ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిమీ.. అదిరిపోయే లుక్స్‌తో ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఎలక్ట్రిక్ కార్లు
భారతదేశపు ఈవీ (EV) మార్కెట్లో టాటా మోటార్స్(Tata Motors) తిరుగులేని నంబర్-1 పొజిషన్‌లో దూసుకుపోతోంది. మార్కెట్లో తన పట్టును మరింత గట్టిగా ఉంచుకోవడానికి కంపెనీ సరికొత్త ప్లాన్‌తో సిద్ధమైంది. రాబోయే రోజుల్లో కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తున్న వారికి టాటా కంపెనీ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 500 నుంచి 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే 4 అద్భుతమైన ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి లాంచ్ చేయడానికి లైన్లో పెట్టింది. ఎంతో కాలంగా కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ ఫోర్ వీలర్స్ వివరాలు మరియు వాటి ప్రత్యేకతలు ఇక్కడ చూద్దాం.
కొత్త అవతారంలో టాటా టిగోర్ ఈవీ ఫేస్‌లిఫ్ట్
టాటా మోటార్స్ తన పాపులర్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు టిగోర్ ఈవీని సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో తీసుకురాబోతోంది. ఈ కొత్త మోడల్ ముందు భాగంలో సరికొత్త హెడ్‌ల్యాంప్స్, కొత్త డిజైన్ బంపర్, క్లోజ్డ్ గ్రిల్‌ను అందించనున్నారు. కారు వెనుక వైపు రిఫ్లెక్టర్ బార్‌తో అనుసంధానించబడిన సరికొత్త ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ రానున్నాయి. ఈ అప్‌డేటెడ్ సెడాన్‌లో టాటా తియాగో ఈవీ (Tiago EV) మోడల్‌లో ఉండే బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లనే ఇవ్వబోతున్నారని సమాచారం. దీనివల్ల ఈ కారు మునుపటి కంటే చాలా తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది.

ఐకానిక్ టాటా సియెర్రా ఈవీ ఈజ్ బ్యాక్
టాటా చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సియెర్రా కారు ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ రూపంలో మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రోడ్లపై టెస్టింగ్ చేస్తున్న సమయంలో దీని లుక్స్ బయటపడటంతో కార్ లవర్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కారు డిజైన్ పెట్రోల్/డీజిల్ వెర్షన్ లాగే ఉన్నప్పటికీ, ఎయిర్‌డైనమిక్ అల్లాయ్ వీల్స్, ఈవీ స్పెషల్ కలర్ థీమ్ దీనికి ప్రత్యేక లుక్‌ను ఇస్తాయి. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ట్రిపుల్-స్క్రీన్ సెటప్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, లెవెల్ 2 ADAS వంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఫీచర్లను అందిస్తున్నారు.
పెద్ద ఫ్యామిలీస్ కోసం టాటా సఫారీ ఈవీ
పెద్ద ఫ్యామిలీ ఉన్నవారికి, లగ్జరీ ఎస్‌యూవీలను ఇష్టపడే వారి కోసం టాటా మోటార్స్ ఈ ఏడాది పండుగ సీజన్ (Festive Season) సమయానికి సఫారీ ఈవీని లాంచ్ చేయనుంది. ఇది టాటా కంపెనీ నుంచి రాబోతున్న మొట్టమొదటి 3-రో (7-సీటర్) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. అంతేకాదు ఇది బ్రాండ్‌లోనే అత్యంత ఖరీదైన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కారుగా నిలవబోతోంది. ఈ కారు 65 kWh, 75 kWh అనే రెండు పెద్ద బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో రానుంది. ఇందులో ఉండే పెద్ద బ్యాటరీ ప్యాక్ సాయంతో ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 622 నుంచి 627 కిలోమీటర్ల వరకు మైలేజ్ (Range) వస్తుందని అంచనా.

అల్ట్రా లగ్జరీ లుక్స్‌తో టాటా అవిన్యా X
టాటా మోటార్స్ తన సరికొత్త అవిన్యా (Avinya) సిరీస్ ద్వారా అత్యంత ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లోకి అడుగుపెడుతోంది. ఈ సిరీస్ కార్లను విక్రయించడానికి టాటా కంపెనీ ప్రత్యేకమైన షోరూమ్‌లను కూడా ఏర్పాటు చేయబోతోంది. ఇందులో రాబోతున్న టాటా అవిన్యా ఎక్స్ అనేది ఒక సూపర్ లగ్జరీ క్రాస్‌ఓవర్ ఎస్‌యూవీ. ఇది కస్టమర్ల అవసరాలకు తగ్గట్లుగా 5, 6, 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు టాటా తయారు చేసిన ఏ కారులోనూ లేని విధంగా అత్యంత అడ్వాన్స్‌డ్, వినూత్నమైన ఫీచర్లను ఇందులో జోడించబోతున్నారు.


Click it and Unblock the Notifications