ఇది కారు కాదు, ఒక మినీ బస్సు..ఫ్యామిలీతో కలిసి ఊరు వెళ్లాలంటే పర్ఫెక్ట్ ఛాయిస్

టాటా మోటార్స్ తన గూటిలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ టాటా సియెర్రా(Tata Sierra)ను సరికొత్త హంగులతో భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి తిరిగి ప్రవేశపెట్టి పెను సంచలనం సృష్టిస్తోంది. 90వ దశకంలో అడ్వెంచర్ ప్రియుల కలల వాహనంగా నిలిచిన ఈ ఐకానిక్ ఎస్‌యూవీకి నేటికీ ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని బుకింగ్స్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 70,000 కు పైగా కన్ఫర్మ్డ్ బుకింగ్స్ నమోదు చేసి ఈ కారు సరికొత్త రికార్డును లిఖించింది. దీని కోసం గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లో ఉత్పత్తి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే జనవరి 15, 2026 నుంచి దేశవ్యాప్తంగా డెలివరీలు ప్రారంభించడానికి కంపెనీ సిద్ధమైంది.

Tata Sierra 2026 Hits 70000 Bookings in 24 Hours Deliveries Start Jan 15

టాటా సియెర్రా అంటే ఒక వాహనం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్ అని ఈ రికార్డ్ బుకింగ్స్ నిరూపిస్తున్నాయి. సుమారు 1.35 లక్షల మంది కస్టమర్లు తమకు నచ్చిన ఫీచర్లు, కలర్ కాంబినేషన్లతో కాన్ఫిగరేషన్లను సిద్ధం చేసుకున్నారంటే.. ఈ ఏడాదికి ఇదే అతిపెద్ద లాంచ్ అని ఆటోమొబైల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ కారు స్మార్ట్+, ప్యూర్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్ అనే నాలుగు ప్రధాన వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో ముఖ్యంగా మధ్యతరగతి మరియు బడ్జెట్ ప్రియుల దృష్టిని 'ప్యూర్' (Pure) వేరియంట్ అమితంగా ఆకర్షిస్తోంది. అత్యంత పోటీతత్వ ధరతో పాటు ప్రీమియం ఫీచర్లను అందించడమే దీనికి ప్రధాన కారణం.

Tata Sierra 2026 Hits 70000 Bookings in 24 Hours Deliveries Start Jan 15

డిజైన్ పరంగా చూస్తే, టాటా సియెర్రా ప్యూర్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 12.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. ఇది బేస్ మోడల్‌కు పై వేరియంట్ అయినప్పటికీ, బాహ్య రూపంలో ఎక్కడా రాజీ పడలేదు. ముందు భాగంలో పొడవైన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ (LED DRL) లైట్ బార్, బై-ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ కారుకు గంభీరమైన రాజసాన్ని ఇస్తాయి.

ఇందులో నేరుగా అల్లాయ్ వీల్స్ ఉండవు కానీ, 17-ఇంచుల స్టీల్ వీల్స్‌పై అమర్చిన డ్యూయల్-టోన్ వీల్ కవర్లు అచ్చం అల్లాయ్ వీల్స్‌లాగే కనిపిస్తూ కారుకు స్పోర్టీ లుక్ ఇస్తాయి. అలాగే ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ను అందించడం వల్ల కారు బాడీ చాలా షార్ప్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తుంది.

Tata Sierra 2026 Hits 70000 Bookings in 24 Hours Deliveries Start Jan 15

ప్యూర్ వేరియంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ లేకపోయినా, రూఫ్ పై ఉన్న గ్లోసీ బ్లాక్ పెయింట్ ఫినిషింగ్ వల్ల అది బయట నుంచి చూస్తే పెద్ద సన్‌రూఫ్ ఉందన్న భ్రమ కలిగిస్తుంది. కారు ఇంటీరియర్ ప్రయాణికులకు ఒక విలాసవంతమైన లాంజ్‌లో కూర్చున్న అనుభూతిని కలిగిస్తుంది. ప్యూర్ వేరియంట్‌లో బ్లాక్, గ్రే కలర్ థీమ్ వాడటం వల్ల క్యాబిన్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది.

టెక్నాలజీ పరంగా 10.25-ఇంచుల భారీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లేను సపోర్ట్ చేస్తుంది. మ్యూజిక్ లవర్స్ కోసం 8-స్పీకర్ల సౌండ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, సిటీ, స్పోర్ట్ అనే డ్రైవ్ మోడ్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి అన్నీ అవసరమైన ఫీచర్లు ఈ వేరియంట్లోనే లభిస్తాయి.

Tata Sierra 2026 Hits 70000 Bookings in 24 Hours Deliveries Start Jan 15

లోపల ఉన్న సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, విశాలమైన లెగ్‌రూమ్ ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తాయి.సేఫ్టీ విషయంలో టాటా మోటార్స్ తన 5-స్టార్ రేటింగ్ సంప్రదాయాన్ని ఇక్కడా కొనసాగించింది. సియెర్రా ప్యూర్ వేరియంట్‌లో కూడా సేఫ్టీ ఫీచర్లను అత్యున్నత ప్రమాణాలతో అందించారు. ఇందులో స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగులు ఉండటం ప్రయాణికులకు కొండంత అండగా నిలుస్తుంది.

బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ పెంచడానికి నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు (All-wheel disc brakes) ఇవ్వడం విశేషం. వీటితో పాటు ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని అత్యంత సురక్షితం చేస్తాయి. టాటా సియెర్రా తన పటిష్టమైన బాడీ నిర్మాణంతో మళ్ళీ సేఫ్టీ కింగ్‌గా అవతరించబోతోంది.

ఇక పవర్, ఇంజిన్ విషయానికి వస్తే, సియెర్రా ఇప్పుడు పెట్రోల్, డీజిల్.. రెండు ఆప్షన్లలోనూ శక్తివంతంగా ఉంది. పెట్రోల్ విభాగంలో 1.5L రెవోట్రాన్ ఇంజిన్ 105 HP పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది, ఇది మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్సులతో అందుబాటులో ఉంది.

ఇక మైలేజీ, టార్క్ కోరుకునే వారి కోసం 1.5L క్రయోజెట్ డీజిల్ ఇంజిన్ ఉంది, ఇది 116 HP పవర్, 260 Nm టార్క్ అందిస్తూ లాంగ్ డ్రైవ్స్‌కు సరైన ఎంపికగా మారుతుంది. ఏ వేరియంట్ ఎంచుకున్నా, టాటా సియెర్రా తన ఐకానిక్ స్టైల్, మోడ్రన్ టెక్నాలజీతో భారతీయ రోడ్లపై మరోసారి తన ఆధిపత్యాన్ని చాటడం ఖాయంగా కనిపిస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, January 12, 2026, 19:05 [IST]
English summary
Tata sierra 2026 hits 70000 bookings in 24 hours deliveries start jan 15
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+