టాటా కార్ల ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్.. ఎప్పటినుంచో అడుగుతున్న 4×4 ఫీచర్ ఇచ్చేస్తున్నారుగా!

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సరికొత్త అప్‌డేట్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా హారియర్, సఫారీ కార్లు వాటి లుక్స్, రోడ్ ప్రెజెన్స్, అద్భుతమైన ఫీచర్లతో మంచి అమ్మకాలను సాధిస్తున్నాయి. అయితే ఇవి మోనోకాక్ ప్లాట్‌ఫామ్‌ పై ఆధారపడి నిర్మించబడటం వల్ల వీటిలో ఆఫ్‌రోడింగ్‌కు ఉపయోగపడే 4×4 డ్రైవ్‌ ట్రెయిన్ సిస్టమ్ అందుబాటులో లేదు. టాటా ఫ్యాన్స్ చాలా కాలంగా ఈ ఫీచర్ కావాలని కోరుతుండటంతో, కంపెనీ ఇప్పుడు వారి డిమాండ్‌ను నెరవేర్చడానికి పటిష్టమైన లైనప్‌ ను సిద్ధం చేస్తోంది.

క్వాడ్ వీల్ డ్రైవ్ టెక్నాలజీతో టాటా సఫారీ ఈవీ
టాటా మోటార్స్ ఇప్పటికే తన హారియర్ ఈవీ (Harrier EV) లో క్వాడ్-వీల్-డ్రైవ్ (QWD) టెక్నాలజీని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది. ఇదే టెక్నాలజీని త్వరలో రాబోతున్న సరికొత్త సఫారీ ఈవీ (Safari EV) లోనూ ఉపయోగించనున్నారు. 2027 ప్రారంభం నాటికి ఈ కారు ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

tata motors upcoming 4x4 suvs safari ev avinya x harrier new generation launch news

టాటా అధునాతన 'Acti.ev' ప్లాట్‌ఫామ్‌ పై రూపొందుతున్న ఈ ఎస్‌యూవీ.. కంపెనీ నుంచి రాబోతున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ 7-సీటర్ కారు కావడం విశేషం. మార్కెట్లో ఇది మహీంద్రా XEV 9S వంటి ప్రీమియం కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.

పెట్రోల్, డీజిల్ లవర్స్ కోసం నెక్స్ట్ జనరేషన్ మోడల్స్
ఎలక్ట్రిక్ వాహనాలకు దూరంగా ఉంటూ కేవలం సాంప్రదాయ పెట్రోల్ లేదా డీజిల్ ఇంజన్ కార్లను ఇష్టపడే కస్టమర్ల కోసం కూడా టాటా మోటార్స్ ఒక సూపర్ ప్లాన్ సిద్ధం చేసింది. భవిష్యత్తులో రాబోయే నెక్స్ట్ జనరేషన్ హారియర్, సఫారీ కార్లలో 4×4 డ్రైవ్‌ ట్రెయిన్ ఆప్షన్‌ను అందించనున్నారు. వీటిని సరికొత్త ఆర్గోస్ (Argos) ప్లాట్‌ఫామ్‌పై డెవలప్ చేయనున్నారు.

tata motors upcoming 4x4 suvs safari ev avinya x harrier new generation launch news

ఈ ప్లాట్‌ఫామ్ 4×4 సిస్టమ్‌కు పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల మొదటిసారిగా టాటా ఐసీఈ (ICE) కార్లలో పూర్తి స్థాయి ఆఫ్‌రోడింగ్ సామర్థ్యాన్ని కస్టమర్లు ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు. అయితే ఈ మోడల్స్ మార్కెట్లోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

అవిన్యా ఎక్స్ (Avinya X) ప్రీమియం ఎలక్ట్రిక్ లగ్జరీ
టాటా మోటార్స్ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న బ్రాండ్ అవిన్యా. ఈ సిరీస్‌లో భాగంగా 2027లో కంపెనీ తన మొదటి మోడల్‌ను లాంచ్ చేయడానికి పనులు వేగవంతం చేసింది. ఇందులో అత్యంత లగ్జరీ ఫీచర్లతో రాబోతున్న కారే అవిన్యా ఎక్స్ (Avinya X). ఈ కారును టాటా-చెరి ఫ్రీలాండర్ (Tata Chery Freelander) ఆర్కిటెక్చర్‌పై నిర్మిస్తున్నారు.

tata motors upcoming 4x4 suvs safari ev avinya x harrier new generation launch news

ఇదొక ప్యూర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కాగా, ఇందులో ప్రీమియం 4×4 ఎలక్ట్రిక్ సెటప్‌ను అందించనున్నారు. లగ్జరీ, హై-పర్ఫార్మెన్స్‌ను ఇష్టపడే ధనికులను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ కారు అంచనా ఆన్-రోడ్ ధర మార్కెట్లో రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

Article Published On: Sunday, June 21, 2026, 9:18 [IST]
English summary
Tata motors upcoming 4x4 suvs safari ev avinya x harrier new generation launch news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+