ప్రపంచం షేక్ అయ్యే రికార్డు.. టాటా ఎలక్ట్రిక్ కార్ల కోసం క్యూ కట్టిన కోట్లాది మంది

భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్లో టాటా మోటార్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మహీంద్రా, హ్యుందాయ్ లేదా ఎంజీ వంటి దిగ్గజ కంపెనీలు రేసులో ఉన్నప్పటికీ, మెజారిటీ భారతీయులు మాత్రం టాటా ఈవీలకే పట్టం కట్టారు. తాజాగా ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరంలో (FY2026) టాటా మోటార్స్ ఏకంగా 92,120 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతకుముందు ఏడాది అంటే 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కేవలం 64,276 యూనిట్లను మాత్రమే విక్రయించగా, ఈ ఏడాది ఏకంగా 43 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఇది టాటా మోటార్స్ చరిత్రలోనే అత్యుత్తమ వార్షిక విక్రయాల రికార్డుగా నిలిచిపోయింది.

నెలవారీ విక్రయాల్లో సరికొత్త రికార్డులు
టాటా మోటార్స్ ఈవీ ప్రస్థానం 2026 ఆర్థిక సంవత్సరంలో అద్భుతంగా సాగింది. ముఖ్యంగా మార్చి 2026 నెలలో కంపెనీ అత్యధికంగా 9,494 యూనిట్లను విక్రయించి తన ఆల్-టైమ్ బెస్ట్ మంత్లీ సేల్స్ రికార్డును నమోదు చేసింది. గతేడాది ఇదే నెలలో కేవలం 5,353 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఒక్క నెలలోనే 77 శాతం వృద్ధిని సాధించింది. ఏప్రిల్ 2025లో 5,318 యూనిట్లతో ప్రారంభమైన ఈ ప్రయాణం, క్రమంగా పెరుగుతూ సెప్టెంబర్ నుంచి భారీ వేగాన్ని పుంజుకుంది. సెప్టెంబర్ 2025లో 96 శాతం వృద్ధితో 9,191 కార్లను విక్రయించగా, అక్టోబర్ లో 9,286 కార్లతో తన పట్టును నిరూపించుకుంది.

tata motors dominates indias ev market with record 92 120 units sold in fy26

విస్తృతమైన ఈవీ పోర్ట్‌ఫోలియోనే విజయరహస్యం
టాటా మోటార్స్ విజయం వెనుక వారి విభిన్నమైన కార్ల శ్రేణి ఉంది. సామాన్యులకు అందుబాటులో ఉండే టియాగో ఈవీ (Tiago EV) నుంచి మొదలుకొని, సెడాన్ ప్రియుల కోసం టిగోర్ ఈవీ (Tigor EV), మైక్రో ఎస్‌యూవీ విభాగంలో పంచ్ ఈవీ (Punch EV), అత్యంత ప్రజాదరణ పొందిన నెక్సాన్ ఈవీ (Nexon EV) వరకు అన్ని వర్గాల కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీనికి తోడుగా ప్రీమియం విభాగంలో హారియర్ ఈవీ (Harrier EV) వంటి మోడళ్లను ప్రవేశపెట్టడం వల్ల కస్టమర్లకు మరిన్ని ఆప్షన్లు లభించాయి. మహీంద్రా XEV 9e లేదా హ్యుందాయ్ అయోనిక్ వంటి కార్లు ఉన్నప్పటికీ, ధర, నమ్మకం విషయంలో టాటా వైపే మొగ్గు చూపుతున్నారు.

ఏడాది పొడవునా వృద్ధి పథం
గత 12 నెలల విక్రయాలను పరిశీలిస్తే.. కేవలం ఏప్రిల్ 2025లో మాత్రమే 16 శాతం ప్రతికూల వృద్ధి కనిపించింది. ఆ తర్వాత మే నెల నుంచి క్రమంగా పుంజుకుంటూ జూలైలో 42 శాతం, ఆగస్టులో 44 శాతం వృద్ధిని సాధించింది. పండుగ సీజన్ ప్రారంభమైన సెప్టెంబర్ నుంచి విక్రయాలు జోరందుకున్నాయి. నవంబర్ లో 7,911 యూనిట్లు, జనవరి 2026లో 9,052 యూనిట్ల అమ్మకాలతో టాటా మోటార్స్ ఈవీ సెగ్మెంట్ లో లీడర్ గా ఎదిగింది. ప్రత్యర్థి కంపెనీలైన ఎంజీ మోటార్స్ లేదా మహీంద్రా కార్లు కొన్ని నెలలుగా ఖాతా కూడా తెరవని పరిస్థితులు ఉన్నా, టాటా మాత్రం ప్రతి నెలా సగటున 7,500 కంటే ఎక్కువ కార్లను విక్రయిస్తూ దూసుకుపోతోంది.

tata motors dominates indias ev market with record 92 120 units sold in fy26

భవిష్యత్తు ప్రణాళికలు, సవాళ్లు
మారుతున్న కాలానికి అనుగుణంగా టాటా మోటార్స్ తన ఛార్జింగ్ నెట్‌వర్క్ ను కూడా విస్తరిస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల చాలా మంది కస్టమర్లు ఇప్పుడు సెకండ్ కారుగా ఈవీని ఎంచుకుంటున్నారు. 2026లో సాధించిన ఈ 92,120 యూనిట్ల విజయం, రాబోయే సంవత్సరాల్లో టాటా మరింత దూకుడుగా వెళ్లేందుకు మార్గం సుగమం చేసింది. భవిష్యత్తులో టాటా సఫారీ ఈవీ (Safari EV), టాటా సియెర్రా (Sierra) వంటి మోడళ్లు మార్కెట్లోకి రానుండటంతో ఈ జోరు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ సెగ్మెంట్ లో 43 శాతం వార్షిక వృద్ధి సాధించడం అనేది భారత ఆటోమొబైల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 8, 2026, 7:35 [IST]
English summary
Tata motors dominates indias ev market with record 92 120 units sold in fy26
Read more on: #electric car #tata motors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+