సేఫ్టీలో పెద్దన్న..ప్రతి ఇల్లు ఈ కంపెనీ కారే కావాలంటోది.. ఒక్క నెలలోనే 63,331 మంది కొనేశారు
భారతీయ ఆటోమొబైల్ రంగంలో స్వదేశీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా సేఫ్టీ విషయంలో రాజీ పడని వాహనాలను అందిస్తూ, మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు అందరి మనసు గెలుచుకుంటోంది. తాజాగా విడుదలైన ఫిబ్రవరి 2026 విక్రయాల గణాంకాలు చూస్తుంటే, టాటా కార్లకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది.
కేవలం ఒక్క నెలలోనే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కలిపి ఏకంగా 63,331 యూనిట్ల కార్లను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది ఫిబ్రవరి 2025లో జరిగిన 46,811 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే, ఈసారి ఏకంగా 57 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఆటోమొబైల్ రంగంలో ఇంత భారీ స్థాయిలో వృద్ధి సాధించడం సామాన్యమైన విషయం కాదు, ఇది టాటా బ్రాండ్‌పై ఉన్న నమ్మకానికి నిదర్శనం.

టాటా మోటార్స్ సాధించిన ఈ భారీ విజయంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) పాత్ర చాలా కీలకంగా ఉంది. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (TPEML) ద్వారా అందిస్తున్న ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఫిబ్రవరి 2026లో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోనే 8,385 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 5,343 గా మాత్రమే ఉండేది.
అంటే ఈ సెగ్మెంట్లో కూడా 57 శాతం వృద్ధి నమోదైంది. పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఈవీ విభాగంలోనూ టాటా తిరుగులేని నాయకుడిగా ఎదుగుతోంది. భారతదేశంలో 'ఎలక్ట్రిక్ రివల్యూషన్'ను ముందుండి నడిపిస్తున్న ఘనత టాటా మోటార్స్‌కే దక్కుతుంది. నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ వంటి మోడళ్లు ఇప్పటికే మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
టాటా కార్లకు ఇంతటి ఆదరణ దక్కడానికి ప్రధాన కారణం వాటి సేఫ్టీ (Safety). గ్లోబల్ ఎన్‌క్యాప్ రేటింగ్‌లో టాటా కార్లు వరుసగా 5 స్టార్ రేటింగ్ సాధిస్తుండటంతో, కస్టమర్లు ప్రాణ రక్షణకు పెద్దపీట వేస్తూ ఈ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

కేవలం సేఫ్టీ మాత్రమే కాకుండా, అత్యాధునిక డిజైన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, మల్టీ-పావరట్రైన్ (పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఈవీ) ఆప్షన్లను అందుబాటులో ఉంచడం కంపెనీకి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ప్రతి వర్గం కస్టమర్‌కు నచ్చేలా వెరైటీ కార్లను టాటా అందిస్తోంది. ముఖ్యంగా ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోలో టాటా పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ వంటి మోడళ్లు అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి.
కంపెనీ వ్యూహంలో భాగంగా అక్టోబర్ 13, 2025 నుంచి టాటా మోటార్స్ లిమిటెడ్ పేరును అధికారికంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్గా మార్చారు. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, ప్యాసింజర్ వాహనాల వ్యాపారంపై కంపెనీకి ఉన్న నిబద్ధతకు, భవిష్యత్తు ప్రణాళికలకు నిదర్శనం.
ప్యాసింజర్ సెగ్మెంట్లో మరింత వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి ఈ మార్పు దోహదపడింది. దేశవ్యాప్తంగా ఉన్న బలమైన డీలర్ నెట్‌వర్క్, నమ్మకమైన సర్వీస్ సెంటర్లు కూడా టాటా ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి.

భవిష్యత్తులో టాటా మోటార్స్ నుంచి మరిన్ని అద్భుతమైన మోడళ్లు రాబోతున్నాయి. ఇప్పటికే టాటా అవిన్యా (Avinya), సియెర్రా (Sierra) వంటి మోడళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి. బడ్జెట్ ధరలో లభించే టియాగో, టిగోర్ ఈవీల నుంచి ప్రీమియం ఎస్‌యూవీల వరకు అన్ని సెగ్మెంట్లలో టాటా తన పట్టును బిగిస్తోంది.
ఫిబ్రవరిలో సాధించిన ఈ 57 శాతం వృద్ధి కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే నెలల్లో టాటా మోటార్స్ మరిన్ని మైలురాళ్లను అందుకుంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. సురక్షితమైన ప్రయాణం, పర్యావరణ హితమైన ఇంధన వనరుల కోసం చూస్తున్న భారతీయులకు టాటా ఇప్పుడు మొదటి ఛాయిస్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications








