ఎలాంటి డౌట్ లేకుండా ఈ కారు కొనచ్చు! క్రాష్ టెస్ట్‌లో అదరగొట్టింది.. కుటుంబానికి సేఫ్టీ గ్యారెంటీ

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మరోసారి తన ప్రత్యేకతను చూపిస్తూ టాటా సియోర్రా (Tata Sierra) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2025 నవంబర్ 25న విడుదలైన ఈ ఎస్‌యూవీ, కేవలం ఒక కొత్త కారు మాత్రమే కాకుండా, టాటా బ్రాండ్‌కు చెందిన ఒక ఐకానిక్ మోడల్‌కు తిరిగి వచ్చిన జీవం లాంటిది. ఒకప్పుడు రోడ్లపై ప్రత్యేక గుర్తింపును పొందిన సియెర్రా పేరు ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్‌తో కొత్త తరానికి చేరువైంది. ఈ కొత్త సియెర్రా చూసే వారికి మొదటి చూపులోనే ఆకట్టుకునేలా ఉంటుంది. బోల్డ్ ఫ్రంట్ గ్రిల్, స్లీక్ LED హెడ్‌లైట్స్, మస్కులర్ బాడీ లైన్స్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

నగర రోడ్లపై నడిపినా, హైవేపై డ్రైవ్ చేసినా ఈ కారు అందరి దృష్టిని ఆకర్షించేలా డిజైన్ చేయబడింది. అంతేకాదు, ఇంటీరియర్‌లో కూడా టాటా ఎక్కడా రాజీ పడలేదు. ఆధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కంఫర్టబుల్ సీటింగ్, ప్రీమియం మెటీరియల్స్ కలిపి ఈ కారును ఒక లగ్జరీ అనుభవంగా మారుస్తాయి. అయితే ఈ కారు ప్రత్యేకత కేవలం డిజైన్ లేదా ఫీచర్లలోనే కాదు, భద్రత విషయంలో కూడా ఇది అగ్రస్థానంలో నిలిచింది.

Tata Sierra Achieves 5 Star Safety Rating In India Bharat Ncap Test Details Inside

దేశంలో వాహన భద్రతను పరీక్షించే ప్రముఖ సంస్థ అయిన Bharat NCAP ఈ సియెర్రాను అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా గుర్తించింది. క్రాష్ టెస్టుల్లో ఈ ఎస్‌యూవీ అద్భుతమైన 5 స్టార్ పొందింది. వయోజన ప్రయాణీకుల రక్షణ విభాగంలో 32 మార్కులకు 31.14 స్కోర్ సాధించడం ఈ కారు బలమైన నిర్మాణాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రమాద పరిస్థితుల్లో డ్రైవర్ మరియు ప్రయాణీకులకు గరిష్ట రక్షణ కల్పించేలా బాడీ స్ట్రక్చర్ రూపొందించబడింది.

ఇదే విధంగా, పిల్లల భద్రత విషయంలో కూడా ఇది అత్యుత్తమ ప్రమాణాలను అందుకుంది. చైల్డ్ ఆక్వుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 49లో 44.73 స్కోర్ సాధించడం ద్వారా, కుటుంబంతో ప్రయాణించే వారికి ఇది మరింత నమ్మకాన్ని ఇస్తుంది. ఈ అద్భుతమైన ప్రదర్శన ఫలితంగా, కొత్త టాటా సియెర్రా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సంపాదించింది. అంటే, భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా, టాటా ఈ కారును రూపొందించిందని చెప్పవచ్చు.

Tata Sierra Achieves 5 Star Safety Rating In India Bharat Ncap Test Details Inside

అందుకే ఈ కారు విడుదలైన కొద్ది కాలంలోనే భారీ డిమాండ్‌ను సాధించింది. వినియోగదారులు కూడా ఈ కారును ఆసక్తిగా కొనుగోలు చేస్తూ, మార్కెట్లో దీని అమ్మకాలను పెంచుతున్నారు. కేవలం స్టైలిష్ డిజైన్‌తోనే కాకుండా, ప్రయాణికుల భద్రత విషయంలో కూడా అత్యున్నత ప్రమాణాలను అందించేలా రూపొందించబడింది. ఈ ఎస్‌యూవీ లోపల కూర్చున్న ప్రతి ఒక్కరికీ గరిష్ట రక్షణ కల్పించాలనే లక్ష్యంతో టాటా అనేక ఆధునిక సేఫ్టీ ఫీచర్లను ఇందులో అందించింది.

భద్రత పరంగా చూస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండటం వల్ల ప్రమాదం జరిగిన సందర్భాల్లో డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు కూడా మెరుగైన రక్షణ లభిస్తుంది. అలాగే ఏబీఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) మరియు ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) కలిసి బ్రేకింగ్ సమయంలో వాహనం నియంత్రణ కోల్పోకుండా చూసుకుంటాయి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాహనం స్థిరంగా ఉండేందుకు ఈఎస్‌సీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్) కీలక పాత్ర పోషిస్తుంది.

Tata Sierra Achieves 5 Star Safety Rating In India Bharat Ncap Test Details Inside

ఇంకా ఆధునిక టెక్నాలజీ విషయానికి వస్తే, లెవెల్ 2 ఏడీఏఎస్ వంటివి ఈ కారును మరింత స్మార్ట్‌గా మార్చింది. ఇది డ్రైవర్‌కు ముందస్తు హెచ్చరికలు ఇస్తూ, ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది. టీపీఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) ద్వారా టైర్లలో గాలి ఒత్తిడి గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది. అదేవిధంగా, 360 డిగ్రీల కెమెరా సిస్టమ్ వాహనాన్ని పార్క్ చేయడాన్ని చాలా సులభంగా మార్చి, చుట్టుపక్కల పరిస్థితులను స్పష్టంగా చూపిస్తుంది.

భారత మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.49 లక్షల నుండి రూ. 21.29 లక్షల వరకు ఉండటం వల్ల, విభిన్న బడ్జెట్‌లకు సరిపోయేలా ఎంపికలు ఉన్నాయి. వేరియంట్ల విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ స్మార్ట్ ప్లస్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అడ్వెంచర్ ప్లస్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్ వంటి పలు ఆప్షన్లలో లభిస్తుంది. వినియోగదారులు తమ అవసరాలు, బడ్జెట్‌ను బట్టి సరైన వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 18, 2026, 9:18 [IST]
English summary
Tata sierra achieves 5 star safety rating in india bharat ncap test details inside
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+