అదిరిపోయే ఫీచర్లు, పవర్‌ఫుల్ పవర్‌ట్రెయిన్.. కార్ల మార్కెట్లో హల్‌చల్ చేయబోతున్న రెండు సరికొత్త మోడళ్లు
భారతీయ ఆటోమొబైల్ రంగానికి రాబోయే రెండు వారాలు ఎంతో ఎక్సైటింగ్‌గా ఉండబోతున్నాయి. మార్కెట్లో అత్యంత ఆదరణ ఉన్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రెండు పవర్‌ఫుల్ కార్లు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors), నిస్సాన్ (Nissan) బ్రాండ్లు ఈ కొత్త ఎస్‌యూవీలను తీసుకువస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఆటోమొబైల్ వర్గాల్లో వీటిపై భారీ చర్చ జరుగుతోంది. కస్టమర్ల లాంగ్ వెయిటింగ్‌కు ఎండ్ కార్డ్ వేస్తూ పవర్‌ఫుల్ ఇంజన్, అధునాతన టెక్నాలజీ, అదిరిపోయే లగ్జరీ ఫీచర్లతో ఈ కార్లు అలరించనున్నాయి.
ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో సరికొత్త సంచలనం టాటా సియెర్రా ఈవీ
టాటా మోటార్స్ తమ ప్రతిష్టాత్మక టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV)ని జూన్ 20న లాంచ్ చేయనుంది. ఇది కంపెనీ లైనప్‌లో కర్వ్ ఈవీ (Curvv EV), హారియర్ ఈవీ (Harrier EV) మోడళ్ల మధ్యలో రానుంది. ఈ కారు డిజైన్ పాత క్లాసిక్ సియెర్రా లుక్‌ను గుర్తుచేసేలా ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనానికి తగ్గట్లుగా ఎన్నో ఆధునిక మార్పులు చేశారు.

కారు ముందు భాగంలో బాడీ కలర్ క్లోజ్డ్ గ్రిల్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్ (LED DRLs), బంపర్‌కు ఇరువైపులా రెక్టాంగులర్ ఎల్ईడీ హెడ్‌ల్యాంప్స్, వర్టికల్ ఫాగ్ ల్యాంప్స్ అందించారు. సైడ్ ప్రొఫైల్‌లో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, స్క్వేర్ వీల్ ఆర్చెస్, 19-ఇంచుల ఏరోడైనమిక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.
627 కిలోమీటర్ల భారీ రేంజ్.. పవర్‌ఫుల్ బ్యాటరీ
టాటా సియెర్రా ఈవీ సరికొత్త Acti.ev+ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందింది. ఇందులో దాదాపు హారియర్ ఈవీకి వాడే బ్యాటరీ ఆప్షన్లనే అందించే అవకాశం ఉంది. లీక్స్ ప్రకారం.. ఈ కారు 65 kWh, 75 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో రానుంది. దీని రేర్-వీల్-డ్రైవ్ (RWD) వేరియంట్ 238 PS పవర్, 315 Nm టార్క్ ఇస్తుంది.
అలాగే డ్యూయల్-మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ (AWD) వేరియంట్‌లో అదనంగా ముందు భాగంలో 158 PS పవర్ ఇచ్చే మోటార్ ఉంటుంది. రేంజ్ విషయానికి వస్తే.. 65 kWh బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై 538 కిమీల రేంజ్ ఇస్తుండగా, పెద్దదైన 75 kWh బ్యాటరీ ప్యాక్ ఏకంగా 627 కిమీల టాప్ రేంజ్ ఆఫర్ చేయనుంది. దీని ధర రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

నిస్సాన్ టెక్టాన్.. బేబీ పెట్రోల్ వచ్చేస్తోంది
మరోవైపు, నిస్సాన్ కంపెనీ తమ సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton)ను జూలై 9న అంతర్జాతీయ మార్కెట్లో గ్లోబల్ డెబ్యూ చేయబోతోంది. ఈ కారు అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని డిజైన్. నిస్సాన్ కంపెనీ ఐకానిక్ పెట్రోల్ (Nissan Patrol) ఎస్‌యూవీ డిజైన్ ఆధారంగా దీనిని రూపొందించడం వల్ల కంపెనీ దీనిని ముద్దుగా బేబీ పెట్రోల్ అని పిలుస్తోంది.
దీని ఫ్రంట్ లుక్‌లో హారిజాంటల్ స్లాట్స్ ఉన్న పెద్ద గ్రిల్, దానిపై ఎరుపు రంగు స్ట్రిప్ ఆకట్టుకుంటాయి. బోనెట్‌పై పెద్ద అక్షరాలతో TEKTON అని రాసి ఉంటుంది. వెనుక భాగంలో కనెక్టెడ్ C-షేప్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, ట్విన్-రిడ్జ్ రూఫ్ స్పాయిలర్ దీనికి రగ్గడ్ స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి.
ప్రీమియం ఇంటీరియర్స్, అధునాతన సేఫ్టీ ఫీచర్లు
నిస్సాన్ టెక్టాన్ కారు లోపలి భాగం (Cabin) రాబోయే డస్టర్ కారు కంటే చాలా ప్రీమియంగా ఉండబోతోంది. ఇందులో 10.1-ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్-బిల్ట్ గూగుల్ మ్యాప్స్ సపోర్ట్, లీడరెట్ అపోల్స్టరీ, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.
సేఫ్టీ కోసం ఇందులో కస్టమర్ల మోస్ట్ ఫేవరెట్ అడాస్ (ADAS) టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరాను కూడా జోడించారు. ఈ కారులో నిస్సాన్ డస్టర్ లాంటి ఇంజన్ ఆప్షన్లనే అందించనున్నారు. దీని బేస్ వేరియంట్ ప్రారంభ ధర దాదాపు రూ.11 లక్షల బడ్జెట్ లోనే ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications