రూ.100తో 450 కిమీ ప్రయాణం..కేవలం రూ.6.49 లక్షలకే టాటా పంచ్ ఈవీ..డెలివరీలు షురూ
భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కలలను నిజం చేస్తూ, అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటును కల్పిస్తూ టాటా మోటార్స్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇప్పటికే మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాటా పంచ్ ఇవి (Tata Punch EV) ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో మరిన్ని హంగులతో సిద్ధమైంది. కేవలం 100 రూపాయల ఖర్చుతోనే హైదరాబాద్ నుంచి విజయవాడ లేదా చెన్నై నుంచి మదురై వరకు ప్రయాణించే అద్భుతమైన అవకాశం ఈ కారుతో సాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాటా పంచ్ ఇవి ఫేస్‌లిఫ్ట్ మోడల్‌కు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి చివరి వారం (ఫిబ్రవరి 2026 చివరి నాటికి) నుండి ఈ కార్లను కస్టమర్లకు డెలివరీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో కొత్త కారు కోసం వేచి చూస్తున్న అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ కారులో ప్రధానంగా రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చారు.

మొదటిది 30 kWh బ్యాటరీ కాగా, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 365 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇక లాంగ్ డ్రైవ్స్ ఇష్టపడే వారి కోసం 40 kWh బ్యాటరీ వెర్షన్ ఉంది, ఇది ఏకంగా 468 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. కేవలం 26 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ ఎక్కేలా ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కల్పించడం విశేషం.
కారు లోపలి ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 10.25 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, మరియు వెంటిలేటెడ్ సీట్లు వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ విషయంలో కూడా టాటా రాజీ పడలేదు. భారత్ NCAP క్రాష్ టెస్టులో ఇప్పటికే 5 స్టార్ రేటింగ్ సాధించిన ఈ కారులో, ఇప్పుడు అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. ఈవీ టెక్నాలజీతో పాటు కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుంచే కారును కంట్రోల్ చేసే వీలుంది.

ధర విషయానికి వస్తే.. టాటా మోటార్స్ తన కస్టమర్ల కోసం ఒక వినూత్నమైన BAAS (Battery As A Service) ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ పద్ధతిలో కారు కొంటే బ్యాటరీ ధరను ముందుగా చెల్లించాల్సిన అవసరం లేదు. దీనివల్ల కారు ప్రారంభ ధర కేవలం 6.49 లక్షల రూపాయలకే లభిస్తుంది. అయితే, మీరు ప్రయాణించే ప్రతి కిలోమీటరుకు సుమారు రూ. 2.60 చొప్పున ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కారును పూర్తిగా సొంతం చేసుకోవాలనుకుంటే, ప్రారంభ వేరియంట్ ధర రూ. 9.69 లక్షల నుంచి ఉంటుంది.
అసలు ఈ కారుతో 100 రూపాయలకే అంత దూరం ఎలా వెళ్లవచ్చు అనే కదా మీ డౌట్? విశ్లేషకుల లెక్క ప్రకారం.. ఈ కారును నడపడానికి కిలోమీటరుకు అయ్యే విద్యుత్ ఖర్చు కేవలం రూ.1.25 పైసలు మాత్రమే. ఉదాహరణకు 450 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి సుమారు రూ.560 ఖర్చవుతుంది. ఇది 5 సీటర్ కారు కాబట్టి, ఒక్కొక్కరు షేర్ చేసుకుంటే ఆ ఖర్చు కేవలం వంద రూపాయల లోపే పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఇంతకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది? అందుకే ఈ కారు డెలివరీల కోసం ఇప్పుడు భారత్ మొత్తం ఎదురుచూస్తోంది.


Click it and Unblock the Notifications








