పేదల దేవుడు రతన్ టాటా కంపెనీకి జనాల నీరాజనం.. ఆ కార్లకు అయితే ఫుల్ డిమాండ్!
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎప్పటిలాగే మారుతి సుజుకి అగ్రస్థానంలో దూసుకుపోతూనే ఉంది. కానీ అసలు ఆసక్తికరమైన పోటీ మాత్రం రెండో స్థానానికి. ఈ స్థానం కోసం టాటా మోటార్స్, మహీంద్రా, హ్యూందాయ్ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా గట్టిపోటీ కొనసాగుతోంది. ఇటీవల వరకు ఈ రేసులో మహీంద్రా మంచి జోరుతో ముందంజలో నిలిచింది. SUV సెగ్మెంట్‌లో తమ బలమైన ప్రెజెన్స్‌తో రెండో స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చింది. కానీ ఏప్రిల్ నెలలో ఆట పూర్తిగా మలుపు తిరిగింది. ఈసారి టాటా మోటార్స్ తన విక్రయ శక్తిని పూర్తిగా ప్రదర్శిస్తూ మార్కెట్‌ను షాక్‌కు గురి చేసింది. ఏప్రిల్‌లో టాటా మోటార్స్ మొత్తం 59,701 కార్లను విక్రయించడం ద్వారా భారీ మైలురాయిని సాధించింది.
ఇందులో కేవలం 701 కార్లు మాత్రమే విదేశాలకు ఎగుమతి చేయబడగా, మిగిలిన 59,000 యూనిట్లు దేశీయ మార్కెట్లోనే అమ్ముడయ్యాయి. అంటే, భారత మార్కెట్‌లో టాటా కార్లకు ఉన్న డిమాండ్ ఎంత బలంగా ఉందో ఈ సంఖ్యలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ భారీ అమ్మకాలతో టాటా మోటార్స్, మారుతి సుజుకి తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీదారుగా నిలవడమే కాకుండా, మహీంద్రాను వెనక్కి నెట్టింది.

ఇది కేవలం ఒక నెలలో జరిగిన మార్పు మాత్రమే కాదు, టాటా బ్రాండ్‌పై పెరుగుతున్న నమ్మకం, కొత్త మోడల్స్, ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి, అలాగే సేఫ్టీకి ఇచ్చిన ప్రాధాన్యత కలిసి ఈ విజయానికి కారణమయ్యాయి. భారత ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ ఇప్పుడు కేవలం మరో కంపెనీగా కాకుండా, గట్టిగా ఎదుగుతున్న శక్తిగా మారుతోంది. గత ఏడాది ఏప్రిల్ 2025లో దేశీయ మార్కెట్లో కేవలం 45,199 కార్లను మాత్రమే విక్రయించింది.
టాటా, ఈ ఏడాది అదే నెలలో తన స్ట్రాటజీని పూర్తిగా మార్చుకుని అద్భుతమైన పెరుగుదలను నమోదు చేసింది. ఈసారి ఏప్రిల్‌లో టాటా కార్ల అమ్మకాలు 30.5% వృద్ధి చెందడం సాధారణ విషయం కాదు. మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ మధ్య ఇంత పెద్ద గ్రోత్ సాధించడం అంటే వినియోగదారుల నమ్మకం ఎంతగా పెరిగిందో అర్థమవుతోంది. ఎగుమతుల విషయంలో కూడా టాటా మోటార్స్ మంచి జంప్ చూపించింది.

గత నెలలో కేవలం 701 కార్లు మాత్రమే విదేశాలకు వెళ్లినా, ఇది గత ఏడాది ఏప్రిల్‌లో నమోదైన 333 యూనిట్లతో పోలిస్తే సుమారు 110.5% అధికం. అంటే గ్లోబల్ మార్కెట్‌లో కూడా టాటా నెమ్మదిగా తన స్థానం పెంచుకుంటోంది అని చెప్పవచ్చు. అయితే టాటా మోటార్స్ అసలు గేమ్ మార్చింది ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోనే. ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో అగ్రగామిగా నిలిచింది టాటా.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో టాటా మొత్తం 9,150 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడం ద్వారా మరోసారి తన ఆధిపత్యాన్ని చూపించింది. గత ఏడాది అదే నెలలో అమ్ముడైన 5,318 యూనిట్లతో పోలిస్తే ఇది భారీగా పెరుగుదల. ఒక్క ఏడాదిలోనే 72.1% వృద్ధి నమోదు కావడం, EV మార్కెట్‌లో టాటా ఎంత వేగంగా ఎదుగుతుందో చెప్పడానికి సరిపోతుంది. టాటా మే నెలలో ఒక కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

ఇటీవలే తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన Tata Sierra ఇప్పటికే భారత మార్కెట్‌లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు దాని ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన Tata Sierra EV మే మధ్యలో లాంచ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సరిపోదన్నట్టుగా, టాటా మరో బిగ్ ప్లాన్‌తో ముందుకు వస్తోంది. 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందిస్తుందని అంచనా వేయబడుతున్న Tata Safari EV కూడా త్వరలోనే మార్కెట్‌లోకి రానుంది.


Click it and Unblock the Notifications