ఈ కారు కావాలంటే 7 నెలలు ఆగాలి.. ఇప్పటికే 25,000 మంది కొన్నారు.. దీని లుక్ చూస్తే ఎవరైనా మైమరచిపోవాల్సిందే

టాటా మోటార్స్ తన ఐకానిక్ బ్రాండ్‎తో ఇండియా రోడ్ల మీద మళ్లీ పంజా విసిరింది. ఒకప్పుడు ఎస్‌యూవీ (SUV) ప్రియుల కలల కారుగా వెలుగొందిన టాటా సియెర్రా (Tata Sierra), ఇప్పుడు సరికొత్త హంగులతో మార్కెట్లోకి వచ్చి రికార్డులు క్రియేట్ చేస్తోంది. జనాలు దీనికి ఎంతలా ఫిదా అయిపోయారంటే, అమ్మకాల్లో ఇది టాటా సొంత కార్లు అయినటువంటి హారియర్, సఫారి, కర్వ్‌లను కూడా వెనక్కి నెట్టేసింది. కేవలం మూడు నాలుగు నెలల్లోనే 25,000 యూనిట్ల మార్కును దాటేసి, టాటా మోటార్స్ పాలిట టైటానిక్ లాంటి బలమైన నౌకగా నిలిచింది.

టాటా సియెర్రా తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఊహించని విజయాన్ని అందుకుంది. కంపెనీ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. సియెర్రా అమ్మకాలు 25,000 యూనిట్ల మైలురాయిని అధిగమించాయి. కేవలం డిసెంబర్ 2025లో కేవలం 291 యూనిట్లు అమ్ముడైన ఈ కారు, జనవరి 2026 నాటికి 7,003 యూనిట్లకు చేరుకుంది. మార్చి 2026లో ఏకంగా 9,003 యూనిట్లు అమ్ముడై, టాటా మోటార్స్ పోర్ట్‌ఫోలియోలోని టియాగో, ఆల్ట్రోజ్, టిగోర్ వంటి పాపులర్ మోడళ్లను కూడా దాటేసింది. ఈ భారీ డిమాండ్ కారణంగా ప్రస్తుతం ఈ కారు కొనాలంటే కనీసం 7 నెలల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

Tata Sierra Craze Soars 25 000 Sales Milestone 7-Month Waiting Period Stuns Buyers

సరికొత్త సియెర్రాను టాటా మోటార్స్ మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో తీర్చిదిద్దింది. పవర్ ఫుల్ రైడ్ కోరుకునే వారి కోసం 1.5-లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది 158bhp పవర్, 255Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. మైలేజీని కోరుకునే వారి కోసం 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (105bhp), డీజిల్ ప్రియుల కోసం 1.5-లీటర్ ఫోర్-పాట్ డీజిల్ ఇంజిన్ (116bhp) అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

సియెర్రా లోపలి భాగం (Interior) అత్యంత లగ్జరీగా ఉంటుంది. టాటా కర్వ్ తరహాలోనే ఇందులో ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్ ఉంది. మ్యూజిక్ లవర్స్ కోసం 12-స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్‌ను సౌండ్ బార్‎తో కలిపి ఇచ్చారు. అలాగే హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు దీని సొంతం. ఈ కారులోని ప్రధాన ఆకర్షణ అల్పైన్ రూఫ్ (Alpine Roof). పాత కాలపు సియెర్రా గుర్తుగా పైన ఫ్లాట్ గ్లాస్ రూఫ్ ఇచ్చారు, ఇది సన్‌రూఫ్‌తో కలిసి కారు లోపల విశాలమైన అనుభూతిని కలిగిస్తుంది.

Tata Sierra Craze Soars 25 000 Sales Milestone 7-Month Waiting Period Stuns Buyers

టాటా అంటేనే సేఫ్టీ.. సియెర్రా ఆ నమ్మకాన్ని నిలబెట్టింది. ఈ కారులో స్టాండర్డ్ ఫీచర్లుగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS తో కూడిన EBD, స్టెబిలిటీ ప్రోగ్రామ్, పిల్లల సేఫ్టీ కోసం ISOFIX మౌంట్‌లు ఇచ్చారు. అంతేకాకుండా, ఇందులో లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్ ఉంది, ఇది ప్రమాదాలను ముందే పసిగట్టి డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది. 360-డిగ్రీ కెమెరా ద్వారా కారు చుట్టూ ఉన్న దృశ్యాలను స్క్రీన్‌పై స్పష్టంగా చూడవచ్చు. 4.6 మీటర్ల పొడవు, 2.7 మీటర్ల వీల్‌బేస్‌తో ఈ కారు రోడ్డుపై చాలా గంభీరంగా కనిపిస్తుంది.

టాటా సియెర్రాను కంపెనీ మొత్తం 24 వేర్వేరు వేరియంట్లలో విక్రయిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభమై రూ.21.29 లక్షల వరకు ఉంటుంది. ఇది మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ వంటి గట్టి పోటీదారులను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ, దీని ఐకానిక్ డిజైన్, టాటా బ్రాండ్ వాల్యూ వల్ల జనం దీని వైపు మొగ్గు చూపుతున్నారు. టాటా మోటార్స్ కూడా ఈ కారు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని (Production Capacity) పెంచుతోంది.

More from DriveSpark

Article Published On: Sunday, April 12, 2026, 8:41 [IST]
English summary
Tata sierra craze soars 25 000 sales milestone 7 month waiting period stuns buyers
Read more on: #tata motors #suv #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+