బొమ్మ కారుని చూసి చిన్నపిల్లాడిలా మురిసిపోయిన సీఎం విజయ్.. రియాక్షన్ నెట్టింట వైరల్!

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఈసారి ఆయన రాజకీయ ప్రసంగం లేదా సినిమా కారణంగా కాదు, ఒక చిన్న టాయ్ కార్ వల్ల నెట్టింట వైరల్ అవుతున్నారు. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (Vinfast) ఆసియా కార్యకలాపాల సీఈఓ ఫామ్ సాన్ చౌ ముఖ్యమంత్రి విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, కంపెనీకి చెందిన ఒక చిన్న కారు మోడల్ (బొమ్మ కారు)ను జ్ఞాపికగా బహుమతిగా అందజేశారు. సాధారణంగా ఇలాంటి బహుమతులను స్వీకరించి పక్కన పెట్టే నాయకులను మనం చూస్తుంటాం. కానీ విజయ్ మాత్రం ఆ టాయ్ కార్‌ను చేతిలోకి తీసుకుని ఎంతో ఆసక్తిగా పరిశీలించారు.

చిన్న పిల్లాడిలా దాన్ని అన్ని కోణాల్లో తిప్పి చూస్తూ, ఎంతో శ్రద్ధగా గమనించారు. ఆయన ముఖంలో కనిపించిన ఆనందం, ఆసక్తి అక్కడ ఉన్న వారినే కాకుండా సోషల్ మీడియాను కూడా ఆకట్టుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. పిల్లలలాంటి అమాయకత్వం ఇంకా అలాగే ఉంది, చిన్న విషయాల్లో కూడా ఆసక్తి చూపడం విజయ్ ప్రత్యేకత అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Tamilnadu Cm Vijay Reaction To Vinfast Toy Car Goes Viral

విజయ్ టాయ్ కార్‌ను ఎంతో కుతూహలంగా పరిశీలించిన తీరు, ఆయన సహజమైన స్పందన ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. చిన్న బహుమతిని కూడా అంతే విలువగా స్వీకరించి ఆనందం వ్యక్తం చేసిన ఆయన వైఖరి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. చిన్న బొమ్మలా కనిపిస్తున్న ఇది ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజ విన్‌ఫాస్ట్ సంస్థకు చెందిన ప్రసిద్ధ VF8 ఎలక్ట్రిక్ SUV చిన్న ప్రతిరూపం.

తయారీదారులు తమ బ్రాండ్ గుర్తింపుగా ఇలాంటి వాటిని ప్రత్యేకంగా అందిస్తుంటారు. VF8 SUVకి నిజమైన మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మంచి ఆదరణ పొందుతోంది. డిజైన్, టెక్నాలజీ, ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ వంటి అంశాలతో ఈ మోడల్ కంపెనీకి కీలక ఉత్పత్తిగా నిలిచింది. విజయ్‌కు బహుమతిగా అందించిన టాయ్ కార్ కూడా ఈ VF8 మోడల్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించిన పాత డిజైన్ వెర్షన్‌గా తెలుస్తోంది.

Tamilnadu Cm Vijay Reaction To Vinfast Toy Car Goes Viral

కాగా, ఇటీవల కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలో మరింత అప్‌డేటెడ్ VF8 మోడల్‌ను కూడా పరిచయం చేసింది. కొత్త విన్‌ఫాస్ట్ VF8లో 60.13 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. డ్రైవింగ్ రేంజ్ విషయానికి వస్తే, ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంటోంది. దీంతో రోజువారీ వినియోగంతో పాటు లాంగ్ డ్రైవ్‌లకు కూడా ఈ SUV అనువుగా ఉంటుంది.

ఛార్జింగ్ పరంగా VF8 ఆకట్టుకుంటుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్ సాయంతో 10 శాతం నుంచి 70 శాతం వరకు బ్యాటరీని 30 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే ఛార్జ్ చేసుకోవచ్చు. దీని వల్ల ఎక్కువసేపు ఛార్జింగ్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రయాణాన్ని త్వరగా కొనసాగించవచ్చు. ఇదిలా ఉంటే, భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా విన్‌ఫాస్ట్ ఇక్కడ తన సత్తా చాటాలని వేగంగా ప్రయత్నాలు చేస్తుంది.

దేశీయ ఉత్పత్తిని బలోపేతం చేసే లక్ష్యంతో తమిళనాడులో అత్యాధునిక కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడమే కాకుండా, భవిష్యత్తులో ఎగుమతులను కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, విన్‌ఫాస్ట్ సంస్థ ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశం సాధారణ మర్యాదపూర్వక భేటీ కంటే ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Article Published On: Wednesday, July 15, 2026, 11:26 [IST]
English summary
Tamilnadu cm vijay reaction to vinfast toy car goes viral
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+