ఫుల్ ఛార్జ్‌తో 585 కిమీల జర్నీ.. బంఫర్ ఆఫర్ భయ్యా.. డిస్కౌంట్‌తో మరో కార్ కొనేయొచ్చు
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు (EV) రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా మన దేశీ బ్రాండ్ టాటా మోటార్స్ ఈవీ విభాగంలో తిరుగులేని రారాజుగా దూసుకుపోతోంది. మీరు కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. టాటా మోటార్స్ తన పాపులర్ కూపే స్టైల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన టాటా కర్వ్ ఈవీ (Tata Curvv EV) పై జూన్ 2026లో బంపర్ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది.
ప్రస్తుతం నడుస్తున్న జూన్ సేల్స్ ఆఫర్లలో భాగంగా సరికొత్త టాటా కర్వ్ ఈవీని కొనుగోలు చేసే కస్టమర్లు గరిష్టంగా రూ.3.35 లక్షల వరకు భారీ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్‌లో నేరుగా ఇచ్చే క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, ఇతర బెనిఫిట్స్ కూడా కలిసి ఉన్నాయి.

అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్లు అనేవి మీరు ఎంచుకునే వేరియంట్, మీ నగరం, డీలర్‌షిప్‌ను బట్టి మారే అవకాశం ఉంది. కాబట్టి కచ్చితమైన వివరాల కోసం కస్టమర్లు తమకు దగ్గరలోని టాటా షోరూమ్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
టాటా కర్వ్ ఈవీ పవర్‌ట్రైన్, మైలేజ్ విషయానికి వస్తే.. ఇందులో కంపెనీ రెండు రకాల పవర్ ఫుల్ బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించింది. మొదటిది 45 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్, ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 502 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

ఇక రెండోది లాంగ్ రేంజ్ కోసం తీసుకొచ్చిన 55 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్. ఇది ఫుల్ ఛార్జ్‌పై ఏకంగా 585 కిలోమీటర్ల దూరం ఎలాంటి బ్రేకులు లేకుండా నాన్‌స్టాప్‌గా పరిగెడుతుందని కంపెనీ గట్టిగా చెప్తోంది. దూర ప్రయాణాలు చేసే వారికి ఈ కార్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి.
ఈ మోడ్రన్ ఎలక్ట్రిక్ కార్ కేవలం మైలేజ్ మాత్రమే కాదు, ఫీచర్ల విషయంలోనూ అదరగొడుతోంది. దీని కేబిన్ లోపల కస్టమర్ల కోసం 12.3-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.25-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.
వీటితో పాటు అదిరిపోయే మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం 9-స్పీకర్ల జేబీఎల్ (JBL) సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి విలాసవంతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కార్ కస్టమర్ల కోసం ఐదు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.

టాటా కార్లు అనగానే సేఫ్టీకి కేరాఫ్ అడ్రస్. కర్వ్ ఈవీలో కూడా ప్రయాణికుల రక్షణ కోసం టాప్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లు ఇచ్చారు. ఇందులో బేస్ వేరియంట్ నుంచే 6-ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ లభిస్తాయి.
వీటితో పాటు 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ప్రమాదాలను ముందుగానే పసిగట్టే లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి హైటెక్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టాటా కర్వ్ ఈవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.17.49 లక్షలుగా ఉంది. లక్షల రూపాయల డిస్కౌంట్ లభిస్తున్న నేపథ్యంలో ఈ కార్ అమ్మకాలు మరింత పుంజుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications