రెండు నెలల్లో రాబోతున్న ఈ కారు కోసం దేశమంతా ఎదురుచూస్తోంది.. టాటా నుంచి భారీ EV సర్‌ప్రైజ్
ఒకప్పుడు భారతీయ రోడ్లపై ప్రత్యేక గుర్తింపును సంపాదించిన SUVల్లో టాటా సియోర్రా (Tata Sierra) ఒకటి. 1991లో మొదటిసారి భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు, తన ప్రత్యేక డిజైన్, పెద్ద గ్లాస్ విండోలు, బలమైన నిర్మాణంతో అప్పటి యువతను ఆకట్టుకుంది. 2003 వరకు మార్కెట్లో కొనసాగిన తర్వాత ఈ ఐకానిక్ SUVకి గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. అయితే దాదాపు 22 సంవత్సరాల తర్వాత, అదే పేరు మరోసారి భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సందడి చేయడం ప్రారంభించింది. నవంబర్ 2025లో కొత్త అవతారంలో తిరిగి వచ్చిన టాటా సియెర్రా, పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే ఆధునిక టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించింది. ముఖ్యంగా SUV ప్రియులు, పాత సియెర్రా అభిమానులు ఈ మోడల్‌కి మంచి స్పందన ఇచ్చారు.
మార్కెట్లోకి వచ్చిన కొద్ది రోజులకే ఈ SUVపై భారీ ఆసక్తి కనిపించింది. ప్రస్తుతం ఈ కారు ఐసీ ఇంజిన్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, దీనికి సంబంధించిన ఎలక్ట్రిక్ వెర్షన్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు అందరి దృష్టి Tata Sierra EV పై పడింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, టాటా మోటార్స్ కూడా ఈ సెగ్మెంట్‌లో మరింత దూకుడుగా ముందుకెళ్తోంది.

ఇప్పటికే పలు ఈవీ మోడళ్లతో మార్కెట్లో ఆధిపత్యం కొనసాగిస్తున్న కంపెనీ, ఇప్పుడు సియెర్రా ఈవీని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. నివేదికల ప్రకారం, టాటా సియెర్రా ఈవీ 2026-27 ఆర్థిక సంవత్సరంలోని రెండవ త్రైమాసికంలో మార్కెట్లోకి రానుంది. అంటే రాబోయే జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఈ ఎలక్ట్రిక్ SUV అమ్మకానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రముఖ ఆటో పోర్టల్ కార్‌వాలే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.
కొత్త ఎలక్ట్రిక్ SUVలో ఆధునిక డిజైన్‌తో పాటు లాంగ్ రేంజ్ బ్యాటరీ, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలకు సరిపోయే విశాలమైన క్యాబిన్, ఫ్యూచరిస్టిక్ లుక్, టాటా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం ఈ కారుకు మరింత బలం చేకూర్చే అంశాలు. ఒకప్పుడు భారతీయుల కలల SUVగా నిలిచిన సియెర్రా, ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో మరోసారి కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది.

సియెర్రా EVలో బ్యాటరీ విషయంలో కూడా కంపెనీ భారీ అంచనాలు పెంచుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కర్వ్ ఈవీలో ఉపయోగిస్తున్న 55 kWh భారీ బ్యాటరీ ప్యాక్‌ను సియెర్రా EV టాప్ వేరియంట్లలో కూడా కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. కర్వ్ EV ప్రస్తుతం ఒకే ఛార్జ్‌పై గరిష్టంగా 502 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తోంది. ఈ SUV కూడా దాదాపు 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వొచ్చు.
అన్ని వర్గాల వినియోగదారులను ఆకట్టుకునేలా టాటా మరో వ్యూహాన్ని కూడా సిద్ధం చేస్తోంది. ప్రీమియం వేరియంట్లతో పాటు, తక్కువ ధరలో అందుబాటులో ఉండే విధంగా చిన్న సామర్థ్యం గల మరో బ్యాటరీ ప్యాక్‌ను కూడా తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీని వల్ల సియెర్రా EV ధర మరింత పోటీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా టాటా మోటార్స్, రేంజ్ కోరుకునే కస్టమర్లను, బడ్జెట్ కస్టమర్లను తనవైపు తిప్పుకోనుంది.

Tata Sierra EV భారత మార్కెట్లో సుమారు రూ. 15 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ SUVలో 75కిపైగా ఆధునిక ఫీచర్లు, వాయిస్ కమాండ్‌తో పనిచేసే పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, రేన్ సెన్సింగ్ వైపర్లు, రియర్ డిఫాగర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, అలాగే వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్ వంటి ఫీచర్లు కూడా అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications