రోడ్ల మీద ఎక్కడ చూసినా ఈ కంపెనీ బైకులే..కోటి మైలురాయిని దాటేసిన జపాన్ టెక్నాలజీ

జపాన్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ సుజుకి (Suzuki) భారతీయ రోడ్లపై సరికొత్త చరిత్ర సృష్టించింది. తన జైత్రయాత్రలో మైలురాయి లాంటి ఘనతను అందుకుంది. హర్యానాలోని గురుగ్రామ్ ప్లాంట్ నుండి 10 మిలియన్ల (కోటి)వ వాహనాన్ని విడుదల చేసి, భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. భారతీయులకు సుజుకి అంటే కేవలం ఒక బ్రాండ్ కాదు, అదొక నమ్మకం అని ఈ ఘనత మరోసారి నిరూపించింది.

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తన ప్రయాణాన్ని 2006లో ప్రారంభించింది. తొలి 50 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయడానికి 14 ఏళ్లు (2020 వరకు) సమయం పట్టింది. కానీ, ఆ తర్వాత సుజుకి వేగం పుంజుకుంది. కేవలం ఐదు ఆరేళ్లలోనే మిగిలిన 50 లక్షల వాహనాలను తయారు చేసి, నేడు కోటి(10 మిలియన్ల) మార్కును చేరుకుంది. ఈ చారిత్రాత్మక ఘనతకు గుర్తుగా 10 మిలియన్ల వ వాహనంగా సుజుకి ఆక్సెస్ రైడ్ కనెక్ట్ స్కూటర్‌ను ప్లాంట్ నుంచి విడుదల చేశారు.

Suzuki 10 Million Milestone India

సుజుకి విజయగాథలో యాక్సెస్ 125 స్కూటర్ ది కీలక పాత్ర. 125cc స్కూటర్ల విభాగంలో ఆక్సెస్ ఒక విప్లవాన్ని తెచ్చింది. మూడు తరాలుగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అప్‌డేట్ అవుతూ, మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన స్కూటర్‌గా నిలిచింది. నేడు కోటి వాహనాల ఘనతలో అత్యధిక వాటా ఈ స్కూటర్‌దే కావడం విశేషం. ఆక్సెస్‌తో పాటు బర్గ్మన్, అవెనిస్ వంటి మోడళ్లు కూడా మార్కెట్లో దుమ్మురేపుతున్నాయి.

భారతదేశం కేవలం సుజుకికి మార్కెట్ మాత్రమే కాదు, ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారింది. భారత్‌లో తయారైన సుజుకి బైకులు, స్కూటర్లు నేడు 60 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 1,200 కంటే ఎక్కువ టచ్ పాయింట్లు ఉన్నాయి. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి హర్యానాలోని ఖార్ఖోడాలో తన రెండవ భారీ ఉత్పత్తి కేంద్రాన్ని సుజుకి నిర్మిస్తోంది.

Suzuki 10 Million Milestone India

కేవలం స్కూటర్లే కాదు, బైకుల విభాగంలో కూడా సుజుకి తనదైన ముద్ర వేసింది. యువతను ఆకట్టుకునే GIXXER సిరీస్, అడ్వెంచర్ ప్రియుల కోసం V-Strom SX, ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న Hayabusa వంటి మోడళ్లు సుజుకి బ్రాండ్ ఇమేజ్‌ను ఆకాశానికి తీసుకెళ్లాయి. తాజాగా GSX-8R, V-Strom 800 DE వంటి పెద్ద బ్రైకులను కూడా భారత్‌లో ప్రవేశపెట్టి ప్రీమియం సెగ్మెంట్‌లో కూడా పోటీని పెంచింది.

ఈ సందర్భంగా సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమేడ మాట్లాడుతూ.. "10 మిలియన్ల మార్కును చేరుకోవడం మా అందరికీ గర్వకారణం. ఇది కేవలం మా కృషి మాత్రమే కాదు, మాపై నమ్మకం ఉంచిన కోట్లాది మంది కస్టమర్లు, డీలర్లు, మా ఉద్యోగుల విజయం. భవిష్యత్తులో మరింత నాణ్యమైన వాహనాలను అందిస్తూ, కస్టమర్ల మనసులో చెదరని స్థానాన్ని సంపాదించుకుంటాం" అని ఆనందం వ్యక్తం చేశారు. సుజుకి అంటే కేవలం ఒక బ్రాండ్ కాదు, అదొక ఎమోషన్ అని మరోసారి తన బైకుల ద్వారా నిరూపించింది.

More from DriveSpark

Article Published On: Friday, January 9, 2026, 12:19 [IST]
English summary
Suzuki hits 1 crore milestone how access 125 conquered indian roads
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+