ఇండియాలో మోస్ట్ డిమాండ్ ఉన్న 4 కార్లతో కొత్త సియెర్రా EV బ్యాటరీ, రేంజ్, ధర కంపారిజన్
దేశీయ ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ (tata motors) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సియెర్రా ఈవీ (sierra ev) ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ కారు ధర, ఫీచర్ల గురించి తెలుసుకున్నాం. అయితే అసలు ప్రశ్న ఇప్పుడు ఒక్కటే.. మార్కెట్లో ఇప్పటికే దూసుకుపోతున్న మారుతి ఇ-విటారా, మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, MG ZS EV వంటి ప్రత్యర్థుల కంటే సియెర్రా EV ఏ విషయంలో మెరుగ్గా ఉంది? బ్యాటరీ సామర్థ్యం నుంచి రేంజ్ వరకు, పవర్ నుంచి ధర వరకు, ఫీచర్ల నుంచి పనితీరు వరకు అన్ని అంశాల్లో ఈ కార్ల మధ్య ఉన్న తేడాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాటరీ-రేంజ్:
బ్యాటరీ ప్యాక్, డ్రైవింగ్ రేంజ్ పరంగా ఈ ఎలక్ట్రిక్ SUVలు ఎలా ఉన్నాయో చూద్దాం. టాటా సియెర్రా EVలో 63 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లు ఉన్నాయి. వీటిలో 63 kWh వెర్షన్ పూర్తి ఛార్జ్‌తో 535 కి.మీ వరకు, 75 kWh వెర్షన్ 665 కి.మీ వరకు ధృవీకరించబడిన రేంజ్‌ను అందిస్తుంది. మహీంద్రా BE 6లో 59 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి.

వీటి సర్టిఫైడ్ రేంజ్ వరుసగా 557 కి.మీ, 683 కి.మీ. రేంజ్ పరంగా BE 6 ముందంజలో నిలుస్తోంది. మారుతి ఇ-విటారాలో 49 kWh, 61 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. వీటితో వరుసగా 440 కి.మీ, 543 కి.మీ రేంజ్ లభిస్తుంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌లో 42 kWh, 51.4 kWh బ్యాటరీ ఆప్షన్‌లు ఉండగా, ఇవి 420 కి.మీ, 510 కి.మీ వరకు ధృవీకరించబడిన రేంజ్‌ను అందిస్తాయి.
అదే సమయంలో MG ZS EVలో ఒక్క 50.3 kWh బ్యాటరీ ప్యాక్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ SUV పూర్తి ఛార్జ్‌తో గరిష్టంగా 460 కి.మీ వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మొత్తంగా చూస్తే బ్యాటరీ సామర్థ్యం, డ్రైవింగ్ రేంజ్ పరంగా టాటా సియెర్రా EV, మహీంద్రా BE 6 మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది.

ఛార్జింగ్ సమయం:
సియెర్రా EVని 120 kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో బ్యాటరీని కేవలం 26 నిమిషాల్లో 20-80 శాతం వరకు ఛార్జ్ చేయొచ్చు. 7.2 kW AC ఛార్జర్‌తో 63 kWh బ్యాటరీని 8.9 గంటల్లో, 75 kWh బ్యాటరీని 10.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. మహీంద్రా BE 6లో 175 kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 20 నిమిషాల్లోనే 20-80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది.
BE 6లో 11.2 kW AC ఛార్జర్‌తో చిన్న బ్యాటరీ 6, పెద్ద బ్యాటరీ 8 గంటల్లో, ఇ-విటారా 70 kW DC ఛార్జర్‌తో 45 నిమిషాల్లో(10-80%), 7.4 kW AC ఛార్జర్‌తో 6.5-9 గంటల్లో, క్రెటా ఎలక్ట్రిక్ 39 నిమిషాల్లో(10-80%), 11 kW ACతో 4-4.5 గంటల్లో, ZS EVలో 50 kW DCతో 0-80 శాతం ఛార్జింగ్‌కు గంట, 7.4 kW ACతో 9 గంటలు పడుతుంది.

ఎలక్ట్రిక్ మోటార్:
సియెర్రా EVలో 63 kWh వెర్షన్ 238 hp, 315 Nm టార్క్‌ను, 75 kWh వెర్షన్ 209 hp, 315 Nm టార్క్‌ను, టాప్ AWD వేరియంట్‌లో అదనపు మోటార్‌తో మొత్తం 504 Nm టార్క్ లభిస్తుంది. మహీంద్రా BE 6లో 228-282 hp, ఇ-విటారాలో 142-172 hp, క్రెటా ఎలక్ట్రిక్‌లో 133-169 hp, MG ZS EVలో 177 hp పవర్ అందుబాటులో ఉంది.
ధర:
టాటా సియెర్రా EV ధర రూ.18.79 లక్షల నుంచి రూ.25.99 లక్షల వరకు ఉంది. మహీంద్రా BE 6 ధర రూ.18.90-23.50 లక్షలు, మారుతి ఇ-విటారా రూ.15.99-17.79 లక్షలు, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ రూ.18.03-20 లక్షలు, MG ZS EV ప్రారంభ ధర రూ.17.99 లక్షలు (అన్నీ ఎక్స్-షోరూమ్).


Click it and Unblock the Notifications