ఈ కారు అందం చూస్తే.. పక్కింటోడు అసూయ పడాల్సిందే.. 8 గేర్లతో రోడ్ల మీద రాకెట్లా దూసుకుపోవచ్చు
జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) తన పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ టైగూన్ (Taigun)ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. ఎంతో కాలంగా కస్టమర్లు ఎదురుచూస్తున్న టైగూన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌కు సంబంధించి కంపెనీ తాజాగా ఒక ఆసక్తికరమైన టీజర్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 9, 2026న ఈ కారు ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా లాంచ్ కానుంది.
టీజర్‌తో పెరిగిన అంచనాలు
మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫోక్స్‌వ్యాగన్ టైగూన్, ఇప్పుడు మరింత పవర్‌ఫుల్ అవతారంలో రాబోతోంది. కంపెనీ విడుదల చేసిన టీజర్‌లో కారు నీడ (Shadow) మాత్రమే కనిపిస్తున్నప్పటికీ, అది కారు గంభీరమైన రూపాన్ని స్పష్టం చేస్తోంది. పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో బాహ్య రూపంతో పాటు, సాంకేతిక పరంగా కూడా విప్లవాత్మక మార్పులు ఉండబోతున్నాయని కంపెనీ హింట్ ఇచ్చింది.

డిజైన్‌లో బోల్డ్ మార్పులు
కొత్త టైగూన్ డిజైన్ పరంగా మరింత ఎక్స్‌ప్రెసివ్ గా ఉండబోతోంది. ముఖ్యంగా ముందు భాగంలో రీడిజైన్ చేసిన గ్రిల్, కొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, డే-టైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs) దీనికి ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. బంపర్ డిజైన్‌ను కూడా మార్చడం వల్ల కారు మునుపటి కంటే చాలా మస్కులర్‌గా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త డిజైన్ కలిగిన అలాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వెనుక వైపు టెయిల్ ల్యాంప్స్ క్లస్టర్‌లో కూడా చిన్నపాటి మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
కేబిన్ లోపల లగ్జరీ ఫీచర్లు
కారు లోపలికి వెళ్తే, డాష్‌బోర్డ్ లేఅవుట్ దాదాపు పాతదానిలాగే ఉన్నప్పటికీ, వాడే మెటీరియల్స్, కలర్ థీమ్స్ కొత్తగా ఉంటాయి. తాజాగా లాంచ్ అయిన స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ తరహాలోనే, ఇందులో కూడా అధునాతన టెక్నాలజీని జోడించనున్నారు. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, అప్‌డేటెడ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఇందులో ఉండబోతున్నాయి. కస్టమర్ల కంఫర్ట్ కోసం సీట్ల వెంటిలేషన్, ప్రీమియం సౌండ్ సిస్టమ్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది.

గేర్ బాక్స్‌లో పెను మార్పు
ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో అతిపెద్ద హైలైట్ దాని మెకానికల్ అప్‌డేట్స్. ప్రస్తుత టైగూన్ లోని 1.0 లీటర్ టీఎస్ఐ (TSI) ఇంజన్ అలాగే ఉన్నప్పటికీ, గేర్ బాక్స్ విషయంలో కంపెనీ ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న 6-స్పీడ్ ఆటోమేటిక్ స్థానంలో కొత్తగా 8-స్పీడ్ ఆటోమేటిక్ (8-AT) గేర్ బాక్స్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. దీనివల్ల కారు పర్ఫార్మెన్స్ పెరగడమే కాకుండా, ప్రయాణం మరింత స్మూత్ గా ఉంటుంది. ఇక పవర్‌ఫుల్ 1.5 లీటర్ టీఎస్ఐ ఇంజన్ 7-స్పీడ్ డీసీటీ (DCT) గేర్ బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
బ్రాండ్ డైరెక్టర్ ఏమన్నారంటే?
ఈ సందర్భంగా ఫోక్స్‌వ్యాగన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ నితిన్ కోహ్లీ మాట్లాడుతూ.. "కొత్త టైగూన్ కేవలం ఒక అప్‌డేట్ మాత్రమే కాదు, ఇది ఎవల్యూషన్. డ్రైవింగ్ అంటే ఇష్టపడే వారి కోసం మేము దీన్ని రూపొందించాం. బెస్ట్-ఇన్-సెగ్మెంట్ టెక్నాలజీ, అదిరిపోయే పర్ఫార్మెన్స్ దీని సొంతం. భారతీయ కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా, స్థానికంగా ఇంజనీరింగ్ చేయబడిన ఈ కారు ప్రతిరోజూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది" అని ధీమా వ్యక్తం చేశారు.
మార్కెట్‌లో గట్టి పోటీ
ఏప్రిల్ 9న లాంచ్ కానున్న ఈ కారు మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీని ఇవ్వనుంది. ముఖ్యంగా డ్రైవింగ్ డైనమిక్స్, సేఫ్టీ విషయంలో ఫోక్స్‌వ్యాగన్‌కు ఉన్న మంచి పేరు, కొత్త 8-స్పీడ్ గేర్ బాక్స్ తోడవ్వడం టైగూన్‌కు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. సేఫ్టీ పరంగా కూడా ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏడీఏఎస్ (ADAS) వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








