రాబోయే 12 నెలల్లో 6 అద్భుతమైన కార్లు.. సియెర్రా నుంచి ఫ్లెక్స్ ఫ్యూయల్ వరకు మార్కెట్‌ను మార్చేలా టాటా ప్లాన్
భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా టాటా మోటార్స్ (Tata Motors) పేరు మార్మోగిపోతుంది. గత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల పరంగా సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ స్వదేశీ దిగ్గజం 2026-27 ఆర్థిక సంవత్సరంలో అంతకు మించిన జోరును చూపించేందుకు రెడీ అయిపోయింది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కేవలం పెట్రోల్, డీజిల్ కార్లకే పరిమితం కాకుండా.. ఎలక్ట్రిక్, ఫ్లెక్స్-ఫ్యూయల్ వంటి వినూత్న టెక్నాలజీతో కూడిన 6 సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి వదులుతోంది.
1. టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV):
టాటా మోటార్స్ చరిత్రలో సియెర్రా పేరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 90వ దశకంలో తన అద్భుతమైన డిజైన్‌తో కుర్రకారును ఫిదా చేసిన ఈ బ్రాండ్, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో గెటప్ మార్చి వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనే (జూలై-సెప్టెంబర్) ఇది లాంచ్ కానుంది. ఇందులో ప్రధానంగా 55 kWh, 65 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండబోతున్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చు. లోపల డ్రైవర్, ప్యాసింజర్ల కోసం మూడు స్క్రీన్ల అధునాతన డ్యాష్‌బోర్డ్, లెవల్-2 ఏడీఏఎస్ (ADAS) సేఫ్టీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఆఫ్‌రోడింగ్ ఇష్టపడే వారి కోసం ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్ కూడా ఉంటుందని సమాచారం.

2. టాటా సఫారి ఈవీ (Tata Safari EV):
ఇప్పటికే హారియర్ ఈవీపై భారీ అంచనాలు ఉండగా, టాటా తన ఫ్లాగ్‌షిప్ 7-సీటర్ ఎస్‌యూవీ సఫారి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా సిద్ధం చేసింది. మూడు వరుసల సీట్లు కలిగిన మొట్టమొదటి మెయిన్-స్ట్రీమ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా ఇది రికార్డు క్రియేట్ చేయనుంది. దీని డిజైన్ దాదాపు హారియర్ ఈవీని పోలి ఉన్నప్పటికీ, లోపల స్పేస్, ప్రీమియం ఫీచర్లు నెక్స్ట్ లెవల్‌లో ఉంటాయి. మహీంద్రా నుంచి రాబోతున్న XEV 9S కు ఇది గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. సుమారు రూ.26 లక్షల ప్రారంభ ధరతో ఇది మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

3. టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ (Tata Tiago Facelift):
బడ్జెట్ ధరలో టాటాకు గుర్తింపు తెచ్చిన టియాగో ఇప్పుడు సరికొత్త రూపంలో మెరవనుంది. బాహ్య అలంకరణలో భారీ మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, కొత్త గ్రిల్, స్పోర్టీ బంపర్లు దీనికి కొత్త కళను తెస్తాయి. అయితే ఇందులో అసలైన మార్పు ఎలక్ట్రిక్ వేరియంట్‌లో జరగబోతోంది. పంచ్ ఈవీలో వాడిన 30 kWh బ్యాటరీ ప్యాక్ ను ఇప్పుడు టియాగో ఈవీలో కూడా ప్రవేశపెట్టబోతున్నారు. దీనివల్ల నగరాల్లో తిరిగే మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ రేంజ్ లభించి, ఛార్జింగ్ టెన్షన్ తగ్గుతుంది.

4. టాటా టిగోర్ ఫేస్‌లిఫ్ట్ (Tata Tigor Facelift):
టియాగోతో పాటే దాని సెడాన్ వెర్షన్ టిగోర్ కూడా అప్‌డేట్ అవుతోంది. ఇంటీరియర్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ప్రీమియం సీట్ అప్హోల్స్టరీ ఉండబోతున్నాయి. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో తన పట్టును నిలుపుకోవడానికి టాటా చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. టిగోర్ ఈవీలో కూడా బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా దీన్ని లాంగ్ జర్నీలకు కూడా అనుకూలంగా మార్చుతున్నారు.
5. టాటా పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ (Punch Flex-Fuel):
టాటా పంచ్ ఇప్పటికే పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ రూపాల్లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు దీనికి తోడుగా ఫ్లెక్స్-ఫ్యూయల్ వేరియంట్‌ను టాటా తీసుకువస్తోంది. ఇది పెట్రోల్, ఇథనాల్ మిశ్రమంతో నడుస్తుంది. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా, పెట్రోల్ ధరల నుంచి వినియోగదారులకు భారీ ఉపశమనం లభిస్తుంది. 2026 చివరి నాటికి లేదా 2027 ఆరంభంలో ఇది లాంచ్ కావచ్చు. భవిష్యత్తులో పెట్రోల్ పై ఆధారపడటం తగ్గించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఇది ఒక గొప్ప మద్దతుగా నిలుస్తుంది.

6. టాటా అవిన్యా (Tata Avinya):
టాటా మోటార్స్ గ్యారేజీ నుంచి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన కారు అవిన్యా. ఇది జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతోంది. ఇది చూడ్డానికి ఒక విదేశీ లగ్జరీ స్పోర్ట్‌బ్యాక్ కారులా ఉంటుంది. దీని ఫీచర్లు, పెర్ఫార్మెన్స్ అత్యున్నత స్థాయిలో ఉండబోతున్నాయి. ప్రపంచ స్థాయి టెక్నాలజీని సామాన్యులకు అందించాలనే టాటా సంకల్పానికి ఇది నిదర్శనం. ఇది 2027 ఆరంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications