బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే ఎగబడుతున్న జనాలు.. సియెర్రా ఈవీ నచ్చకపోతే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారట
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఈవీ(Electric Vehicle) మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరలేపబోతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV)ని జూన్ 30న మార్కెట్లోకి విడుదల చేసేందుకు కంపెనీ సర్వం సిద్ధం చేసింది. ఈ కారు లాంచ్‌కు ముందే మార్కెట్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
దీన్ని క్యాష్ చేసుకునేందుకు టాటా డీలర్‌షిప్‌లు అప్పుడే అనధికారికంగా బుకింగ్స్ కూడా ప్రారంభించేశాయి. ఈ కారును సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు కేవలం రూ.25,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ముందస్తుగా రిజర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ తర్వాత మీ మనసు మారినా ఎలాంటి కటింగ్స్ లేకుండా ఈ అమౌంట్ పూర్తిగా రీఫండ్ అవుతుందని డీలర్లు చెప్తున్నారు.

కళ్లు చెదిరే ఆఫ్-రోడ్ కెపాసిటీ
ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన ఫీచర్లను రివీల్ చేస్తూ టాటా మోటార్స్ ఒక అదిరిపోయే వీడియో టీజర్‌ను విడుదల చేసింది. యూఏఈ (UAE)లోని అబుదాబీలో ఉన్న ప్రసిద్ధ తాల్ మోరీబ్ అనే భారీ ఇసుక తిన్నె (Sand Dune)పై ఈ సియెర్రా ఈవీ అలవోకగా దూసుకెళ్తున్న దృశ్యాలను ఈ ప్రోమోలో చూపించారు. అత్యంత కఠినమైన కొండలు, ఇసుక దారుల్లో కూడా ఈ కారు ఎంత పవర్‌ఫుల్‌గా ప్రయాణించగలదో ఈ వీడియో ద్వారా స్పష్టమైంది. ఈ ప్రొడక్షన్-రెడీ మోడల్ చూశాక కారు ప్రియులు ఫిదా అయిపోతున్నారు.
మట్టిని, ఇసుకను చీల్చుకెళ్లే టెర్రైన్ మోడ్స్
ఈ కారులోని డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను గమనిస్తే ఇందులో ప్రత్యేకమైన టెర్రైన్ మోడ్స్ (Terrain Modes) ఉన్నట్లు తెలుస్తోంది. అంటే మనం ప్రయాణించే రోడ్డును బట్టి వేర్వేరు మోడ్స్ మార్చుకోవచ్చు. ఇసుకలో ప్రయాణించేటప్పుడు సాండ్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చని వీడియోలో చూపించారు. అలాగే ఇందులో బూస్ట్ మోడ్ (Boost Mode) కూడా ఉంది. నిటారుగా ఉన్న కొండలు ఎక్కేటప్పుడు లేదా ఓవర్‌టేక్ చేసేటప్పుడు ఈ మోడ్ ఆన్ చేస్తే కారుకు ఒక్కసారిగా అదనపు పవర్, టార్క్ లభిస్తాయి. డ్యూయల్-మోటార్ క్వాడ్-వీల్ డ్రైవ్ (AWD) సెటప్‌తో రాబోతున్న ఈ కారు టాటా లోనే బెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కానుంది.

సింగిల్ ఛార్జ్‌తో 500 కిలోమీటర్లకు పైగా రేంజ్
ఎలక్ట్రిక్ కార్లు కొనేవారికి రేంజ్ అనేది చాలా ముఖ్యం. టీజర్ వీడియోలో కారు డిస్‌ప్లే చూపిస్తున్న వివరాల ప్రకారం.. కేవలం 80 శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఉన్నప్పుడే ఈ కారు ఏకంగా 424 కిలోమీటర్ల రేంజ్ చూపిస్తోంది. దీనిని బట్టి చూస్తే 100 శాతం ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ కారు ఖచ్చితంగా 500 కిలోమీటర్ల నుంచి 530 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. టాటా కంపెనీ ఇంకా అఫీషియల్ రేంజ్‌ను ప్రకటించనప్పటికీ.. ఈ డిస్‌ప్లే డేటా చూశాక మైలేజ్ టెన్షన్ అస్సలు ఉండదని అర్ధమవుతోంది.
మరింత లగ్జరీగా లోపలి ఇంటీరియర్
ఈ కారు ఇంటీరియర్ డిజైన్‌ను కూడా చాలా రిచ్‌గా ప్లాన్ చేశారు. గ్లాస్ బ్లాక్ బాడీ క్లాడింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ (Panoramic Sunroof), డ్రైవర్ కోసం హెడ్-అప్ డిస్‌ప్లే (HUD) వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్టీరింగ్ వీల్‌పై సాంప్రదాయ టాటా లోగోను ఇచ్చారు. కారు ధర విషయానికి వస్తే, దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. అయితే టాప్ వేరియంట్లు ఫీచర్లను బట్టి రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఉండవచ్చు.


Click it and Unblock the Notifications