టాటా పంచ్ అరాచకం భయ్యా.. సెగ్మెంట్లోనే ఫస్ట్ టైం ఆ ఫీచర్..మైలేజీలోనూ రికార్డు

భారతీయ రోడ్ల మీద మైక్రో ఎస్‌యూవీ (Micro SUV)ల హవాను మొదలుపెట్టిన టాటా పంచ్ ఇప్పుడు మరింత శక్తివంతంగా, స్టైలిష్‌గా మన ముందుకు వచ్చింది. కేవలం బడ్జెట్ కారుగానే కాకుండా, ప్రీమియం ఫీచర్లతో 2026 మోడల్‌ను టాటా మోటార్స్ విడుదల చేసింది.

హ్యుందాయ్ ఎక్స్టర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లకు మార్కెట్లో గట్టి పోటీనిస్తూ, పంచ్ ఫేస్‌లిఫ్ట్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు సేఫ్టీతో పాటు లగ్జరీని అందించాలనే లక్ష్యంతో ఈ కారును డిజైన్ చేశారు. ఈ కారులోని ఆ 5 అద్భుతమైన ఫీచర్లు ఏంటో వివరంగా చూద్దాం.

tata punch facelift 2026 5 game-changing features that destroy rivals

1.సిఎన్జీలో ఆటోమేటిక్ (AMT) మ్యాజిక్
సాధారణంగా సిఎన్జీ కార్లంటే కేవలం మాన్యువల్ గేర్ బాక్స్‌తోనే వస్తాయి. ఈ సంప్రదాయాన్ని పటాపంచలు చేస్తూ టాటా కంపెనీ పంచ్‎లో కొత్త పద్ధతి మొదలు పెట్టింది. సెగ్మెంట్‌లోనే తొలిసారిగా సిఎన్జీ వేరియంట్‌లో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.

దీనివల్ల ట్రాఫిక్ రద్దీలో గేర్లు మార్చే తలనొప్పి ఉండదు. ఇక మైలేజీ విషయానికి వస్తే, ఇది కిలో సిఎన్జీకి ఏకంగా 26.99 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఎక్స్టర్ లేదా మాగ్నైట్ సిఎన్జీ కార్లలో ఇప్పటికీ ఈ ఆటోమేటిక్ సౌకర్యం లేకపోవడం పంచ్‌కు అతిపెద్ద ప్లస్ పాయింట్.

2. టెక్నాలజీలో తోపు
కారు లోపలికి అడుగుపెట్టగానే మనల్ని మంత్రముగ్ధులను చేసేది ఇందులోని భారీ 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది.

tata punch facelift 2026 5 game-changing features that destroy rivals

అంతేకాకుండా, డ్రైవర్ కోసం పూర్తి డిజిటల్ డిస్ప్లేను అందించారు, ఇది కారుకు సంబంధించిన రియల్ టైమ్ సమాచారాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. పోటీ కార్లయిన ఎక్స్టర్, మాగ్నైట్‌లలో కేవలం 8 ఇంచ్ స్క్రీన్ మాత్రమే ఉండగా, పంచ్ మాత్రం తన టెక్నాలజీతో కుర్రకారును ఆకర్షిస్తోంది.

3. సేఫ్టీలో తగ్గేదేలే
చిన్న కారు కదా అని ఫీచర్లు తక్కువ ఉంటాయనుకుంటే పప్పులో కాలేసినట్లే. పార్కింగ్ ఈజీ చేసేందుకు 360-డిగ్రీ సరాండ్ వ్యూ కెమెరాను ఇందులో అమర్చారు. ఇక ఎండకాలంలో ప్రయాణం హాయిగా ఉండటానికి ముందు వైపు వెంటిలేటెడ్ సీట్లను కూడా ఇచ్చారు.

మారుతి ఫ్రాంక్స్ లేదా కియా సోనెట్ బేస్ వేరియంట్లలో కూడా లేని ఈ ప్రీమియం ఫీచర్లు పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో ఉండటం విశేషం. నిస్సాన్ మాగ్నైట్‌లో కెమెరా ఉన్నా వెంటిలేటెడ్ సీట్లు లేవు, ఈ విషయంలో పంచ్ ఒక అడుగు ముందే ఉంది.

tata punch facelift 2026 5 game-changing features that destroy rivals

4. టర్బో పవర్
స్పీడ్ అంటే ఇష్టపడే వారి కోసం టాటా ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ను పరిచయం చేసింది. ఇది గరిష్టంగా 110 bhp పవర్ను ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్‌లో అసలు టర్బో ఆప్షనే లేదు, ఇక మాగ్నైట్ టర్బో కేవలం 99 bhp మాత్రమే ఇస్తుంది.

అంటే పవర్ పరంగా పంచ్ ఒక బుల్లెట్‌లా దూసుకుపోతుంది. అయితే, ఈ టర్బో ఇంజిన్ ప్రస్తుతం 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.

5. ఫైవ్ స్టార్ సేఫ్టీ, ఈవీ ఇన్‌స్పైర్డ్ డిజైన్!
టాటా కార్లంటేనే సేఫ్టీకి మారుపేరు. కొత్త పంచ్ భారత్ NCAP రేటింగ్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించి సెగ్మెంట్‌లోనే సురక్షితమైన కారుగా నిలిచింది. డిజైన్ విషయానికి వస్తే, ఇది పంచ్ ఈవీ (EV) నుంచి స్ఫూర్తి పొందింది.

సన్నని ఎల్ఈడీ డీఆర్ఎల్స్ (LED DRLs), కనెక్టెడ్ టెయిల్ లైట్లు, కొత్త అలాయ్ వీల్స్‌తో రోడ్డుపై వెళ్తుంటే అందరూ తిరిగి చూడాల్సిందే. రూ.5.59 లక్షల ప్రారంభ ధరతో 10 లక్షల బడ్జెట్‌లో ఇది ఒక పక్కా ఫ్యామిలీ ఎస్‌యూవీ.

More from DriveSpark

Article Published On: Monday, January 19, 2026, 17:00 [IST]
English summary
Tata punch facelift 2026 5 game changing features that destroy rivals
Read more on: #tata motors #facelift #amt
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+