కార్ల ధరలు పెంచిన దిగ్గజ కంపెనీ.. ఆ తేదీ నుంచి కొత్త రేట్లు అమల్లోకి! వెంటనే కొంటే తక్కువలో వస్తాయి!

భారతదేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (tata motors) తన వినియోగదారులకు కీలక ప్రకటన చేసింది. కంపెనీ తన ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ ధరల సవరణ అంతర్గత దహన ఇంజిన్ (ICE) కార్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు (EVలు) కూడా వర్తించనుంది. కొత్త ధరలు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, మోడల్, వేరియంట్‌ను బట్టి వాహనాల ధరలు గరిష్టంగా 1.5 శాతం వరకు పెరగనున్నాయి. అయితే ప్రతి మోడల్‌పై పెరుగుదల ఒకేలా ఉండదని, వాహనం, దాని వేరియంట్ ఆధారంగా ధరల మార్పులు ఉంటాయని టాటా మోటార్స్ స్పష్టం చేసింది.

ధరల పెంపు వెనుక ప్రధాన కారణం, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను కంపెనీ పేర్కొంది. ముడిసరుకుల ధరలు పెరగడం, సరఫరా ఖర్చులు అధికమవడం, అలాగే కొనసాగుతున్న ద్రవ్యోల్బణ ప్రభావం వాహనాల తయారీ ఖర్చులను గణనీయంగా పెంచుతున్నాయని తెలిపింది. గత కొంతకాలంగా ఈ అదనపు ఖర్చుల్లో పెద్ద భాగాన్ని కంపెనీ స్వయంగా భరిస్తూ వచ్చినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ భారం కొంతమేర వినియోగదారులపైకి బదిలీ చేయాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది.

Tata Motors Announces Price Hike Up To 1 5 Percent From July 1st 2026

ప్రస్తుతం టాటా మోటార్స్ భారత మార్కెట్లో టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్, కర్వ్, హారియర్, సఫారి వంటి ప్రజాదరణ పొందిన మోడళ్లను విక్రయిస్తోంది. టియాగో EV, పంచ్ EV, నెక్సాన్ EV, కర్వ్ EV వంటి ఎలక్ట్రిక్ వాహనాలతో EV విభాగంలో బలమైన స్థానాన్ని కొనసాగిస్తోంది. ధరల పెంపు వాహనాల కొనుగోలుపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల నేపథ్యంలో పరిశ్రమలో ఇటువంటి నిర్ణయాలు సాధారణమవుతున్నాయి.

మొత్తంగా, జూలై 1, 2026 నుంచి టాటా కార్లు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ప్రస్తుతం ఉన్న ధరల కంటే కొంత ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల సమీప భవిష్యత్తులో టాటా కారును కొనుగోలు చేయాలని భావిస్తున్న వారు ధరల పెంపు అమల్లోకి రాకముందే బుకింగ్ చేసుకోవడం ద్వారా కొంత మేర ప్రయోజనం పొందే అవకాశం ఉంది. లేదంటే ఈ కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఎక్కువ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది.

Tata Motors Announces Price Hike Up To 1 5 Percent From July 1st 2026

ఏ మోడల్‌పై ఎంత పెరిగిందో వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. 2026 సంవత్సరం టాటా మోటార్స్‌కు అత్యంత కీలకమైన సంవత్సరంగా మారింది. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కంపెనీ ఈ ఏడాది ప్రారంభం నుంచే వరుసగా కొత్త మోడళ్లు, అప్‌డేటెడ్ వెర్షన్లను ప్రవేశపెడుతోంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్లు, మెరుగైన పనితీరుతో కూడిన వాహనాలను అందించడంపై టాటా ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

ఇందులో భాగంగా ఇప్పటికే సియెర్రా ICE, హారియర్ పెట్రోల్, సఫారీ పెట్రోల్ వంటి కొత్త మోడళ్లను పరిచయం చేయగా, పంచ్ ఫేస్‌లిఫ్ట్, పంచ్ EV ఫేస్‌లిఫ్ట్, టియాగో ఫేస్‌లిఫ్ట్, టియాగో EV ఫేస్‌లిఫ్ట్ వంటి అప్‌డేటెడ్ వేరియంట్లను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ వాహనాలు తాజా డిజైన్ భాష, మెరుగైన క్యాబిన్ అనుభవం, ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు, భద్రతా సాంకేతికతలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

Tata Motors Announces Price Hike Up To 1 5 Percent From July 1st 2026

మరోవైపు, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టాటా మోటార్స్ తన EV వ్యూహాన్ని మరింత దూకుడుగా అమలు చేస్తోంది. ఇప్పటికే దేశీయ EV మార్కెట్లో అగ్రగామిగా ఉన్న కంపెనీ, తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను వరుసగా ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా ఎంతోకాలంగా ఆటోమొబైల్ ప్రియులు ఎదురుచూస్తున్న సియెర్రా EVను ఈ నెలాఖరులో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

Article Published On: Friday, June 12, 2026, 15:45 [IST]
English summary
Tata motors announces price hike up to 1 5 percent from july 1st 2026
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+