బాహుబలి కారు.. చావు భయం లేకుండా రెండు కుటుంబాలు హాయిగా వెళ్లొచ్చు! లెజెండ్ కమ్‌బ్యాక్ ఇదేనా?
టాటా మోటార్స్ (Tata Motors) కు భారతీయులతో ఉన్న అనుబంధం కేవలం ఒక ఆటోమొబైల్ బ్రాండ్‌కు పరిమితం కాదు... అది ఒక భావోద్వేగం. ఇండికా, సఫారీ, సియెర్రా వంటి కార్లు భారతీయ కుటుంబాల జీవితాల్లో ఒక భాగంగా మారిపోయాయి. ముఖ్యంగా ఇండికా అయితేమొదటి ఫ్యామిలీ కార్గా ఎంతోమందికి గుర్తుండిపోయింది. అలాంటి బలమైన వారసత్వం ఉన్న కంపెనీగా టాటా మోటార్స్, కాలానుగుణంగా తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగింది. ఒక దశలో భారతదేశంలో సేఫ్టీకి పర్యాయపదంగా టాటా పేరు నిలిచింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లలో 4, 5 స్టార్ రేటింగ్‌లు సాధించిన నెక్సాన్, పంచ్, టియాగో వంటి కార్లు.. భద్రత ముఖ్యమైతే టాటానే అనే నమ్మకాన్ని వినియోగదారుల్లో బలంగా నాటాయి. ఇదే టాటా బ్రాండ్‌ను మళ్లీ టాప్‌లో నిలబెట్టిన ప్రధాన కారణం కూడా.
ఇప్పుడు టాటా మోటార్స్ మరో ఆసక్తికర దశలో ఉంది. గతంలో ప్రజాదరణ పొందిన పాత దిగ్గజ నేమ్‌ప్లేట్‌లను తిరిగి పునరుద్ధరించడం మీద కంపెనీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే సఫారీ, సియెర్రా వంటి పేర్లు మళ్లీ మార్కెట్‌లోకి వచ్చాయి. కొత్త తరం డిజైన్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన సేఫ్టీతో ఈ కార్లను టాటా తిరిగి పరిచయం చేసింది. ఈ జాబితాలో టాటా సఫారీకి ప్రత్యేక స్థానం ఉంది.

ప్రారంభంలో కొత్త సఫారీ ఆశించిన స్థాయిలో అమ్మకాలు సాధించలేకపోయినప్పటికీ, 7-సీటర్ SUV కోసం చూస్తున్న కుటుంబాలకు ఇది ఒక నమ్మకమైన ఎంపికగా నిలిచింది. ఇటీవల టాటా తీసుకున్న కీలక నిర్ణయం సఫారీకి గేమ్‌చేంజర్ అయింది. అదే పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ ప్రవేశం. డీజిల్‌తో మాత్రమే పరిమితమైన సఫారీ ఇప్పుడు పెట్రోల్ ఆప్షన్‌తో మరింత విస్తృత కస్టమర్ బేస్‌ను ఆకర్షిస్తోంది. దీని ప్రభావం అమ్మకాలపై స్పష్టంగా కనిపిస్తోంది.
జనవరి 2026లో టాటా సఫారీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఆ నెలలో మొత్తం 2,375 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే ఏడాది క్రితం, జనవరి 2025లో సఫారీ అమ్మకాలు 1,548 యూనిట్లకే పరిమితమయ్యాయి. అంటే ఏడాదిలోనే సఫారీ అమ్మకాలు 53.42 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. 7-సీటర్ SUV సెగ్మెంట్‌లో ఇది టాటా మోటార్స్‌కు పెద్ద ఊపునిచ్చే అంశంగా మారింది. గత ఏడాది కంటే 827 యూనిట్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి.

టాటా సఫారీ స్మార్ట్, ప్యూర్ ఎక్స్, అడ్వెంచర్ ఎక్స్ ప్లస్, అకంప్లిష్డ్ ఎక్స్, అకంప్లిష్డ్ ఎక్స్ ప్లస్ 7-సీటర్, అకంప్లిష్డ్ ఎక్స్ ప్లస్ 6-సీటర్ అంటూ మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ధరల విషయానికి వస్తే, సఫారీ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.13.29 లక్షల నుంచి రూ.25.96 లక్షల వరకు ఉన్నాయి, అంటే ఫ్యామిలీ బడ్జెట్ నుంచి ప్రీమియమ్ SUV కొనాలనుకునే వారికి సరిపోయే రేంజ్‌లో ఇది లభిస్తోంది.
ఇంజిన్ ఎంపికల్లో 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పాటు తాజాగా 1.5-లీటర్ TGDi పెట్రోల్ ఇంజిన్‌ను పరిచయం చేసింది. డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తూ 168 bhp పవర్, 350 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త పెట్రోల్ ఇంజిన్ 168 bhp పవర్, 280 Nm టార్క్‌ను అందిస్తూ స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది.

ఫీచర్ల పరంగా చూస్తే, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, పెద్ద 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆకర్షణీయమైన పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, మెమరీ ఫంక్షన్‌తో 6-వే పవర్డ్ డ్రైవర్ సీటు, ఆటో హెడ్‌లైట్లు, ఆటో వైపర్లు, లెవల్-2 ADAS ఉన్నాయి. ఇది భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించడం గమనార్హం.


Click it and Unblock the Notifications








