దేశం మొత్తం ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది..రేపే టాటా పంచ్ ఇంటికి తెచ్చుకోండి

Tata Punch : టాటా మోటార్స్ నుంచి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్(Tata Punch Facelift) విడుదలకు ముహూర్తం ఖరారైంది. జనవరి 13, 2026న ఈ కారు అధికారికంగా మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. అయితే, లాంచ్‌కు ముందే ఈ కొత్త మోడల్ దేశవ్యాప్తంగా ఉన్న టాటా డీలర్‌షిప్ షోరూమ్‌లకు చేరుకోవడం విశేషం.

ముఖ్యంగా షోరూమ్‌లో ఉన్న పంచ్ సిఎన్‌జి(CNG) ఫేస్‌లిఫ్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షోరూమ్‌కు వచ్చే కస్టమర్లందరి కళ్లు ఇప్పుడు ఈ చిట్టి ఎస్‌యూవీపైనే ఉన్నాయి. ఈ కొత్త వెర్షన్‌లో జరిగిన మార్పులు, కొత్త ఫీచర్లు, ఇంజిన్ ఆప్షన్లు అదిరిపోయే విధంగా ఉన్నాయి.

Tata Punch Facelift Launch Tomorrow New Turbo Engine 360 Camera to Take on Hyundai Exter 2026

2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ తన పాత రూపాన్ని కాపాడుకుంటూనే, ఆధునిక హంగులను అద్దుకుంది. దీని ఎక్స్‎టీరియర్లో జరిగిన ప్రధాన మార్పులు పరిశీలిస్తే.. టాటా సఫారి, హారియర్, నెక్సాన్ మోడళ్ల స్ఫూర్తితో దీని ఫ్రంట్ గ్రిల్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ (LED DRLs)లను డిజైన్ చేశారు. బోనెట్ పొడవునా సాగే లైట్ బార్ కారుకు ప్రీమియం లుక్ ఇస్తుంది.

రీ-డిజైన్ చేసిన హెడ్ ల్యాంప్స్, కొత్త టెయిల్ లైట్లు కారును మరింత అట్రాక్టివ్‌గా మార్చాయి. స్పోర్టీ లుక్ కోసం బ్లాక్ కలర్ అలాయ్ వీల్స్‌ను ఇందులో చేర్చారు. ముందు, వెనుక బంపర్లను మరింత బలంగా, రగ్గడ్ లుక్ వచ్చేలా తీర్చిదిద్దారు. కూర్గ్ క్లౌడ్స్ అనే సరికొత్త రంగుతో పాటు మొత్తం ఆరు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ కారు లభించనుంది.

Tata Punch Facelift Launch Tomorrow New Turbo Engine 360 Camera to Take on Hyundai Exter 2026

కారు లోపలి భాగంలో (Interior) టాటా మోటార్స్ భారీ మార్పులు చేసింది. ప్రీమియం కార్లలో ఉండే ఫీచర్లను ఇప్పుడు పంచ్‌లో చూడవచ్చు. డాష్‌బోర్డ్‌పై ఫ్లోటింగ్ ఎఫెక్ట్‌తో కూడిన పెద్ద 10.25 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణ. టాటా కర్వ్ (Curvv) లో చూసినట్లుగా, సెంటర్‌లో వెలిగే టాటా లోగో ఉన్న 2-స్పోక్ స్టీరింగ్ వీల్ ఇందులో ఉంది.

ఫిజికల్ బటన్ల స్థానంలో టచ్ ద్వారా ఆపరేట్ చేసే ఏసీ కంట్రోల్ ప్యానెల్ ఇచ్చారు. డ్రైవర్ కోసం 7-ఇంచుల టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. కస్టమర్లు గ్రే, బ్లాక్, వైట్ కలర్ కాంబినేషన్లలో ఇంటీరియర్‌ను ఎంచుకోవచ్చు.

Tata Punch Facelift Launch Tomorrow New Turbo Engine 360 Camera to Take on Hyundai Exter 2026

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు కేవలం లుక్స్ మాత్రమే కాదు, పెర్ఫార్మెన్స్‌లో కూడా దూసుకుపోనుంది.
1.2L పెట్రోల్ ఇంజిన్: ఇది పాత మోడల్ లాగే 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ (AMT) ఆప్షన్లతో కొనసాగుతుంది.
1.2L టర్బో-పెట్రోల్ ఇంజిన్: ఇది ఈసారి కొత్తగా జోడించిన ఆప్షన్. వేగాన్ని ఇష్టపడే వారి కోసం ఈ టర్బో ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులోకి రానుంది.

ట్విన్ సిలిండర్ సిఎన్‌జి (CNG): సిఎన్‌జి వెర్షన్‌లో టాటా పేటెంట్ పొందిన ట్విన్ సిలిండర్ టెక్నాలజీని వాడుతున్నారు. దీనివల్ల డిక్కీలో (Boot Space) స్పేస్ అస్సలు తగ్గదు. ఇది సుమారు 28 కిమీ మైలేజీని ఇస్తుందని సమాచారం.

టాటా పంచ్ ఇప్పటికే గ్లోబల్ NCAP రేటింగ్‌లో 5-స్టార్లను సాధించిన కారు. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో దీనిని మరింత పటిష్టం చేశారు. సేఫ్టీ కోసం అన్ని వేరియంట్లలో 6 ఎయిర్ బ్యాగులను స్టాండర్డ్ ఫీచర్‌గా ఇచ్చే అవకాశం ఉంది. ఇరుకైన సందుల్లో కూడా కారును సులభంగా పార్క్ చేయడానికి ఈ 360 కెమెరా ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏబీఎస్ (ABS), ఈబీడీ (EBD), ఐసోఫిక్స్ (ISOFIX) చైల్డ్ సీట్ మౌంట్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారత మార్కెట్లో టాటా పంచ్ ప్రధానంగా హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) తో తలపడనుంది. ఎక్స్‌టర్‌లో ఉన్న 6 ఎయిర్ బ్యాగులు మరియు ఇతర ఫీచర్లకు ధీటుగా టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను రూపొందించారు.

ప్రస్తుతం ఉన్న పంచ్ ధర రూ.6.13 లక్షల నుండి రూ.10.20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కొత్త ఫీచర్లు, టర్బో ఇంజిన్ కారణంగా, ఫేస్‌లిఫ్ట్ ధరలు సుమారు రూ.30,000 నుండి రూ.50,000 వరకు పెరిగే అవకాశం ఉంది.

జనవరి 13న ధరలు వెల్లడైన వెంటనే బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు ప్రారంభం కానున్నాయి. మీరు బడ్జెట్ ధరలో ఒక సేఫ్టీ, స్టైలిష్, ఫీచర్ రిచ్ ఎస్‌యూవీ కోసం చూస్తుంటే, మరికొద్ది రోజులు ఆగి టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను పరిశీలించడం ఉత్తమం.

More from DriveSpark

Article Published On: Monday, January 12, 2026, 17:24 [IST]
English summary
Tata punch facelift launch tomorrow new turbo engine 360 camera to take on hyundai exter
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+