టాటా కారుకి బ్రహ్మరథం పడుతున్న జనాలు.. ప్రతినెలా 16 వేల మంది పైగా ఇదే కొంటున్నారు!
భారత ఆటోమొబైల్ రంగంలో విశ్వసనీయత, భద్రత, పనితీరు అనే మూడు ముఖ్య అంశాలను సమతుల్యం చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టాటా మోటార్స్ (Tata Motors)కు చెందిన టాటా నెక్సాన్ (Tata Nexon) మరోసారి మార్కెట్లో తన బలాన్ని ఘనంగా చాటుకుంది. SUVలకు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్ మధ్య, నెక్సాన్ నిరంతరం స్థిరమైన అమ్మకాలతో తన స్థానాన్ని బలపరుచుకుంటూ ముందంజలో కొనసాగుతోంది. తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు కూడా ఈ SUVపై వినియోగదారుల నమ్మకం ఎంత బలంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఏప్రిల్ 2026లో టాటా నెక్సాన్ మొత్తం 18,126 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో పెట్రోల్, డీజిల్ వంటి ICE వెర్షన్లతో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్ అమ్మకాలు కూడా ఉన్నాయి.
అన్ని వేరియంట్లను కలిపి ఈ స్థాయి అమ్మకాలు సాధించడం నెక్సాన్‌కు ఉన్న డిమాండ్‌ను సూచిస్తోంది. గత ఏడాది ఇదే నెలలో ఇది 15,457 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా, ఈ ఏడాది అదే కాలంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. మొత్తం అమ్మకాల్లో 2,669 యూనిట్ల పెరుగుదలతో పాటు, శాతంగా చూస్తే 17.27 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. మరో విషయం ఏంటంటే, ప్రతినెలా 16 వేల యూనిట్లు సేల్ అవుతుంది.

నెక్సాన్ విజయానికి ప్రధాన కారణం దాని బలమైన నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలు, విభిన్న పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లతో అన్ని రకాల వినియోగదారుల అవసరాలను తీర్చగలగడం దీని పెద్ద బలం. అందువల్లనే పోటీ ఎక్కువగా ఉన్న SUV సెగ్మెంట్‌లో కూడా నెక్సాన్ తన స్థిరమైన డిమాండ్‌ను కొనసాగిస్తోంది. నెలనెలా స్థిరంగా పెరుగుతున్న అమ్మకాలు ఈ మోడల్‌కు ఉన్న బలమైన మార్కెట్ స్థితిని మరోసారి రుజువు చేస్తున్నాయి.
ఈ కారు ఫీచర్స్ పరంగా ఇందులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తాయి. అదనంగా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, పుష్-స్టార్ట్ బటన్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

భద్రత విషయానికి వస్తే భారతదేశంలోనే మొదటిసారిగా Global NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన కాంపాక్ట్ SUVగా ఇది చరిత్ర సృష్టించింది. సేఫ్టీ కిట్ విషయానికి వస్తే 6 ఎయిర్‌బ్యాగ్స్, ABS, EBD, ESP, హిల్ హోల్డ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి నగర డ్రైవింగ్‌తో పాటు హైవే ప్రయాణాల్లో కూడా అదనపు భద్రతను అందిస్తాయి.
దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 7.32 లక్షల నుంచి రూ. 14.05 లక్షల మధ్య ఉంటుంది. ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, నెక్సాన్‌లో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పాటు 1.2-లీటర్ పెట్రోల్ + CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇలా విభిన్న ఫ్యూయల్ ఆప్షన్లు ఉండటం వల్ల వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం పొందుతున్నారు.

ఈ SUV సుమారు 17 నుంచి 24 kmpl వరకు మైలేజ్ అందిస్తుంది. ఇది పెట్రోల్, డీజిల్, CNG వేరియంట్లపై ఆధారపడి మారుతుంది. నెక్సాన్ ఈవీ ధర రూ. 12.49 లక్షల నుంచి రూ. 17.49 లక్షల మధ్య ఉండగా, ఇందులో 30 kWh, 45 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 275 నుంచి 489 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించగలదు.


Click it and Unblock the Notifications