షోరూంల దగ్గర సామాన్యులే కాదు.. మంత్రులు కూడా ఈ కారు కోసం క్యూ కడుతున్నారు

భారతీయ రోడ్లపై ఒకప్పుడు కింగులా ఓ వెలిగిన పేరు.. టాటా సియెర్రా. ఇప్పుడు అదే పేరుతో టాటా మోటార్స్ తన అమ్ములపొదిలోని సరికొత్త అస్త్రాన్ని మార్కెట్లోకి వదిలింది. విడుదలైన నెల రోజుల్లోనే ఈ ఎస్‌యూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సియెర్రా మాయలో పడిపోతున్నారు. దీనికి నిదర్శనమే కేరళ రవాణా శాఖ మంత్రి కె.బి. గణేష్ కుమార్ గారు స్వయంగా ఈ కారును బుక్ చేసుకోవడం. ఒక మంత్రి స్థాయి వ్యక్తి, అదీ వాహనాలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి ఈ కారును ఎంచుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి సియెర్రా పైనే పడింది.

Tata Sierra 2026 Minister Booked the First One Why Everyone is Choosing Diesel Variant

కేరళ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ గణేష్ కుమార్ ఒక వీరాభిమానిలా ఈ కారును టెస్ట్ డ్రైవ్ చేశారు. ఆయన కేవలం టెస్ట్ డ్రైవ్ చేయడమే కాదు, కారులోని ఫీచర్లు, టెక్నాలజీ చూసి ఫిదా అయిపోయి అక్కడికక్కడే బుకింగ్ కూడా చేసేశారు. ఆయన తనకు ఇష్టమైన అండమాన్ అడ్వెంచర్(ఎల్లో) రంగులో ఈ కారును ఆర్డర్ చేయడం విశేషం. టాటా తీసుకొచ్చిన కొత్త పెట్రోల్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తున్నప్పటికీ, సియెర్రా విషయంలో మాత్రం జనం మళ్లీ డీజిల్ వైపు మొగ్గు చూపుతున్నారు. మొత్తం బుకింగ్స్‌లో సుమారు 55 శాతం మంది డీజిల్ వేరియంట్‌లనే ఎంచుకుంటున్నారని సమాచారం. దీనికి ప్రధాన కారణం డీజిల్ ఇంజిన్లు ఇచ్చే మైలేజ్, ఆ పవర్ ఫుల్ టార్క్.

Tata Sierra 2026 Minister Booked the First One Why Everyone is Choosing Diesel Variant

లాంగ్ జర్నీలు చేసే వారికి, ఎస్‌యూవీ అసలు సిసలు మజా అనుభవించాలనుకునే వారికి డీజిల్ మోడల్స్ మొదటి ఎంపికగా మారుతున్నాయి. ఇక కొత్తగా వచ్చిన టర్బో పెట్రోల్ వేరియంట్లకు 20 శాతం, నార్మల్ పెట్రోల్ వేరియంట్లకు 25 శాతం బుకింగ్స్ వస్తున్నాయి.

టాటా మోటార్స్ ఈ కారు ధరను ఎంతో వ్యూహాత్మకంగా నిర్ణయించింది. కేవలం రూ.11.49 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.21.29 లక్షల వరకు ఉంటుంది. అంటే ప్రతి బడ్జెట్‌కు తగ్గట్టుగా ఒక వేరియంట్ ఉండేలా టాటా ప్లాన్ చేసింది.

Tata Sierra 2026 Minister Booked the First One Why Everyone is Choosing Diesel Variant

ముఖ్యంగా డీజిల్ వేరియంట్లు రూ.12.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ధరల వద్ద హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లకు సియెర్రా చుక్కలు చూపించడం ఖాయం. సియెర్రా ఇంటీరియర్ చూస్తే మీరు ఏదో లగ్జరీ కార్లో కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది. డ్యాష్‌బోర్డ్‌పై మూడు స్క్రీన్‌లు (ట్రిపుల్ స్క్రీన్ సెటప్) ఉన్నాయి.

డ్రైవర్ కోసం, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, పక్కన కూర్చునే ప్యాసింజర్ కోసం ప్రత్యేక స్క్రీన్‌లు కేటాయించారు. డాల్బీ అట్మాస్‌తో కూడిన జేబీఎల్ (JBL) సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్ 2 ADAS సేఫ్టీ ఫీచర్లు, 360-డిగ్రీ కెమెరా.. ఇలా ఒకటేమిటి అత్యాధునిక ఫీచర్లన్నీ ఇందులో ఉన్నాయి.

Tata Sierra 2026 Minister Booked the First One Why Everyone is Choosing Diesel Variant

1991లో వచ్చిన సియెర్రాలోని ఐకానిక్ డిజైన్‌ను టాటా మళ్లీ గుర్తు చేసింది. ఆ నాటి బాక్సీ లుక్, ఆల్పైన్ విండో డిజైన్‌ను మరింత స్టైలిష్‌గా మార్చి కొత్త మోడల్‌లో తీసుకొచ్చింది. 19 ఇంచ్ అలాయ్ వీల్స్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ లైట్లు కారుకు ఒక రాయల్ లుక్‌ను ఇచ్చాయి. జనవరి 15 నుంచి ఈ కారు డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, January 10, 2026, 17:03 [IST]
English summary
Tata sierra 2026 minister booked the first one why everyone is choosing diesel variant
Read more on: #tata motors #kerala
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+