ఈ కారు కోసం 7 లక్షల మంది.. నెక్సాన్ తర్వాత టాటా హిట్ ఇదే, ఇండియాలో అత్యంత సేఫ్టీ కారు
టాటా మోటార్స్ (Tata Motors) ప్రయాణంలో నెక్సాన్ తర్వాత అంతటి స్థాయిలో ప్రజాదరణ పొందిన కారు ఏదైనా ఉందంటే అది పంచ్ (punch) అనే చెప్పాలి. ఈ మాటలకు బలమైన ఆధారం దీని అమ్మకాల గణాంకాలే. మార్కెట్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే, టాటా పంచ్ భారత వినియోగదారుల మనసు గెలుచుకుని కంపెనీకి మరో బ్లాక్‌బస్టర్ మోడల్‌గా మారింది. ఆవిష్కరణ జరిగిన నాలుగు సంవత్సరాలు పూర్తికాకముందే టాటా పంచ్ 7 లక్షలకు పైగా యూనిట్ల విక్రయాలు నమోదు చేయడం నిజంగా విశేషం. అంతేకాదు, భారతదేశంలో 7 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న కారుగా పంచ్ నిలిచిందని టాటా మోటార్స్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఈ కారు మీద ప్రజలకు ఉన్న నమ్మకం, డిమాండ్ ఎంత బలంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది.
ఇందులో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, జనవరి 2025లోనే పంచ్ 5 లక్షల యూనిట్ల అమ్మకాల మార్క్‌ను దాటింది. అక్కడితో ఆగకుండా, కేవలం గత 12 నెలల వ్యవధిలోనే మరో 2 లక్షల యూనిట్లను విక్రయించి కొత్త రికార్డును సృష్టించింది. అంటే రోజురోజుకు పంచ్ డిమాండ్ మరింత పెరుగుతూనే ఉందన్న మాట. ఇటీవలి నివేదికల ప్రకారం, 2026 జనవరిలో ఒక్క నెలలోనే సుమారు 19,000 టాటా పంచ్ కార్లు అమ్ముడయ్యాయి.

ఈ సంఖ్య చూస్తే, ఎంట్రీ లెవల్ SUV సెగ్మెంట్‌లో పంచ్ ఎంత బలమైన స్థానాన్ని సంపాదించుకుందో అర్థమవుతుంది. ఈ ఏడాది జనవరిలో టాటా మోటార్స్ పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను అధికారికంగా ప్రారంభించింది, దీంతో ఇప్పటికే బలమైన పంచ్ బ్రాండ్‌కు మరింత ఊపు వచ్చింది. తాజా అప్‌డేట్‌తో వచ్చిన కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండటం, బడ్జెట్ సెగ్మెంట్‌లో దీనిని మరింత ఆకర్షణీయంగా మార్చింది.
ఇప్పటివరకు పంచ్‌ను కేవలం 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందించిన టాటా, ఫేస్‌లిఫ్ట్ అప్‌గ్రేడ్ తర్వాత కస్టమర్లకు ఇంకొక కీలక ఆప్షన్ 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది పనితీరు కోరుకునే వినియోగదారులకు పెద్ద ప్లస్‌గా మారింది. నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 87 bhp గరిష్ట శక్తి, 115 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజిన్‌తో పంచ్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్ ఎంపికలలో లభించడం వల్ల, సిటీ డ్రైవింగ్‌కు అనువుగా ఉంటుంది. స్మూత్ డ్రైవ్, మంచి మైలేజ్ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. అదే సమయంలో, కొత్తగా వచ్చిన 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ పంచ్‌కు పూర్తి కొత్త క్యారెక్టర్‌ను ఇచ్చింది. ఈ పవర్‌ట్రెయిన్ 118 bhp శక్తి, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో ఉండటంతో ఆకట్టుకుంటుంది.
టాటా పంచ్ కేవలం పెట్రోల్ వేరియంట్లతోనే పరిమితం కాకుండా, ఇంధన ఆదా కోరుకునే వినియోగదారుల కోసం CNG ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉండటం దీని బలమైన ప్లస్ పాయింట్. పంచ్ CNG వేరియంట్ గరిష్టంగా 72 bhp పవర్, 103 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో రూపొందించబడింది. ఇది రోజువారీ సిటీ వినియోగానికి సరిపడా పనితీరును అందిస్తూనే, రన్నింగ్ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది.

ఇంతకే పరిమితం కాకుండా, టాటా మోటార్స్ పంచ్‌ను ఎలక్ట్రిక్ రూపంలో కూడా మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే టాటా పంచ్ EV పూర్తిగా ఎమిషన్-ఫ్రీ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. పెట్రోల్, CNG తర్వాత ఎలక్ట్రిక్ ఎంపికను కూడా అందించడం ద్వారా, పంచ్ ప్రతి వినియోగదారుడి అవసరాన్ని తీర్చే ఆల్‌రౌండర్ మోడల్‌గా మారింది.


Click it and Unblock the Notifications








