రతన్ టాటాకు ఉన్నంత ప్రజాదరణ పొందిన కారు.. ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు
భారత ఆటోమొబైల్ మార్కెట్లో మధ్య-సైజ్ SUV విభాగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మోడల్ టాటా హారియర్ (Tata Harrier). స్ట్రాంగ్ డిజైన్, రోడ్డుపై రాయల్ ప్రెజెన్స్, మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో ఈ SUVకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా కుటుంబ వినియోగం, లాంగ్ డ్రైవ్స్, అలాగే హైవే ప్రయాణాలకు హారియర్‌ను వినియోగదారులు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ ట్రెండ్ 2026 సంవత్సర ఆరంభంలో కూడా అలాగే కొనసాగింది. గత నెల జనవరి 2026లో మొత్తం 3,711 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ (Delivery) చేయబడ్డాయి. ఇది టాటా హారియర్‌కు చాలా పాజిటివ్ సంకేతం అని చెప్పొచ్చు. ఎందుకంటే, గత సంవత్సరం అదే కాలం అయిన జనవరి 2025లో కేవలం 1,488 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
ఈ రెండు సంఖ్యలను పోలిస్తే, సంవత్సర ప్రాతిపదికన అమ్మకాల్లో హారియర్ 149 శాతం వృద్ధి(Sales Growth) నమోదు చేసింది. పోటీ తీవ్రంగా ఉన్న ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఇలాంటి గ్రోత్ సాధించడం చిన్న విషయం కాదు. ఇది టాటా హారియర్‌పై వినియోగదారుల విశ్వాసం ఎంత బలంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటికే ఎన్నో బలమైన మోడళ్లు ఉన్నా కూడా, హారియర్ మాత్రం తనదైన స్థానం నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది.

భారత మార్కెట్లో ప్రీమియం ఎస్‌యూవీ(SUV) విభాగంలో బలమైన స్థానాన్ని సంపాదించిన మోడల్ Tata Harrier. ఈ ఎస్‌యూవీ ధరలు రూ. 12.89 లక్షల నుండి రూ. 25.25 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధర) ఉన్నాయి. అందుబాటులో ఉన్న వేరియంట్లు స్మార్ట్, ప్యూర్ X , అడ్వెంచర్ X, ఫియర్‌లెస్ X. టాటా హారియర్ ఆధునిక రూపకల్పనతో ఆకట్టుకుంటుంది. ముందుభాగంలో మెరుగైన ఎల్ఈడి లైట్స్, పగటి సమయంలో వెలిగే లైట్స్ ఉన్నాయి.
వెనుక ఎల్ఈడి టెయిల్ లైట్లు ఏర్పాటు చేశారు. పైభాగంలో షార్క్ ఫిన్ ఆకారంలోని యాంటెన్నా, 18 అంగుళాల వీల్స్ కారుకు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తాయి. ఈ ఎస్‌యూవీ సన్‌లైట్ ఎల్లో, సీవీడ్ గ్రీన్, ప్రిస్టైన్ వైట్, డేటోనా గ్రే, నైట్రో క్రిమ్సన్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ కారులో 5 సీట్లు ఉన్నాయి. పనితీరు విషయానికి వస్తే, ఇది రెండు ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది.

1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ వినియోగదారులకు లభిస్తాయి. వేరియంట్‌ను బట్టి 6 మాన్యువల్ గేర్, 6 ఆటోమెటిక్ గేర్ వ్యవస్థ ఎంపిక చేసుకోవచ్చు. లీటరు ఇంధనానికి సగటున 15 నుండి 17 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. గరిష్టంగా గంటకు 195 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. కేవలం 11 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.
ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన హారియర్ ఇంటీరియర్ సాంకేతికత, సౌకర్యం, భద్రత అంశాల్లో ఆధునికతను ప్రతిబింబిస్తుంది. వాహనం లోపల అడుగుపెడితేనే విశాలమైన డ్యాష్‌బోర్డ్ రూపకల్పన, నాణ్యమైన పదార్థాల వినియోగం, సొగసైన అమరిక కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి. ముందుభాగంలో 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇది నావిగేషన్, సంగీతం, మొబైల్ అనుసంధానం వంటి అనేక సౌకర్యాలను ఒకేచోట అందిస్తుంది.

మ్యూజిక్ మరింత నాణ్యంగా ఆస్వాదించేందుకు 10 స్పీకర్లతో కూడిన జేబీఎల్ అమర్చారు. భద్రత విషయానికి వస్తే, టాటా హారియర్ ఏడు ఎయిర్‌బ్యాగ్స్ కలిగి ఉంది. అలాగే ఆధునిక డ్రైవర్ సహాయక సాంకేతిక వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ స్థిరత్వ నియంత్రణ వ్యవస్థ వాహనం అధిక వేగంలో ఉన్నప్పుడు కూడా స్థిరత్వాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. 360 డిగ్రీల కెమెరా వ్యవస్థ చుట్టూ పూర్తిగా చూపించి పార్కింగ్ వంటి సందర్భాల్లో డ్రైవర్‌కు ఎంతో ఉపయోగపడుతుంది.


Click it and Unblock the Notifications








