దేశం మొత్తం ఎదురుచూస్తోన్న టాటా కారు సైలెంట్‌గా రాబోతుంది! ధర ఎంత, ఎప్పుడు లాంచ్..?
2026 టాటా మోటార్స్‌కు నిజంగానే ఒక కీలకమైన సంవత్సరంగా మారింది. ఇప్పటికే కంపెనీ వరుసగా కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చి తన ప్రొడక్ట్ లైనప్‌ను బలంగా మార్చుకుంటోంది. ఇటీవలే టాటా సఫారీ పెట్రోల్, హారియర్ పెట్రోల్ వేరియంట్లు అలాగే పంచ్ ఫేస్‌లిఫ్ట్ SUVలను విడుదల చేసి, భారత SUV మార్కెట్‌లో తన ఉనికిని మరింత పటిష్టం చేసింది. ఈ లాంచ్‌లతో టాటా అన్ని సెగ్మెంట్లలో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ మరో కొత్త కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అన్నీ ప్లాన్ చేసినట్లే జరిగితే, కొత్త టాటా సియెర్రా EV అతి త్వరలోనే మార్కెట్‌లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఒకప్పుడు ఐకానిక్ SUVగా గుర్తింపు పొందిన సియెర్రా పేరును ఎలక్ట్రిక్ అవతారంలో తిరిగి తీసుకురావడం టాటా కోసం ఒక పెద్ద స్ట్రాటజిక్ మువ్‌గా చెప్పొచ్చు. ఈ కారు గురించిన అంచనాలు ఇలా ఉన్నాయి. టాటా ఈ మోడల్‌లో ఇప్పటివరకు అందిస్తున్న EVల కంటే మరింత శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. డ్రైవింగ్ అనుభూతి మరింత స్మూత్‌గా, అదే సమయంలో పవర్‌ఫుల్‌గా ఉండే అవకాశం ఉంది.

ఈ ఎలక్ట్రిక్ SUVలో 65kWh, 75kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు అందించే అవకాశం ఉంది. పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత ఈ SUV 538 కిలోమీటర్ల నుండి 627 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ అందిస్తుందని అంచనా. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజువారీ ప్రయాణాలతో పాటు దూర ట్రిప్‌లను కూడా ఎలాంటి రేంజ్ టెన్షన్ లేకుండా పూర్తి చేయగల సామర్థ్యం దీనికి ఉంటుందని భావిస్తున్నారు.
రాబోతున్న కొత్త సియెర్రా EV డిజైన్ పరంగా మరింత అధునాతనమైన, ఫ్యూచరిస్టిక్ లుక్‌తో ఉండబోతుందని సమాచారం. మొత్తం డిజైన్‌ను చూస్తే, ఇది క్లాసిక్ సియెర్రా ఐడెంటిటీని కొనసాగిస్తూనే, ఆధునిక ఎలక్ట్రిక్ SUVల ట్రెండ్‌కు తగ్గట్టు రూపుదిద్దుకోనుంది. ముందు భాగంలో స్టైలిష్ LED హెడ్‌ల్యాంప్‌లు, ఆకట్టుకునే LED DRLలు అందుబాటులో ఉండనున్నాయి. ఇవి కారు ఫ్రంట్ లుక్‌కు బోల్డ్ క్యారెక్టర్‌ను ఇస్తూనే, రాత్రి డ్రైవింగ్‌లో మెరుగైన విజిబిలిటీని అందిస్తాయి.

ప్రొజెక్టర్ ఫాగ్ లైట్లు ఉండటం వల్ల మబ్బు లేదా వర్షం వంటి పరిస్థితుల్లో కూడా డ్రైవింగ్ మరింత సురక్షితంగా మారుతుంది. వెనుక LED టెయిల్ ల్యాంప్‌లు కారు మొత్తం డిజైన్‌తో కలిసిపోయేలా ఉంటాయి. ఇవి కేవలం లుక్ పరంగానే కాకుండా, వెనుక నుంచి వచ్చే వాహనాలకు స్పష్టమైన సిగ్నలింగ్ అందించేలా డిజైన్ చేయబడ్డాయి. అలాగే, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ఇవ్వడం ద్వారా ఈ SUVకు స్పోర్టీ, ప్రీమియం టచ్‌ను జోడించారు.
కొత్తగా రాబోతున్న టాటా సియెర్రా EVలో మొత్తం 5 సీట్ల అమరిక ఉండనుంది. ఈ సీటింగ్ లేఅవుట్ ప్రయాణీకులు అందరూ సౌకర్యంగా కూర్చుని ప్రయాణించేందుకు అనుకూలంగా డిజైన్ చేయబడింది. ఫీచర్ల పరంగా చూస్తే, కొత్త సియెర్రా EVలో పెద్ద మార్పులు ఉండే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. ఇందులో డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పెద్ద టచ్‌స్క్రీన్ సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ప్యాసింజర్ సైడ్‌కు ప్రత్యేకంగా ఇచ్చిన డిస్ప్లే ఉంటాయి.

కంఫర్ట్ ఫీచర్లలో భాగంగా డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, 12-స్పీకర్ BGL సౌండ్ సిస్టమ్, భద్రత విషయానికి వస్తే, 6 ఎయిర్‌బ్యాగులు, ESC, ట్రాఫిక్‌లో పూర్తి విజిబిలిటీ ఇచ్చే 360-డిగ్రీ కెమెరా, లెవల్-2 ADAS సిస్టమ్ వంటివి ఉన్నాయి. అంచనాల ప్రకారం ఈ కారు, ఈ ఏడాది మార్చి చివరి నాటికి అమ్మకానికి వస్తుంది. దీని ధర రూ.20 లక్షల నుండి రూ. 25 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా.


Click it and Unblock the Notifications








