తక్కువ బడ్జెట్‌లో మోస్ట్ పాపులర్ ఈవీ కార్లు.. సింగిల్ ఛార్జ్‌తో వందల కిలోమీటర్లు! రెండింటిలో ఏది బెస్ట్?

గత కొన్నేళ్లుగా భారతదేశ ఆటోమొబైల్ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ వాహనాలకే పరిమితమైన మార్కెట్ ఇప్పుడు క్రమంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణ కాలుష్యంపై పెరుగుతున్న ఆందోళనలు, అలాగే కొత్త టెక్నాలజీల అందుబాటు కారణంగా వినియోగదారుల ఆలోచనల్లో కూడా పెద్ద మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా యువత, నగరాల్లో రోజూ ప్రయాణించే ఉద్యోగులు, తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనుకునే కుటుంబాలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. రోజూ ఆఫీసులకు వెళ్లేవారు, నగరాల్లో ఎక్కువగా ప్రయాణించే వారు ఇప్పుడు పెట్రోల్ ఖర్చులను తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ కార్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ కథణంలో టాటా పంచ్ ఈవీ, టియాగో ఈవీ గురించి చూద్దాం.

Tata Punch Ev: డిజైన్ పరంగా చూస్తే టాటా పంచ్ EV చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. టాటా కొత్త EV డిజైన్ లాంగ్వేజ్‌తో వచ్చిన ఈ SUV ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్, కనెక్టెడ్ LED DRLs, స్టైలిష్ హెడ్‌ల్యాంప్స్ వంటి అంశాలతో మరింత ఫ్యూచరిస్టిక్ లుక్‌ను అందిస్తోంది. బయటకు చిన్న SUVలా కనిపించినప్పటికీ, బలమైన బాడీ డిజైన్, ఎత్తైన స్టాన్స్ కారణంగా రోడ్లపై మంచి రోడ్ ప్రెజెన్స్‌ను ఇస్తుంది.

Tata Punch Ev And Tiago Ev Best Budget Electric Cars In India

ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ SUV ధర రూ. 9.69 లక్షల నుంచి రూ. 12.59 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. అయితే మరింత తక్కువ ప్రారంభ ధరలో EV కొనాలనుకునే వారి కోసం టాటా 'BaaS' (Battery as a Service) ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు కారును కేవలం రూ. 6.49 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.

అయితే బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు సుమారు రూ. 2.60 చెల్లించాల్సి ఉంటుంది. రేంజ్ విషయంలో కూడా టాటా పంచ్ ఎలక్ట్రిక్ SUV రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. 25 kWh బ్యాటరీ ప్యాక్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 265 కి.మీ. రేంజ్‌ను అందిస్తుంది. మరోవైపు 35 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్ సుమారు 365 కి.మీ. వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.

Tata Punch Ev And Tiago Ev Best Budget Electric Cars In India

Tiago Ev: భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో గుర్తింపు తెచ్చుకున్న మోడళ్లలో టాటా టియాగో EV ఒకటి. డిజైన్ పరంగా చూస్తే టాటా టియాగో EV చాలా ఆధునికంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సాధారణ పెట్రోల్ టియాగోతో పోలిస్తే EV వెర్షన్‌లో కొన్ని ప్రత్యేకమైన డిజైన్ మార్పులు కనిపిస్తాయి. ముందు భాగంలో EV బ్యాడ్జింగ్, స్టైలిష్ గ్రిల్, సిగ్నేచర్ బ్లూ హైలైట్స్ కారుకు మరింత ప్రీమియం లుక్‌ను తీసుకువస్తాయి.

ఫీచర్ల పరంగా టియాగో EV వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ధర పరంగా కూడా చాలా పోటీగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.14 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. పెద్ద SUV తరహా పంచ్ EV అవసరం లేని వారికి, కాంపాక్ట్ సైజులో సులభంగా నగరాల్లో డ్రైవ్ చేయగల EV కావాలనుకునే వారికి టియాగో EV మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది.

Tata Punch Ev And Tiago Ev Best Budget Electric Cars In India

రేంజ్ విషయంలో వినియోగదారులకు మంచి ఎంపికలను అందిస్తోంది. టాటా టియాగో EV రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తుంది. 19.2 kWh బ్యాటరీ ప్యాక్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 223 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. మరోవైపు పెద్ద 24 kWh బ్యాటరీ ప్యాక్ సుమారు 293 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, నగర వినియోగానికి ఈ రేంజ్ చాలానే సరిపోతుంది.

Article Published On: Friday, May 8, 2026, 16:36 [IST]
English summary
Tata punch ev and tiago ev best budget electric cars in india
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+