ఇంకొన్ని గంటల్లో దేశం ఎదురుచూస్తున్న కారు ఎంట్రీ.. నిరీక్షణకు ముగింపు.. ప్రత్యర్థులకు టెన్షన్ స్టార్ట్!
భారత ఆటోమొబైల్ మార్కెట్లో భారీ అంచనాలు నెలకొల్పిన టాటా సియెర్రా ఈవీ (Toyota Sierra Ev) ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ SUVలపై పెరుగుతున్న ఆసక్తి మధ్య, ఈ కొత్త మోడల్ రేపు (జూన్ 30) అధికారికంగా లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ కారుపై వినియోగదారుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో టాటా సియెర్రా EV, మార్కెట్‌లో ఉన్న ప్రముఖ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ముఖ్యంగా మారుతి సుజుకి ఇ-విటారా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వంటి కార్లతో ఇది నేరుగా పోటీపడే అవకాశం ఉంది. డిజైన్, రేంజ్, ఫీచర్లు వంటి అంశాల్లో టాటా సంస్థ ఈ SUVను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు సమాచారం.
టాటా సియెర్రా EV ఎలక్ట్రిక్ SUV గురించి వస్తున్న సమాచారం ప్రకారం, ఈ మోడల్‌ను కంపెనీ అత్యాధునిక టెక్నాలజీతో పాటు దూర ప్రయాణ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో మొత్తం రెండు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అవి 65 kWh, 75 kWh ప్యాక్‌లు. ఈ రెండు వేరియంట్లు వేర్వేరు రేంజ్ సామర్థ్యాన్ని అందించనుందని తెలుస్తుంది.

చిన్న 65 kWh బ్యాటరీ సుమారు 550 కి.మీ వరకు, అలాగే పెద్దదైన 75 kWh బ్యాటరీ సుమారు 630 కి.మీ వరకు డ్రైవింగ్ రేంజ్ ఇవ్వగలదని అంచనా. ఫీచర్ల పరంగా చూస్తే, సియెర్రా EVను టాటా పూర్తిగా ప్రీమియం సెగ్మెంట్‌కు సరిపోయేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో పాటు ఆధునిక స్మార్ట్ ఫీచర్లు కూడా ఉండనున్నాయి.
కంఫర్ట్, లగ్జరీని కలిపేలా ఈ SUVలో పనోరమిక్ సన్‌రూఫ్, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో కూడిన 12-స్పీకర్ JBL ప్రీమియం ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి సౌకర్యాలు అందించే అవకాశం ఉంది. దూర ప్రయాణాల్లో సౌకర్యాన్ని పెంచేందుకు డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కూడా ఇందులో భాగం కావచ్చు.

ఇక ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే, టాటా సియెర్రా EVలో ఒక ఫ్యూచరిస్టిక్ డాష్‌బోర్డ్ లేఅవుట్ ఉండే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం, ఇందులో మూడు స్క్రీన్ సెటప్ ఉండవచ్చని తెలుస్తోంది. అందులో సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, ముందు ప్రయాణీకుడి కోసం ప్రత్యేక డిస్ప్లే, అలాగే డ్రైవర్ కోసం డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండవచ్చు. ఈ రెండు ప్రధాన స్క్రీన్లు సుమారు 12.3 అంగుళాల పరిమాణంలో ఉండే అవకాశం ఉంది.
అదే సమయంలో డ్రైవర్ డిస్‌ప్లే సుమారు 10.25 అంగుళాలుగా ఉండవచ్చని అంచనా. భద్రత విషయంలో కూడా టాటా సియెర్రా EV ఎలాంటి రాజీ పడకుండా ఉండే అవకాశం కనిపిస్తోంది. నివేదికల ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ SUVలోని అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు,360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ABSతో పాటు ఇతర అధునాతన సేఫ్టీ సిస్టమ్‌లు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.

ఇక ధర విషయానికి వస్తే, ప్రారంభ ధర సుమారు రూ.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా. BaaS పథకం కింద ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర రూ.10 లక్షలు మాత్రమే ఉండొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. అందుకోసం ప్రతి కిలోమీటర్‌కు సుమారు రూ.4 చొప్పున వినియోగ ఛార్జీ విధించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇవన్నీ అంచనాలు మాత్రమే. అధికారిక ధరలు, వేరియంట్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్లను కంపెనీ రేపు అధికారికంగా ప్రకటించనుంది.


Click it and Unblock the Notifications