జనాలు ఎగబడికొంటున్న కారుకు స్పోర్ట్ ఎడిషన్ వచ్చేసింది.. అదిరిపోయే లుక్స్, లగ్జరీ ఫీచర్లు!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకికి చెందిన పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్‎లో సరికొత్త స్పోర్ట్ (Fronx Sport) వేరియంట్‌ను లాంచ్ చేసింది. మలేషియా మార్కెట్లో అధికారికంగా విడుదలైన ఈ మోడల్, రెగ్యులర్ వేరియంట్ కంటే ఎంతో స్టైలిష్‌గా, అగ్రెసివ్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా దీని డిజైన్‌ను రూపుదిద్దారు.

ఇండోనేషియా నుంచి సిబీయూ (CBU) యూనిట్‌గా మలేషియాకు ఇంపోర్ట్ చేయడం వల్ల అక్కడ ఈ కారు ధరలు కాస్త ప్రీమియం రేంజ్‌లో ఉన్నాయి. మలేషియా కరెన్సీ ప్రకారం బేస్ వేరియంట్ ధర MYR 1,18,888 (సుమారు రూ.27.89 లక్షలు) కాగా, కొత్త ఫ్రాంక్స్ స్పోర్ట్ ఎడిషన్ ధర MYR 1,30,888 (సుమారు రూ.30.70 లక్షలు)గా ఉంది.

suzuki fronx sport edition launched features price specifications updates

మరింత అగ్రెసివ్ లుక్.. స్పోర్టీ డిజైన్
ఈ సరికొత్త స్పోర్ట్ ఎడిషన్‌లో కంపెనీ ఒక ప్రత్యేకమైన బాడీ కిట్‌ను పరిచయం చేసింది. కారు ఫ్రంట్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. పూర్తి బ్లాక్-అవుట్ గ్రిల్‌తో పాటు సుజుకి లోగోను కూడా బ్లాక్ ఫినిషింగ్‌తో ఇచ్చారు. బంపర్ కింది భాగంలో కొత్త లోయర్ లిప్ ఎక్స్‌టెన్షన్‌ను జత చేయడం వల్ల కారుకు మరింత అగ్రెసివ్ లుక్ వచ్చింది. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త సైడ్ స్కర్ట్స్, పెద్ద సైజులో ఉండే Fronx Sport డెకల్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి.

కస్టమర్లు కావాలనుకుంటే కాంటినెంటల్ అల్ట్రాకాంటాక్ట్ UC7 టైర్లతో కూడిన 17-ఇంచుల పెద్ద అల్లాయ్ వీల్స్ ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు. కారు వెనుక భాగంలో కొత్త రియర్ డిఫ్యూజర్, టెయిల్ గేట్ స్పాయిలర్ దీని స్పోర్టీ క్యారెక్టర్‌ను మరింత పెంచాయి. ఈ మోడల్ కూల్ బ్లాక్ (మోనోటోన్), పర్ల్ స్నో వైట్ విత్ కూల్ బ్లాక్ (డ్యూయల్ టోన్) అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.

నెక్స్ట్ లెవెల్ ఫీచర్లు.. లగ్జరీ ఇంటీరియర్
ఇంటీరియర్ పరంగా చూస్తే ఈ స్పోర్ట్ ఎడిషన్‌లో చేసిన అతిపెద్ద మార్పు.. కారుకు ముందు, వెనుక వైపులా 4K డ్యాష్‌క్యామ్‌లను (Dashcams) అమర్చడం. ఇది ప్రయాణాల్లో సేఫ్టీకి ఎంతో ఉపయోగపడుతుంది. మిగిలిన ఫీచర్లు దాదాపు బేస్ వేరియంట్ లాగే ఉన్నాయి. ఇందులో లెదర్ ఫినిషింగ్ ఉన్న త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, షిఫ్ట్ ప్యాడల్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు స్టీరింగ్ అడ్జస్ట్‌మెంట్ కోసం టిల్ట్, టెలిస్కోపిక్ ఫీచర్‌ను కూడా అందించారు.

suzuki fronx sport edition launched features price specifications updates

అడ్వాన్స్‌డ్ ఏడీఏఎస్ సేఫ్టీ
భద్రత విషయంలో సుజుకి ఈ కారులో ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లను జోడించారు. బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ చేంజ్ అసిస్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

అలాగే లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, వెహికల్ స్వే వార్నింగ్ వంటివి డ్రైవింగ్‌ను మరింత సురక్షితం చేస్తాయి. వీటితో పాటు స్టాండర్డ్ ఫీచర్లుగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఐసోఫిక్స్ (ISOFIX) చైల్డ్ సీట్ యాంకర్లను కూడా అందించారు.

పవర్ఫుల్ హైబ్రిడ్ ఇంజన్
మలేషియా మార్కెట్లో లభించే సుజుకి ఫ్రాంక్స్ కారులో కేవలం K15C 1.5-లీటర్, 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను మాత్రమే అందించారు. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ISG) కలిగిన ఈ మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ 103 PS పవర్‌ను, 138 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.

ఈ హైబ్రిడ్ సిస్టమ్ వల్ల కారు స్టార్ట్-స్టాప్, ఎక్సలరేషన్ సులువుగా మారడమే కాకుండా మైలేజ్ కూడా అద్భుతంగా వస్తుంది. అయితే భారతదేశంలో లభించే మారుతి ఫ్రాంక్స్ కారులో మాత్రం 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

Article Published On: Monday, June 8, 2026, 7:34 [IST]
English summary
Suzuki fronx sport edition launched features price specifications updates
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+