మార్కెట్లో కొత్త సునామీ రాబోతుంది..డీజిల్ వెర్షన్లో కూడా రాబోతున్న టాటా లేటెస్ట్ సెన్సేషన్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ క్రియేట్ చేసిన అద్భుతం టాటా పంచ్(Tata Punch). తక్కువ ధరలో ఎస్యూవీ ఫీల్ ఇస్తూ, మిడిల్ క్లాస్ ప్రజల కలల వాహనంగా మారిన ఈ మైక్రో ఎస్యూవీ ఇప్పుడు మరో సంచలనానికి రెడీ అవుతోంది.

ఇప్పటివరకు పెట్రోల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న పంచ్.. త్వరలో డీజిల్ అవతారంలో కూడా గర్జించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సామాన్యుడి బడ్జెట్లో పవర్ఫుల్ డీజిల్ ఎస్యూవీ రావాలనేది చాలా మంది కోరిక. ఈ కోరికను తీర్చేందుకు టాటా మోటార్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Tata Punch Diesel Coming Soon Tata Motors Hints at Budget Diesel SUV for India

టాటా పంచ్ భారతీయ మార్కెట్లో ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఏడాది ఏకంగా 1,73,502 యూనిట్లు అమ్ముడై, మారుతి సుజుకికి చెందిన వ్యాగన్‎ఆర్, స్విఫ్ట్ వంటి దిగ్గజ మోడళ్లకు సైతం గట్టి పోటీ ఇచ్చింది. ఇటీవలే టాటా మోటార్స్ పంచ్ ఫేస్‎లిఫ్ట్ వెర్షన్‎ను కూడా లాంచ్ చేసింది.

ఇందులో అద్భుతమైన లుక్స్ తో పాటు కొత్తగా టర్బో పెట్రోల్ ఇంజిన్‎ను కూడా పరిచయం చేసింది. అయితే కార్ లవర్స్ నుంచి ఒకే ఒక విజ్ఞప్తి వినిపిస్తోంది.. అది టాటా ఆల్ట్రోజ్‌లో ఉన్న డీజిల్ ఇంజిన్‌ను పంచ్‌లో కూడా పెట్టండి అని.

Tata Punch Diesel Coming Soon Tata Motors Hints at Budget Diesel SUV for India

తాజాగా ఈ అంశం మీద టాటా మోటార్స్ ప్యాపింజర్ వెహికల్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ మోహన్ సావర్కర్ స్పందించారు. మార్కెట్లో డిమాండ్ ఉంటే, కస్టమర్లు కోరుకుంటే పంచ్ డీజిల్ వెర్షన్‎ను తీసుకురావడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటికే పంచ్ ఐ టర్బో రాకతో మంచి స్పందన వస్తోందని, భవిష్యత్తులో లాంచ్ చేసే ఇంజిన్లన్నీ వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ మీదనే ఆధారపడి ఉంటాయని ఆయన వివరించారు. అంటే జనం నుంచి గట్టిగా డిమాండ్ వస్తే డీజిల్ పంచ్ రావడం ఖాయం.

Tata Punch Diesel Coming Soon Tata Motors Hints at Budget Diesel SUV for India

టాటా పంచ్‎ను డీజిల్ ఇంజిన్‎తో తీసుకురావడం కంపెనీకి పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే పంచ్, ఆల్ట్రోజ్ రెండు కార్లు టాటా ఆల్ఫా ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌పైనే నిర్మించబడ్డాయి. కాబట్టి ఆల్ట్రోజ్‎లో విజయవంతంగా నడుస్తున్న 1.5 లీటర్ రెవోటార్క్ డీజిల్ ఇంజిన్‌ను పంచ్‎లో అమర్చడం టెక్నికల్‎గా కూడా చాలా సులభం.

ఈ ఇంజిన్ సుమారు 89 bhp పవర్‌ను, 200 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది పంచ్ బరువుకు సరిగ్గా సరిపోవడమే కాకుండా, ఎక్స్టర్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తుంది.

Tata Punch Diesel Coming Soon Tata Motors Hints at Budget Diesel SUV for India

ప్రస్తుతం డీజిల్ ఎస్యూవీ కొనాలంటే కనీసం రూ.10 లక్షల పైన ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉదాహరణకు టాటా నెక్సాన్ డీజిల్ ధరలు సామాన్యులకు కొంచెం భారంగానే ఉన్నాయి. ఒకవేళ పంచ్‌లో డీజిల్ ఇంజిన్ వస్తే.. అది రూ.8 నుంచి 9 లక్షల రేంజ్‎లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇది భారతదేశంలోనే అత్యంత చవకైన డీజిల్ ఎస్‌యూవీగా నిలుస్తుంది. ఆల్ట్రోజ్ డీజిల్ సుమారు 23.60 కి.మీ మైలేజీ ఇస్తోంది. ఒకవేళ ఇదే మైలేజీ పంచ్‌లో కూడా సాధ్యమైతే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎగబడి కొంటారనడంలో సందేహం లేదు.

అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని కూడా గమనించాలి. బీ-ఎస్‌యూవీ సెగ్మెంట్లో ప్రస్తుతం పెట్రోల్, సీఎన్‌జీ కార్లకే ఆదరణ ఎక్కువగా ఉంటుంది. నెక్సాన్ మొత్తం సేల్స్‎లో డీజిల్ వాటా కేవలం 16 శాతం మాత్రమే కాగా, ఆల్ట్రోజ్‌లో కూడా అది 8 శాతంగా ఉంది.

ఈ క్రమంలో పంచ్ డీజిల్ ఎంతవరకు క్లిక్ అవుతుందనేది టాటా మోటార్స్ లెక్కలు వేస్తోంది. అయినప్పటికీ డిజిల్ లవర్లకు ఇదొక గొప్ప ఆప్షన్ అవుతుంది. 120 bhp పవర్‌తో వచ్చే టర్బో పెట్రోల్ ఒక ఎత్తు అయితే, 200 Nm టార్క్‌తో దూసుకుపోయే డీజిల్ పంచ్ మరో ఎత్తు అని చెప్పొచ్చు. టాటా గనుక ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే మారుతి, హ్యుందాయ్ సంస్థలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిందే.

More from DriveSpark

Article Published On: Friday, January 23, 2026, 11:55 [IST]
English summary
Tata punch diesel coming soon tata motors hints at budget diesel suv for india
Read more on: #tata motors #diesel car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+