యాక్సిడెంట్ అయినా ఏమీ కాదు..డోర్ తీసి హాయిగా బయటకు రావచ్చు..పంచ్ అదిరింది బాసూ
టాటా మోటార్స్ అంటేనే భద్రతకు మారుపేరు. ఈ విషయాన్ని కంపెనీ మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. తన పాపులర్ మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్(Tata Punch) కొత్త వెర్షన్‌ను లాంచ్ చేస్తూ, దాని దృఢత్వాన్ని నిరూపించడానికి ఏకంగా ఒక లారీతోనే ఢీకొట్టించింది. సాధారణంగా కార్లను ల్యాబ్‌లలో టెస్ట్ చేస్తారు, కానీ టాటా ఏకంగా రియల్ లైఫ్ యాక్సిడెంట్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించింది.
భారతీయ రోడ్లపై ప్రయాణం అంటే సాహసంతో కూడుకున్న పని. ఎప్పుడు ఏ వాహనం ఎటు నుంచి వస్తుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో వాహనదారులకు కావలసింది కేవలం స్టైల్, మైలేజీ మాత్రమే కాదు.. ప్రాణాలు కాపాడే పటిష్టమైన బాడీ. ఈ విషయంలో టాటా మోటార్స్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది.

తాజాగా (జనవరి 13న) జరిగిన కొత్త టాటా పంచ్ లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ ఒక షాకింగ్ వీడియోను ప్రదర్శించింది. పుణెలోని తమ అత్యాధునిక క్రాష్ టెస్ట్ సెంటర్‌లో, కొత్త పంచ్ కారును ఒక భారీ లారీతో ఢీకొట్టించారు. కారు భద్రతను నిరూపించడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం మరొకటి ఉండదని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ టెస్టులో భాగంగా కొత్త టాటా పంచ్ కారును గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణింపజేసి, నిలబడి ఉన్న ఒక లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టించారు. సాధారణంగా ఇలాంటి ప్రమాదాల్లో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయి, ఇంజిన్ పార్టులు లోపల ఉన్న ప్రయాణికులపైకి దూసుకొస్తాయి. కానీ పంచ్ విషయంలో సీన్ వేరేలా ఉంది.

కారు లారీని ఢీకొన్న వెంటనే ఎయిర్ బ్యాగులు రెప్పపాటు కాలంలో తెరుచుకున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా, కారు ఏ-పిల్లర్(ముందు అద్దం పక్కన ఉండే ఇనుప స్తంభం) ఏమాత్రం వంగలేదు. ప్రయాణికులు కూర్చునే క్యాబిన్ చెక్కుచెదరకుండా ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత కూడా కారు డోర్లు చాలా సులభంగా తెరుచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
భారతదేశంలో జరిగే కారు-లారీ ప్రమాదాల్లో మరణాలు ఎక్కువగా ఉండటానికి కారణం లారీలకు అండర్ రన్ ప్రొటెక్షన్ బార్ లేకపోవడం. దీనివల్ల కారు నేరుగా లారీ కిందకు దూసుకుపోతుంది. అయితే టాటా చేసిన ఈ టెస్టులో లారీకి ప్రాపర్ ప్రొటెక్షన్ బార్ ఉంది. అయినప్పటికీ, కారు బాడీ ఎంత ఒత్తిడిని తట్టుకోగలదో నిరూపించడానికి ఈ ప్రయోగం దోహదపడింది.

కొత్త పంచ్ తయారీలో హై-స్ట్రెంత్ స్టీల్, అల్ట్రా హై-స్ట్రెంత్ స్టీల్‌ను వాడటం వల్ల ఇది ఇంతటి దృఢత్వాన్ని ప్రదర్శించగలిగింది. ఇప్పటికే భారత్ NCAP, గ్లోబల్ NCAP క్రాష్ టెస్టుల్లో పంచ్ 5-స్టార్ రేటింగ్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఫీచర్ల విషయానికొస్తే.. కొత్త టాటా పంచ్ కేవలం భద్రతలోనే కాదు, ఫీచర్లలో కూడా అదరగొడుతోంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగులు స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తున్నాయి. వీటితో పాటు ఏబీఎస్ (ABS), ఈబీడీ (EBD), ఐసోఫిక్స్ (ISOFIX) చైల్డ్ సీట్ మౌంట్లు, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

దీని ప్రారంభ ధర కేవలం రూ.5.59 లక్షలుగా నిర్ణయించడం విశేషం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తక్కువ ధరలో అత్యంత సురక్షితమైన కారు కావాలనుకుంటే పంచ్ మించిన ఆప్షన్ లేదని టాటా నిరూపించింది. మారుతి సుజుకి వంటి కంపెనీలకు ఇది గట్టి పోటీనివ్వబోతోంది.


Click it and Unblock the Notifications








