దేశంలో రతన్ టాటాకు ఉన్నంత ప్రజాధారణ పొందిన కారు.. ఏడాదిలోనే భారీగా పెరిగిన కస్టమర్లు

మారుతి సుజుకి లాగా, టాటా మోటార్స్ కూడా వినియోగదారులు ఎలాంటి సందేహం లేకుండా, నమ్మకంగా కొనుగోలు చేయగల కార్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. టియాగో వంటి బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి సఫారీ వంటి ప్రీమియం SUVల వరకు విస్తరించిన ఈ మోడల్ లైనప్‌కు ఉన్న ప్రధాన బలం భద్రత మరియు ఆధునిక ఫీచర్లే. ప్రతి సెగ్మెంట్‌లో కూడా గట్టి నిర్మాణ నాణ్యత, మంచి రోడ్డు ప్రెజెన్స్, వినియోగదారులకు ఉపయోగపడే టెక్నాలజీని అందించడం ద్వారా టాటా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం మరింత పెరుగుతోంది. ఏప్రిల్ 2026 నాటికి సంస్థ సుమారు 59,000 యూనిట్ల కార్లను విక్రయించి దేశంలో రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారుగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇది కేవలం సంఖ్య పరంగా కాకుండా బ్రాండ్‌పై పెరుగుతున్న డిమాండ్‌కు స్పష్టమైన సంకేతంగా కూడా చెప్పవచ్చు.

ఇదే సమయంలో టాటా మోటార్స్‌కు చెందిన టాటా హారియర్ (Tata Harrier) అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. మధ్యస్థాయి ప్రీమియం SUV సెగ్మెంట్‌లో బలమైన పోటీ ఇస్తున్న ఈ మోడల్, ఏప్రిల్ 2026లో 2,545 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఏప్రిల్ 2025లో అమ్ముడైన 1,012 యూనిట్లతో పోలిస్తే ఇది భారీ వృద్ధిని చూపిస్తోంది. ఏడాది లెక్కన 151 శాతం వరకు అమ్మకాల్లో పెరుగుదల నమోదైంది.

Tata Harrier April 2026 Sales Recorded 1012 Units More Details Inside

Tata Harrier ప్రస్తుతం స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్, ఫియర్‌లెస్ వంటి విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. ప్రతి వేరియంట్‌లో అవసరానికి తగ్గ ఫీచర్లు, సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో వినియోగదారులు తమ బడ్జెట్, అవసరానికి అనుగుణంగా ఎంపిక చేసుకునే అవకాశం పొందుతున్నారు. ఈ పెద్ద SUV తన బోల్డ్ డిజైన్, రోడ్ ప్రెజెన్స్, ప్రీమియం ఫీచర్లతో ఇప్పటికే మార్కెట్లో మంచి గుర్తింపు సంపాదించింది.

ధరల విషయానికి వస్తే, హారియర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 14 లక్షల నుండి రూ. 25.25 లక్షల మధ్య ఉంది. ఇది SUV సెగ్మెంట్‌లో మిడ్ టు ప్రీమియం కేటగిరీకి చెందే మోడల్‌గా నిలుస్తోంది. ఫ్యూయల్ ఆధారంగా చూసినట్లయితే, డీజిల్ వేరియంట్ ధర రూ. 14 లక్షల నుండి రూ. 25.35 లక్షల(ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. ఇది ఎక్కువ టార్క్, లాంగ్ డ్రైవ్ కోరుకునే వారికి మంచి ఎంపిక.

Tata Harrier April 2026 Sales Recorded 1012 Units More Details Inside

ఇక పెట్రోల్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండి, దాని ఎక్స్-షోరూమ్ ధర సుమారుగా రూ. 12.89 లక్షల నుండి రూ. 24.06 లక్షల మధ్య ఉంది. పెట్రోల్ వేరియంట్ సిటీ డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు సాఫ్ట్, రిఫైన్డ్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. హారియర్ EV, డీజిల్ లేదా పెట్రోల్ ఇంజన్ వద్దనుకునే వారికి ఆధునిక ఎలక్ట్రిక్ ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి వచ్చింది.

ఈ ఎలక్ట్రిక్ SUV ఎక్స్-షోరూమ్ ధర సుమారుగా రూ.21.49 లక్షల నుంచి రూ.30.23 లక్షల మధ్య ఉండి, ప్రీమియం EV సెగ్మెంట్‌లో బలమైన పోటీని ఇస్తోంది. హారియర్ EV ప్రత్యేకత ఏమిటంటే, ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉండటం, వినియోగదారుల అవసరానికి అనుగుణంగా రేంజ్, పనితీరును ఎంచుకోవచ్చు. MIDC టెస్ట్ సైకిల్ ప్రకారం, 65 kWh బ్యాటరీ ప్యాక్‌తో సుమారుగా 538 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది.

Tata Harrier April 2026 Sales Recorded 1012 Units More Details Inside

అలాగే, 75 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో గరిష్టంగా 627 కి.మీ వరకు ప్రయాణించవచ్చని టాటా మోటార్స్ పేర్కొంది. ఛార్జింగ్ విషయానికి వస్తే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 120 kW DC ఛార్జర్ ఉపయోగిస్తే కేవలం 15 నిమిషాల్లోనే సుమారుగా 250 కి.మీ వరకు రేంజ్ పొందే అవకాశం ఉంది. అలాగే 7.2 kW AC వాల్‌బాక్స్ ద్వారా పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారుగా 10.7 గంటల సమయం పడుతుంది.

Article Published On: Thursday, May 14, 2026, 16:51 [IST]
English summary
Tata harrier april 2026 sales recorded 1012 units more details inside
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+