ఇండియాలో రతన్ టాటాకు ఉన్నంత ప్రజాధారణ పొందిన కారు.. అమ్మకాలు చూసి ప్రత్యర్థులకు టెన్షన్!
భారత ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ (tata motors)కు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి ప్రీమియం ఎస్‌యూవీల వరకు విభిన్న విభాగాల్లో వాహనాలను అందిస్తున్న ఈ సంస్థ, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తన ఉత్పత్తులను నిరంతరం అభివృద్ధి చేస్తూ వస్తోంది. అందుకే టాటా విడుదల చేసే దాదాపు ప్రతి మోడల్‌కు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. మధ్యస్థాయి ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన పొందుతున్న హారియర్ (tata harrier), 2026 మే నెలలో అద్భుతమైన అమ్మకాల ఫలితాలను నమోదు చేసింది. మొత్తం 2,815 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఇందులో ICE వేరియంట్లతో పాటు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్ వెర్షన్ అమ్మకాలు కూడా ఉన్నాయి.
ఈ సంఖ్యను గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే హారియర్ ఎంత వేగంగా మార్కెట్లో దూసుకెళ్తోందో స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2025 మే నెలలో టాటా హారియర్ కేవలం 894 యూనిట్లు మాత్రమే విక్రయించబడింది. అయితే కేవలం ఏడాది వ్యవధిలోనే ఈ మోడల్ అమ్మకాలు భారీగా పెరిగి 2,815 యూనిట్ల స్థాయికి చేరుకోవడం విశేషం. అంటే వార్షిక ప్రాతిపదికన చూస్తే హారియర్ అమ్మకాలు దాదాపు 214.88 శాతం వృద్ధి సాధించాయి.

ప్రస్తుతం భారత మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉన్న ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఇంత భారీ వృద్ధిని నమోదు చేయడం చిన్న విషయం కాదు. అమ్మకాలలో నమోదవుతున్న ఈ భారీ వృద్ధి చూస్తే, వినియోగదారులు హారియర్‌పై ఎంత విశ్వాసం ఉంచుతున్నారో స్పష్టమవుతోంది. మార్కెట్లో పెరుగుతున్న పోటీ మధ్య కూడా టాటా హారియర్ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ, కంపెనీ ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోలో కీలక పాత్ర పోషిస్తోంది.
ధరల పరంగా చూస్తే, టాటా హారియర్ ప్రస్తుతం భారత మార్కెట్లో మిడ్-సైజ్ నుంచి ప్రీమియం SUV సెగ్మెంట్ వరకు విస్తరించిన విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. హారియర్ శ్రేణి ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.89 లక్షల నుంచి మొదలై టాప్ వేరియంట్‌కు రూ.25.25 లక్షల వరకు వెళ్తుంది. ఇది పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

పెట్రోల్ మోడళ్ల ధరలు సుమారుగా రూ.12.89 లక్షల నుంచి రూ.24.06 లక్షల మధ్య ఉండగా, డీజిల్ వేరియంట్లు రూ.14 లక్షల నుంచి రూ.25.35 లక్షల వరకు లభిస్తున్నాయి. ముఖ్యంగా డీజిల్ ఇంజిన్ అధిక టార్క్, హైవే ప్రయాణాల్లో మెరుగైన పనితీరు అందించడంతో లాంగ్ డ్రైవ్‌లను ఇష్టపడే కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. ఇక హారియర్ EV విషయానికి వస్తే, ఇది టాటా మోటార్స్ ప్రీమియం ఎలక్ట్రిక్ SUV పోర్ట్‌ఫోలియోలో కీలక మోడల్‌గా నిలిచింది.
దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.21.49 లక్షల నుంచి ప్రారంభమై రూ.30.23 లక్షల వరకు ఉంటుంది. దీనిలో రెండు బ్యాటరీ ప్యాక్‌లను అందిస్తోంది. 65 kWh బ్యాటరీ ప్యాక్‌తో MIDC ప్రమాణాల ప్రకారం 538 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. మరింత దూర ప్రయాణాల కోసం 75 kWh బ్యాటరీ ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 627 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

ఛార్జింగ్ సామర్థ్యం కూడా హారియర్ EVకు ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. 120 kW DC ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌లోనే సుమారు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి సరిపడా శక్తిని పొందవచ్చు. ఇంట్లో లేదా కార్యాలయంలో ఉపయోగించే 7.2 kW AC వాల్‌బాక్స్ ఛార్జర్ ద్వారా బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారుగా 10.7 గంటల సమయం పడుతుంది.


Click it and Unblock the Notifications