అందరూ ఎదురుచూస్తున్న కారు ఇదే.. జూన్ 30న గ్రాండ్ ఎంట్రీ.. ఒక్క ఛార్జ్‌తో 627 కిమీలు..!

భారతీయ ఆటోమొబైల్ రంగంలో వినియోగదారుల అభిరుచులను, అవసరాలను అత్యంత సమర్థవంతంగా అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా ఉత్పత్తులను అందించే కంపెనీలలో టాటా మోటార్స్ (tata motors) ఎప్పుడూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి గణనీయంగా పెరుగుతుండటంతో, ఈ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచడానికి టాటా మోటార్స్ వరుసగా కొత్త మోడళ్లను తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఒకప్పుడు భారతీయ రోడ్లపై తనదైన ముద్ర వేసిన లెజెండరీ సియెర్రా పేరును మళ్లీ పునరుద్ధరిస్తూ, సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో సియెర్రా ఈవీ (Sierra ev)ను మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ సిద్ధమైంది. ఇప్పటికే ఆటోమొబైల్ ప్రేమికులలో ఈ SUVపై భారీ ఆసక్తి నెలకొంది.

తాజాగా టాటా మోటార్స్ ఈ వాహనానికి సంబంధించిన రూపురేఖలను అధికారికంగా వెల్లడించడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. క్లాసిక్ సియెర్రా గుర్తింపును కొనసాగిస్తూ, ఆధునిక డిజైన్ అంశాలను జోడించడం ద్వారా ఈ SUVకు ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకువచ్చింది. ముఖ్యంగా ముందు భాగంలోని స్టైలిష్ LED లైటింగ్, ఆకర్షణీయమైన బాడీ లైన్స్, విశాలమైన క్యాబిన్ డిజైన్ వంటివి ఈ వాహనాన్ని ప్రీమియం ఎలక్ట్రిక్ SUVగా నిలబెట్టేలా కనిపిస్తున్నాయి.

Tata Sierra Ev Launch On June 30th Exterior Design Details Out

డిజైన్ విషయంలో టాటా మోటార్స్ పెద్దగా ప్రయోగాలు చేయకుండా, ఇప్పటికే ప్రదర్శించిన సియెర్రా ICE వెర్షన్ నుంచి ఎక్కువ భాగం డిజైన్‌ను స్వీకరించడం విశేషం. దీంతో ఎలక్ట్రిక్, ICE వెర్షన్ల మధ్య దాదాపు ఒకే తరహా రూపాన్ని వినియోగదారులు చూడబోతున్నారు. ఇది బ్రాండ్ గుర్తింపును మరింత బలోపేతం చేయడంతో పాటు, సియెర్రా అభిమానులకు పాత జ్ఞాపకాలను గుర్తు చేసే అవకాశం కల్పిస్తుంది.

టాటా ఎలక్ట్రిక్ SUV పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం ఉన్న నెక్సాన్ EV, కర్వ్ EV, హారియర్ EV మోడళ్ల మధ్య సియెర్రా EV కీలక పాత్ర పోషించనుంది. హారియర్ EV కంటే దిగువన స్థానాన్ని దక్కించుకోనున్న ఈ మోడల్ ధర పరంగా కూడా మరింత అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం, ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.20 లక్షల లోపే ఉండవచ్చు. జూన్ 30వ తేదీన ఇది మార్కెట్లోకి రానుంది.

Tata Sierra Ev Launch On June 30th Exterior Design Details Out

టాటా సియెర్రా EV డిజైన్ పరంగా పెద్దగా మార్పులు లేకుండా, ఇప్పటికే ఆకట్టుకున్న సియెర్రా రూపాన్నే కొనసాగించింది. సాధారణ వెర్షన్‌లో ఉండే బ్లాక్ గ్రిల్ స్థానంలో బాడీ కలర్ క్లోజ్డ్ గ్రిల్‌ను అందించగా, LED లైట్ బార్ మరియు హెడ్‌ల్యాంప్‌ల డిజైన్‌ను అలాగే ఉంచింది. బంపర్‌కు గ్లోస్ బ్లాక్ ఫినిష్, సిల్వర్ స్కిడ్ ప్లేట్ జోడించడం వల్ల ముందు భాగం మరింత స్టైలిష్‌గా కనిపిస్తోంది.

పక్క, వెనుక భాగంలో పెద్దగా మార్పులు లేవు. సియెర్రా EV బ్యాడ్జింగ్, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ మోడల్‌కు ప్రత్యేకతను తీసుకువస్తాయి. కొత్త కలర్స్ ఉండచ్చు. ఇంటీరియర్‌లో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, ప్యాసింజర్ డిస్‌ప్లేతో కూడిన ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఉండొచ్చు. అలాగే పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ప్రీమియం ఆడియో సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), డ్రైవ్ మోడ్‌లు ఉండవచ్చు.

Tata Sierra Ev Launch On June 30th Exterior Design Details Out

సియెర్రా EVలో కూడా హారియర్ EVలో ఉపయోగించిన 65kWh, 75kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లు ఉండచ్చు. అయితే హారియర్ EVతో పోలిస్తే సియెర్రా EV పరిమాణంలో కొంత చిన్నదిగా, బరువులో తక్కువగా ఉండటం వల్ల మెరుగైన సామర్థ్యాన్ని అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం హారియర్ EVలోని 75kWh బ్యాటరీ ప్యాక్ గరిష్టంగా 627 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుండగా, సియెర్రా EV కూడా ఇదే పనితీరును చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Article Published On: Thursday, June 25, 2026, 10:50 [IST]
English summary
Tata sierra ev launch on june 30th exterior design details out
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+