ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. 211 కిమీ రేంజ్.. డ్రైవర్లకు నోట్ల వర్షం కురిపించే ట్రక్.. టాటా ఇచ్చిన గొప్ప వరం

భారతీయ రోడ్ల మీద టాటా మోటార్స్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ప్యాసింజర్ కార్ల విభాగంలో నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీలతో ఎలక్ట్రిక్ విప్లవం తెచ్చిన టాటా, ఇప్పుడు కమర్షియల్ వెహికల్ రంగంలో తన జెండా పాతేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఏస్ ఈవీ (Ace EV) సక్సెస్ తర్వాత, మరింత పవర్ఫుల్, ఎక్కువ బరువు మోయగల టాటా ఇంట్రా ఈవీ (Tata Intra EV) పిక్-అప్ ట్రక్కును తాజాగా మార్కెట్లోకి రిలీజ్ చేసింది. కేవలం రూ.11.95 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ వాహనం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ (TMCV) విభాగం భారతీయ వ్యాపారుల అవసరాలను గుర్తించడంలో ఎప్పుడూ ముందుంటుంది. నగరాల లోపల సరుకు రవాణా చేసే వారికి డీజిల్ ఖర్చులు తడిసి మోపెడవుతున్న తరుణంలో, ఈ ఇంట్రా ఈవీ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. రూ.11.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదలైన ఈ ట్రక్, ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఏస్ ఈవీ 1000, ఏస్ ప్రో ఈవీల సరసన చేరింది.

Tata Intra EV Pickup Launched with 211 km Range and High Payload Capacity
టాటా ఇంట్రా ఈవీ కేవలం చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాదు, పనితీరులో కూడా మొనగాడు. ఇందులో 10 అడుగుల 2 అంగుళాల పొడవు గల లోడింగ్ బాడీ ఉంటుంది. అంటే పెద్ద సైజు వస్తువులను, ఎక్కువ మొత్తంలో సరుకును ఒకేసారి తీసుకెళ్లవచ్చు. దీని పేలోడ్ సామర్థ్యం 1,750 కిలోగ్రాములు. గ్యాస్ సిలిండర్ల సరఫరా, పాల పంపిణీ, ఈ-కామర్స్ డెలివరీలు, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్, మున్సిపల్ చెత్త సేకరణ వంటి పనులకు ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. డ్రైవర్ సౌకర్యం కోసం ఇందులో వాక్-త్రూ కేబిన్ ఇచ్చారు, దీనివల్ల డ్రైవర్ సులభంగా లోపల కదలవచ్చు.

కమర్షియల్ వెహికల్స్‎లో ముఖ్యంగా అందరూ చూసేది రేంజ్. టాటా ఇంట్రా ఈవీలో 28.2 kWh కెపాసిటీ గల ఐపీ67 (IP67) రేటెడ్ బ్యాటరీ ప్యాక్‌ను వాడారు. ఇది నీరు, ధూళి నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ బ్యాటరీ ద్వారా ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 211 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ ధృవీకరించింది. దీనిలోని 72 kW ఎలక్ట్రిక్ మోటార్ 97 bhp శక్తిని, 230 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 23 శాతం గ్రేడబిలిటీని కలిగి ఉండటం వల్ల బరువుతో కూడిన ట్రక్కును ఘాట్ రోడ్లు లేదా ఎత్తుగా ఉన్న ఫ్లైఓవర్లపై కూడా సులభంగా నడపవచ్చు.

సమయమే డబ్బు అని నమ్మే వ్యాపారుల కోసం టాటా ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పించింది. CCS2 ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 55 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. దీనివల్ల పని మధ్యలో ఎక్కువ సమయం వృధా కాదు. ఇక బ్యాటరీ సేఫ్టీ విషయంలో టాటా చాలా జాగ్రత్తలు తీసుకుంది. గడ్డకట్టే చలిలో లేదా మండే ఎండలో కూడా బ్యాటరీ స్థిరంగా పనిచేసేలా దీనిని డిజైన్ చేశారు.

Tata Intra EV Pickup Launched with 211 km Range and High Payload Capacity

టాటా ఇంట్రా ఈవీ కేవలం మెకానికల్ వాహనం మాత్రమే కాదు, ఇదొక స్మార్ట్ ట్రక్. ఇందులో టాటా మోటర్స్ ఫ్లీట్ ఎడ్జ్ (Fleet Edge) సిస్టమ్ ఉంది. దీని ద్వారా యజమానులు తమ వాహనం ఎక్కడుందో లైవ్ ట్రాకింగ్ చేయవచ్చు. వాహనం కండిషన్ ఎలా ఉంది? ఎప్పుడు సర్వీసింగ్ చేయాలి? డ్రైవర్ ఎలా డ్రైవ్ చేస్తున్నాడు? వంటి వివరాలన్నీ మొబైల్ లోనే చూసుకోవచ్చు. అంతేకాకుండా, ఇందులో త్రీ-లెవల్ రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అంటే డ్రైవర్ బ్రేక్ వేసిన ప్రతిసారీ బ్యాటరీ కొద్దిగా ఛార్జ్ అవుతుంది, ఇది మైలేజీని మరింత పెంచుతుంది.

సాధారణంగా ఈవీ బ్యాటరీ ఖర్చు ఎక్కువ కాబట్టి, టాటా మోటార్స్ దీనిపై భారీ వారంటీని ప్రకటించింది. బ్యాటరీ ప్యాక్‌పై 6 ఏళ్లు లేదా 2 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తోంది. దేశవ్యాప్తంగా టాటాకు ఉన్న 200 కంటే ఎక్కువ ఈవీ సర్వీస్ సెంటర్లు, 25,000 పైగా ఛార్జింగ్ పాయింట్ల నెట్‌వర్క్ వాహనదారులకు కొండంత అండగా నిలుస్తుంది. మొత్తానికి టాటా ఇంట్రా ఈవీ పిక్-అప్ ట్రక్ వ్యాపార ప్రపంచంలో సరికొత్త ఆదాయ మార్గాలను చూపిస్తూ, పర్యావరణ హితమైన రవాణాకు బాటలు వేస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 8, 2026, 11:13 [IST]
English summary
Tata intra ev pickup launched with 211 km range and high payload capacity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+