెరిడియన్‌పై కూడా భారీగా క్యాష్ బ్యాక్ గ్యారెంటీ
జీప్ ఇండియా కంపెనీకి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్లాగ్‌షిప్ 7-సీటర్ ఎస్‌యూవీ జీప్ మెరిడియన్ (Jeep Meridian) పై కూడా ఈ బైబ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. కంపాస్ లాగే దీనిపై కూడా కాన్ఫిడెన్స్ 7 ప్యాకేజీని కంపెనీ అందిస్తోంది. మెరిడియన్ కారును కొనుగోలు చేసిన కస్టమర్లు మూడేళ్ల తర్వాత కారును తిరిగి ఇచ్చేసి, ఎక్స్-షోరూమ్ ధరపై 60 శాతం వరకు అష్యూర్డ్ బైబ్యాక్ వాల్యూను సొంతం చేసుకోవచ్చు.

ఈ కారు మైలేజ్, మెయింటెనెన్స్ కండిషన్ ఆధారంగా ఫైనల్ రిటర్న్ అమౌంట్ లెక్కించబడుతుంది. మెరిడియన్ కస్టమర్ల కోసం ఈ ప్యాకేజీ ధర రూ. 47,024 గా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో జీప్ మెరిడియన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 23.33 లక్షల నుంచి ప్రారంభమై రూ. 37.82 లక్షల వరకు పలుకుతోంది. కారు రీసేల్ టెన్షన్ లేకుండా లగ్జరీ రైడ్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ ఆఫర్స్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Article Published On: Friday, June 5, 2026, 14:36 [IST]
English summary
Suv assured buyback offers india volkswagen taigun jeep compass meridian price specifications
Read more on: #volkswagen #jeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+