ఈ ఒక్క కారుకే పట్టాభిషేకం.. దీన్నే రాజుగా ఎంచుకున్నారు! మరొకదాన్ని ఎందుకు పక్కన పెట్టారు?
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా పెరుగుతున్న ఇంధన ధరలు, తక్కువ రన్నింగ్ ఖర్చు, పర్యావరణానికి మేలు చేసే టెక్నాలజీ కలిసి ఈవీలను ఎక్కువగా ఆకర్షణీయంగా మార్చుతున్నాయి. ఈ ట్రెండ్‌ను బలంగా వినియోగించుకుంటున్న కంపెనీల్లో టాటా మోటార్స్ (Tata Motors) ఒకటి. ఈ సంస్థ ఇప్పటికే ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని, వరుసగా మంచి సేల్స్ నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో టాటా హారియర్ ఈవీ (Tata Harrier EV) కూడా మార్కెట్లో మంచి స్పందనను అందుకుంటోంది. ముఖ్యంగా ప్రీమియం SUV సెగ్మెంట్‌లో ఈ మోడల్‌కు వస్తున్న డిమాండ్ గమనించదగ్గది.
తాజాగా విడుదలైన సేల్స్ గణాంకాలు చూస్తే, ఈ ట్రెండ్ ఎంత బలంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. 2025 జూన్ నుంచి 2026 మార్చి వరకు, అంటే కేవలం 10 నెలల వ్యవధిలోనే హారియర్ మొత్తం 31,008 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయడం విశేషం. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ మొత్తం అమ్మకాలలో ఎలక్ట్రిక్ వేరియంట్ పెద్ద భాగాన్ని ఆక్రమించింది.

మొత్తం 17,592 యూనిట్లు ఎలక్ట్రిక్ మోడల్‌గా అమ్ముడవగా, ఐసిఇ (పెట్రోల్/డీజిల్) వేరియంట్ మాత్రం 13,416 యూనిట్ల వద్ద నిలిచింది. ఈ రెండు సంఖ్యలను పోల్చి చూస్తే, ఎలక్ట్రిక్ వేరియంట్‌కు ఐసిఇ కంటే దాదాపు 4,176 యూనిట్ల అధిక డిమాండ్ ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది సాధారణ విషయం కాదు. ఎందుకంటే, ఇప్పటివరకు భారతీయ మార్కెట్లో ఎక్కువగా ఐసిఇ వాహనాలే ఆధిపత్యం చెలాయించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది.
వినియోగదారులు క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారని ఈ గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్‌లో కూడా ఈ మార్పు కనిపించడం, ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తు ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది. హారియర్ ఈవీ బేస్ వేరియంట్ 21.49 లక్షల నుంచి మొదలుకుని రూ.30.23 లక్షల వరకు ఉంటుంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు మాత్రమే. ఆన్‌రోడ్ ఎక్కువగా ఉంటుంది.

పర్ఫార్మెన్స్, సేఫ్టీ పరంగా Tata Harrier EV నిజంగా ఒక పూర్తి ప్యాకేజ్‌గా నిలుస్తోంది. ఆధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీతో పాటు శక్తివంతమైన బ్యాటరీ ఆప్షన్లను అందిస్తూ, వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఈ SUVను Tata Motors రూపొందించింది. ఈ మోడల్‌లో రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. దిగువ వేరియంట్లలో 65 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తుండగా, టాప్-ఎండ్ వేరియంట్లలో 75 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను ఇస్తున్నారు.
పెద్ద బ్యాటరీ ప్యాక్ కారణంగా మరింత ఎక్కువ రేంజ్ లభించడం, దూర ప్రయాణాలకు ఇది మరింత అనుకూలంగా మారడం ప్రత్యేకత. అంతేకాదు, ఈ రెండు బ్యాటరీ ఆప్షన్లతో పాటు రెండు మోటార్ కాన్ఫిగరేషన్లు కూడా అందుబాటులో ఉండటం వల్ల, వినియోగదారులు తమ డ్రైవింగ్ అవసరాలకు సరిపోయే విధంగా ఎంపిక చేసుకునే అవకాశం పొందుతున్నారు.

పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రమే కాకుండా, భద్రత పరంగానూ ఈ SUV అత్యుత్తమ ప్రమాణాలను అందిస్తోంది. భారతదేశంలో నిర్వహించే Bharat NCAP క్రాష్ టెస్టుల్లో ఇది అద్భుతమైన ఫలితాలను సాధించింది. పెద్దల భద్రత విభాగంలో గరిష్టమైన 32లో 32 పాయింట్లు సాధించడం, అలాగే పిల్లల భద్రతలో 49లో 45 పాయింట్లు పొందడం దీని సేఫ్టీ స్థాయిని స్పష్టంగా చూపిస్తుంది. ఈ ఫలితాల ఆధారంగా దీనికి ఐదు నక్షత్రాల రేటింగ్ లభించడం గమనార్హం.
అదేవిధంగా, ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లలో కూడా 16లో 16 పాయింట్లు సాధించడం, ప్రమాద సమయంలో ప్రయాణికుల రక్షణలో ఈ వాహనం ఎంత నమ్మకంగా ఉంటుందో తెలియజేస్తుంది. ఈ రేంజ్‌లో ఉన్న SUVలతో పోలిస్తే, ఇంత ఉన్నతమైన భద్రతా ప్రమాణాలు అందించడం నిజంగా ప్రత్యేకమైన విషయం. ఫీచర్ల పరంగా కూడా ఈ కారు డజన్ల కొద్ది కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








