రూ.5.65 లక్షలకే కారు.. పెట్రోల్, CNG, EV మూడు ఆప్షన్‌లు.. చిన్న కుటుంబాలకు చింతలేని కార్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో గత కొన్ని సంవత్సరాలుగా SUV సెగ్మెంట్‌కు భారీ స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న సైజులో SUV లుక్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, మంచి ఫీచర్లు, భద్రత కలిగిన కార్లను వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి సమయంలో టాటా మోటార్స్ తీసుకొచ్చిన టాటా పంచ్ భారతీయ మార్కెట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. చిన్న మైక్రో-ఎస్‌యూవీ అయినప్పటికీ, భారీ SUV ఫీలింగ్ ఇవ్వడం వల్ల ఈ కారు యువత నుంచి కుటుంబాల వరకు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు తాజాగా విడుదలైన ఏప్రిల్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా టాటా పంచ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ను మరోసారి నిరూపించాయి.

ఏప్రిల్ 2026లో టాటా పంచ్ అమ్మకాలు కొత్త గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ నెలలో దేశవ్యాప్తంగా మొత్తం 19,107 యూనిట్లు అమ్ముడవడంతో, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో టాటా పంచ్ 2వ స్థానాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా ఈ సంఖ్యలో పంచ్ EV ఎలక్ట్రిక్ వేరియంట్ అమ్మకాలు కూడా ఉండటం గమనార్హం. అంటే పెట్రోల్ మోడల్ మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన పొందుతోంది.

Tata Punch Suv Sales Boom With 19107 Units In April 2026 Details

ప్రస్తుతం పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ నేపథ్యంలో పంచ్ EV కూడా టాటా మోటార్స్‌కు పెద్ద బలంగా మారింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈసారి అమ్మకాలు భారీగా పెరగడం మరింత విశేషం. ఏప్రిల్ 2025లో టాటా మోటార్స్ కేవలం 12,496 పంచ్ కార్లను మాత్రమే విక్రయించగా, ఈసారి అమ్మకాలు భారీగా పెరిగి 19,107 యూనిట్లకు చేరుకున్నాయి. అంటే ఒక్క సంవత్సరంలోనే 52.90 శాతం వృద్ధిని నమోదు చేసింది.

టాటా పంచ్ అమ్మకాలను లోతుగా పరిశీలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్ 2026లో సుమారు 6,611 పంచ్ కార్లు అదనంగా అమ్ముడయ్యాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో SUVలకు పెరుగుతున్న డిమాండ్ కలిసి వచ్చింది. అయితే, గత నెల అయిన మార్చి 2026తో పోలిస్తే ఏప్రిల్‌లో అమ్మకాలు కొద్దిగా తగ్గాయి. మార్చిలో పంచ్ అమ్మకాలు 20 వేల మార్క్‌ను దాటి 20,977 యూనిట్లుగా నమోదవగా, ఏప్రిల్‌లో ఆ సంఖ్య 19,107 యూనిట్లకు పరిమితమైంది.

Tata Punch Suv Sales Boom With 19107 Units In April 2026 Details

అంటే నెలవారీగా చూస్తే 1,870 యూనిట్లు తక్కువగా అమ్ముడయ్యాయి. అయినప్పటికీ, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో టాప్ స్థానాల్లో కొనసాగడం పంచ్‌కు ఉన్న బలమైన డిమాండ్‌ను తెలియజేస్తోంది. ధరల పరంగా చూస్తే, టాటా పంచ్ భారతీయ మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న ధరలతో మార్కెట్లో లభిస్తోంది. ప్రస్తుతం ఈ మైక్రో SUV ధర రూ. 5.65 లక్షల నుంచి రూ. 10.60 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది.

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా టాటా మోటార్స్ పంచ్‌ను మొత్తం 6 వేరియంట్లలో విక్రయిస్తోంది. ఇది స్మార్ట్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్ వంటి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్‌కు అనుగుణంగా వినియోగదారులు నచ్చిన వేరియంట్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉండటం కూడా పంచ్‌కు భారీ డిమాండ్ రావడానికి ఒక ముఖ్య కారణం. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో కూడా పంచ్ EV మంచి ఆదరణ పొందుతోంది.

Tata Punch Suv Sales Boom With 19107 Units In April 2026 Details

ప్రస్తుతం పంచ్ EV స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్‌డ్, ఎంపవర్‌డ్ ప్లస్ ఎస్ అనే ఐదు వేరియంట్లలో లభిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ SUV ధరలు రూ. 9.70 లక్షల నుంచి రూ. 12.60 లక్షల వరకు ఉన్నాయి. పెట్రోల్, CNG, EV వంటి విభిన్న ఆప్షన్లలో లభిస్తూ టాటా పంచ్ ప్రస్తుతం అత్యంత విజయవంతమైన మైక్రో SUVలలో ఒకటిగా కొనసాగుతోంది.

Article Published On: Friday, May 8, 2026, 15:13 [IST]
English summary
Tata punch suv sales boom with 19107 units in april 2026 details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+