ఖరీదైన కార్లలోనే ఉండే ఫీచర్ ఇప్పుడు ఈ రూ.9.59 లక్షల కారులో.. వెంటనే షోరూమ్‌కు పరిగెత్తండి!
భారతదేశంలోని కాంపాక్ట్ SUV మార్కెట్‌లో Tata Nexon (టాటా నెక్సాన్)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భద్రత, బలమైన నిర్మాణ నాణ్యత, ఆధునిక డిజైన్, పెట్రోల్ నుంచి EV వరకు విభిన్న ఇంధన ఎంపికలను అందిస్తూ, ఇది భారతీయ కుటుంబాల ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. అందుకే ప్రతి నెలా 15 వేలకుపైగా యూనిట్లు అమ్ముడవుతూ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అయితే ఇప్పుడు పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని, టాటా మోటార్స్ నెక్సాన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలి కాలంలో భారతీయ కస్టమర్లలో సన్‌రూఫ్ కార్లపై విపరీతమైన ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్న కార్లకు యువత, ఫ్యామిలీ కొనుగోలుదారుల నుంచి భారీ డిమాండ్ వస్తోంది.
ఈ ట్రెండ్‌ను బాగా అర్థం చేసుకున్న టాటా మోటార్స్, ఇప్పుడు నెక్సాన్‌లో కొత్త 'ప్యూర్+ పీఎస్(Pure+ PS)' పనోరమిక్ సన్‌రూఫ్ ట్రిమ్‌ను ప్రవేశపెట్టింది. ఇది మిడ్-స్పెక్ ప్యూర్+ ఎస్, క్రియేటివ్ ట్రిమ్‌ల మధ్యలో ఉండే కొత్త వేరియంట్‌గా మార్కెట్లోకి వచ్చింది. ఈ కొత్త వేరియంట్ రూ. 9.59 లక్షల ప్రారంభ ధరతో, పనోరమిక్ సన్‌రూఫ్ అందిస్తున్న భారతదేశంలోనే అత్యంత సరసమైన కారుగా టాటా నెక్సాన్ నిలిచింది.

అంతేకాదు, రూ.10 లక్షల లోపు ధరలో వాయిస్-అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్ అందించిన తొలి భారతీయ వాహనంగా కూడా కొత్త రికార్డ్ సృష్టించింది. అంటే కేవలం "సన్‌రూఫ్ ఉంది" అన్న స్థాయిలో కాకుండా, వాయిస్ కమాండ్స్‌తో పనిచేసే ఆధునిక టెక్నాలజీని టాటా అందిస్తోంది. ఈ అప్‌డేట్‌తో నెక్సాన్ మరింత ప్రీమియం ఫీల్‌ను అందించబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ ఎక్కువగా ఖరీదైన SUVలలో మాత్రమే కనిపించేది.
కానీ ఇప్పుడు టాటా దానిని మధ్యతరగతి వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా "బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు" కోరుకునే యువతను ఇది బలంగా ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, బలమైన బాడీ, ఆధునిక ఇంటీరియర్‌తో నెక్సాన్ మార్కెట్లో బలంగా నిలిచింది. ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా తక్కువ ధరలో అందించడం ద్వారా, టాటా మరోసారి పోటీదారులకు గట్టి సవాల్ విసిరినట్టే కనిపిస్తోంది.

కొత్త నెక్సాన్ ప్యూర్ ప్లస్ PS వేరియంట్ మొత్తం నాలుగు పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ AMT, ట్విన్-సిలిండర్ CNG మాన్యువల్, అలాగే డీజిల్ మాన్యువల్, డీజిల్ AMT వేరియంట్‌లు ఉన్నాయి. ధరల విషయానికి వస్తే, కొత్త టాటా నెక్సాన్ ప్యూర్ ప్లస్ PS పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 9.59 లక్షలు(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా నిర్ణయించారు.
ఇదే వేరియంట్ AMT గేర్‌బాక్స్‌తో తీసుకుంటే ధర రూ.10.14 లక్షలకు చేరుకుంటుంది. ఇక ఎక్కువ మైలేజ్ కోసం తీసుకొచ్చిన CNG మాన్యువల్ వేరియంట్ ధర రూ. 10.39 లక్షలు. మరోవైపు డీజిల్ అభిమానుల కోసం మాన్యువల్ వెర్షన్ రూ. 10.54 లక్షలు కాగా, డీజిల్ AMT ధర రూ. 11.19 లక్షలుగా ఉంది. ఈ కొత్త ప్యూర్ ప్లస్ PS ట్రిమ్‌తో కంపెనీ మరోసారి మధ్యతరగతి కొనుగోలుదారులను టార్గెట్ చేస్తోంది.

పనితీరు పరంగా నెక్సాన్ తన ప్రత్యేకతను కొనసాగిస్తోంది. ఇందులో 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 120 bhp వరకు శక్తిని ఉత్పత్తి చేయగలదు. దీంతో నగర ప్రయాణాల్లో స్మూత్ డ్రైవింగ్ అనుభూతితో పాటు, హైవేలపై మంచి పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. అదనంగా, బలమైన నిర్మాణం, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, ఆధునిక టెక్నాలజీ, ఇప్పుడు తక్కువ ధరలో పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు నెక్సాన్‌ను బలమైన కాంపాక్ట్ SUVగా నిలబెడుతున్నాయి.


Click it and Unblock the Notifications