కారు కాదు ఇది ఒక ఉక్కు కోట.. రూ. 10 లక్షల లోపే 5-స్టార్ భద్రతతో వచ్చిన టాటా అద్భుతం

టాటా మోటార్స్ ఇండియన్ రోడ్లపై మరోసారి తన సేఫ్టీ సత్తాను చాటుతోంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రో ఎస్‌యూవీ పంచ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో కొత్త హంగులతో మార్కెట్లోకి వచ్చింది. టాటా పంచ్ ఈవీఫేస్‌లిఫ్ట్ లాంచ్ అవ్వడమే కాదు, తన ధరతోనూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

పాత మోడల్ కంటే ఏకంగా రూ. 1.85 లక్షలు తక్కువ ధరకే లభిస్తుండటంతో కస్టమర్లు షోరూమ్‌లకు క్యూ కడుతున్నారు. అయితే కేవలం ధర తగ్గడమే కాదు, ఈ కారు సేఫ్టీ విషయంలో కూడా అన్‌స్టాపబుల్ అని నిరూపించుకుంటోంది. భారత్ NCAP (BNCAP) క్రెష్ టెస్టుల్లో ఇది 5-స్టార్ రేటింగ్ సాధించడం దాదాపు ఖాయమని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Tata Punch EV Facelift to Dominate the Electric Market with 5-Star Rating

టాటా పంచ్ ఎప్పుడూ సేఫ్టీకి మారుపేరుగా నిలుస్తుంది. కొత్త పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ను కంపెనీ పంచ్ ICE (పెట్రోల్) ప్లాట్‌ఫామ్ ఆధారంగానే రూపొందించింది. ఈ ప్లాట్‌ఫామ్‌కు ఇప్పటికే భారత్ NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. పాత పంచ్ ఈవీ కూడా 2024లో జరిగిన టెస్టుల్లో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (పెద్దల రక్షణ), చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (పిల్లల రక్షణ) విభాగాల్లో 5-స్టార్ రేటింగ్ సాధించి రికార్డు సృష్టించింది. తాజా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో టాటా మోటార్స్ మరిన్ని అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లను జోడించింది.

2024లో జరిగిన టెస్టుల్లో పంచ్ ఈవీ అద్భుతమైన మార్కులు సాధించింది. అడల్ట్ ఆక్యుపెన్సీ ప్రొటెక్షన్ (AOP)లో 32 పాయింట్లకు గాను 31.46 పాయింట్లు సాధించి ఔరా అనిపించింది. ఇక పిల్లల రక్షణ (COP) విషయంలో 49 పాయింట్లకు గాను 45 పాయింట్లు దక్కించుకుంది. ముఖ్యంగా సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ (పక్క నుంచి వచ్చే ఢీకొనే ప్రమాదాలు)లో ఈ కారు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అప్పట్లోనే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ESC వంటి ఫీచర్లను టాటా స్టాండర్డ్ (అన్ని వేరియంట్లలో) ఇచ్చింది. ఇప్పుడు కొత్త మోడల్‌లో వీటిని మరింత పటిష్టం చేశారు.

Tata Punch EV Facelift to Dominate the Electric Market with 5-Star Rating

కొత్త పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో సేఫ్టీ కేవలం రేటింగ్స్ కే పరిమితం కాలేదు. ఇందులో హై-టెక్ ఫీచర్ల సందడి కనిపిస్తోంది. ఇప్పుడు బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్ వరకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తున్నాయి. 360-డిగ్రీ కెమెరా ద్వారా ఇరుకైన సందుల్లో లేదా పార్కింగ్ చేసేటప్పుడు కారు చుట్టూ ఏముందో స్క్రీన్ మీద స్పష్టంగా చూడవచ్చు.

వేగంగా వెళ్తున్నప్పుడు కారు అదుపు తప్పకుండా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) సిస్టమ్ కాపాడుతుంది. కొండ ప్రాంతాల్లో లేదా ఎత్తుపై కారు ఆగి ముందుకు వెళ్లేటప్పుడు వెనక్కి జారిపోకుండా హిల్ హోల్డ్ అసిస్ట్ ఆపుతుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ (i-TPMS) టైర్లలో గాలి తక్కువగా ఉంటే ముందే హెచ్చరిస్తుంది. చిన్న పిల్లల సీట్లను భద్రంగా అమర్చుకోవడానికి ISOFIX మౌంట్స్ ఉపయోగపడుతుంది.

Tata Punch EV Facelift to Dominate the Electric Market with 5-Star Rating

టాటా మోటార్స్ ఇటీవల ఒక ప్రత్యేకమైన సిమ్యులేషన్ టెస్ట్ నిర్వహించింది. 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు ఒక ట్రక్కును నేరుగా ఢీకొంటే ఏమవుతుంది అనేదాన్ని పరీక్షించారు. ఇందులో నలుగురు డమీ ప్రయాణికులను కూర్చోబెట్టారు. ఆశ్చర్యకరంగా, అంత పెద్ద ఇంపాక్ట్ జరిగినప్పటికీ కారు బాడీ స్ట్రక్చర్ చెక్కుచెదరలేదు. మరీ ముఖ్యంగా ప్రమాదం తర్వాత నాలుగు డోర్లు సులభంగా తెరుచుకున్నాయి. ఇది అత్యవసర సమయాల్లో ప్రయాణికులు సురక్షితంగా బయటకు రావడానికి ఎంతో తోడ్పడుతుంది.

సేఫ్టీ మాత్రమే కాదు, సౌకర్యాల విషయంలోనూ పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ రాజీ పడలేదు. ఇందులో 10.25-అంగుళాల అప్‌డేటెడ్ టచ్‌స్క్రీన్, 7-అంగుళాల డిజిటల్ క్లస్టర్ ఉన్నాయి. ఎండకాలంలో చల్లగా ఉంచే వెంటీలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ప్రీమియం ఫీచర్లు ఈ బడ్జెట్ ఎలక్ట్రిక్ కారులో ఉండటం విశేషం. క్రూయిజ్ కంట్రోల్ సాయంతో హైవేలపై ప్రయాణం మరింత సులభతరం అవుతుంది.

మీరు ఒక సురక్షితమైన, బడ్జెట్ ఫ్రెండ్లీ, ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తుంటే పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. ధర తగ్గడం, రేంజ్ పెరగడం, 5-స్టార్ సేఫ్టీ భరోసా ఉండటంతో ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో వాల్యూ ఫర్ మనీ ఆప్షన్‌గా నిలుస్తోంది. బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ (BaaS) ఆప్షన్ తో ఇది సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది.

More from DriveSpark

Article Published On: Saturday, February 21, 2026, 13:53 [IST]
English summary
Tata punch ev facelift to dominate the electric market with 5 star rating
Read more on: #tata motors #electric car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+