బంగారం లాంటి కారు..రోజుకు 1500 బుక్ చేసుకుంటున్నారు..ఇది కావాలంటే 65 రోజులు ఆగాల్సిందే
భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు మారుమోగుతోంది.. అదే టాటా పంచ్ (Tata Punch). మధ్యతరగతి ప్రజల కలల కారుగా మారిన ఈ మైక్రో ఎస్‌యూవీ, అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కేవలం రూ.5.59 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుండటం, దానికి తోడు అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లు ఉండటంతో కస్టమర్లు ఈ కారు కోసం క్యూ కడుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ కారు క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే.. రోజుకు ఏకంగా 1500 మంది దీనిని బుక్ చేసుకుంటున్నారు!
మీరు ఈ రోజే షోరూమ్‌కు వెళ్లి టాటా పంచ్ బుక్ చేసినా, అది మీ చేతికి రావడానికి కనీసం రెండు నెలల సమయం పడుతోంది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగింది. వేరియంట్‌ను బట్టి ఈ నిరీక్షణ మారుతూ ఉంటుంది:
* అక్కంప్లిష్డ్ (Accomplished) వేరియంట్: 30 రోజులు
* అడ్వెంచర్ (Adventure) వేరియంట్: 50 రోజులు
* ప్యూర్+, ప్యూర్ (Pure+, Pure): 60 రోజులు

స్మార్ట్ (Smart) వేరియంట్: అత్యధికంగా 65 రోజులు అంటే మీరు తక్కువ బడ్జెట్ వేరియంట్ కోరుకుంటే దాదాపు 65 రోజులు ఆగాల్సిందే. కోటీశ్వరులైనా సరే, ఈ కారు డెలివరీ కోసం తపస్సు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.
టాటా పంచ్ మార్కెట్లోకి వచ్చి కేవలం 4 ఏళ్ల 3 నెలలు మాత్రమే అవుతోంది. ఇంత స్వల్ప కాలంలోనే 7 లక్షల మంది ఈ కారును కొనుగోలు చేయడం ఒక సంచలనం. కేవలం 2025 సంవత్సరంలోనే 1.73 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయంటే, ఇది మారుతి వంటి దిగ్గజాలకు ఎంతటి గట్టి పోటీని ఇస్తోందో ఊహించవచ్చు. ప్రస్తుతం దీని ప్రారంభ ధర కేవలం రూ.5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) మాత్రమే కావడం మధ్యతరగతి ప్రజలకు పెద్ద వరంలా మారింది.
2026 టాటా పంచ్ మోడల్ మరింత స్టైలిష్‌గా రూపుదిద్దుకుంది. దీని బాక్సీ డిజైన్ చిన్న కారులా కాకుండా ఒక పక్కా ఎస్‌యూవీలా కనిపిస్తుంది. షార్ప్ లుక్ ఇచ్చే ఎల్ఈడీ డిఆర్ఎల్స్, స్లిమ్ గ్రిల్, కొత్త డిజైన్ హేడ్ లైట్లు, బంపర్లు కారుకు ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. దీనికి తోడు 16-ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కారును రోడ్డుపై గంభీరంగా ఉంచుతాయి. ఇది మొత్తం 6 వేరియంట్లలో, బెంగాల్ టైగర్ థీమ్ వంటి 6 ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది.

ఫీచర్ల విషయంలో టాటా ఎక్కడా తగ్గలేదు. ఇందులో 360-డిగ్రీ కెమెరా, ఫ్లైట్ వ్యూ మానిటర్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎమ్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. వినోదం కోసం 10.24-ఇంచ్ హెచ్‌డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హర్మాన్ ఆడియో సిస్టమ్ అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. లగేజీ కోసం పెట్రోల్ వేరియంట్లో 366 లీటర్ల బూట్ స్పేస్ ఉండగా, సిఎన్‌జి వెర్షన్లో 210 లీటర్ల స్థలం కేటాయించారు.
టాటా పంచ్‌కు ఇంతటి ఆదరణ రావడానికి ప్రధాన కారణం దాని సేఫ్టీ. గ్లోబల్ NCAP టెస్టుల్లో ఈ కారుకు 5-స్టార్ రేటింగ్ లభించింది. ఇటీవల జరిగిన ఒక క్రాష్ టెస్టులో, 50 కి.మీ వేగంతో నేరుగా మోదినా సరే, కారులోని డమ్మీలకు ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదం తర్వాత కూడా కారు డోర్లు సులభంగా తెరుచుకునే స్థితిలోనే ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, ABS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ప్రయాణికులకు కొండంత అండగా నిలుస్తాయి.

మధ్యతరగతి ఫ్యామిలీకి తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీ, మంచి మైలేజీ,ఎస్‌యూవీ లుక్ కావాలంటే పంచ్ కంటే మెరుగైన ఆప్షన్ ప్రస్తుతానికి మార్కెట్లో లేదు. డ్రాఫిక్‌లో సులభంగా నడపడానికి, లాంగ్ డ్రైవ్స్‌లో కంఫర్ట్‌గా ఉండటానికి పంచ్ అద్భుతంగా పనిచేస్తోంది. అందుకే బుకింగ్ చేసినా 65 రోజులు వేచి ఉండటానికి కూడా జనం వెనుకాడటం లేదు.


Click it and Unblock the Notifications








