1500 కోట్ల కిలోమీటర్ల డేటాతో తయారైన ఎస్‌యూవీ.. టాటా చరిత్రలోనే అత్యంత సేఫ్ అండ్ అడ్వాన్స్డ్ ఈవీ
భారతదేశపు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రానిక్ వాహన (EV) ప్రియుల కోసం సరికొత్త సంచలనాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎంతో కాలంగా ఆటోమొబైల్ మార్కెట్ ఎదురుచూస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా సియెర్రా ఈవీ (Tata Sierra.ev) దేశీయ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. ఈ కారు ధరలు రూ. 18.79 లక్షల నుండి రూ. 26.48 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండనున్నాయి. కంపెనీ ఇప్పటికే ఈ మోస్ట్ అవేటెడ్ ఈవీ కోసం బుకింగ్స్‌ను కూడా ప్రారంభించేసింది. జూలై 15వ తేదీ నుండి కస్టమర్లకు ఈ కార్ల డెలివరీలను ప్రారంభించనున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది.
1500 కోట్ల కిలోమీటర్ల డేటాతో తయారైన ఎస్‌యూవీ
టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మోబిలిటీ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఆనంద్ కులకర్ణి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కారును కేవలం కాగితాల మీద లెక్కల కోసం కాకుండా, ప్రాక్టికల్‌గా రోడ్లపై అద్భుతంగా పనిచేసేలా డిజైన్ చేశారు. ఈ కారును లాంచ్ చేయడానికి ముందు దాదాపు 15 బిలియన్ల (1500 కోట్ల) కిలోమీటర్ల ప్రయాణాల ద్వారా సేకరించిన భారీ డేటాను, లర్నింగ్స్‌ను విశ్లేషించి దీనిని రూపొందించారు.

విపరీతమైన ఎండలు, అమితమైన తేమ (హ్యుమిడిటీ), ధూళి, విభిన్న వాతావరణ పరిస్థితులు, వేలాది సార్లు బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్, డిశ్చార్జింగ్ సైకిళ్లకు గురిచేసి అన్ని పరీక్షల్లో నెగ్గిన తర్వాతే ఈ కారును మార్కెట్లోకి తెచ్చారు. అందుకే ఇది టాటా కంపెనీలోనే అత్యంత సురక్షితమైన, అడ్వాన్స్డ్ ఈవీగా నిలిచింది.
హారియర్ ఈవీకి, సియెర్రా ఈవీకి తేడా ఏంటి?
టాటా కంపెనీకి చెందిన సియెర్రా ఈవీ, హారియర్ ఈవీ రెండు కూడా ఒకే రకమైన యాక్టివ్.ఈవీ (Acti.ev) ఆర్కిటెక్చర్ ఫ్లాట్‌ఫామ్‌పై ఆధారపడి తయారయ్యాయి. అయినప్పటికీ ఈ రెండింటి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
ఈ రెండింటికీ ఉన్న తేడా గురించి ఆనంద్ కులకర్ణి మాట్లాడుతూ.. హార్డ్‌వేర్ పరంగా రెండు కార్లు ఒకేలా ఉన్నా, ఎమోషనల్ పరంగా వీటి క్యారెక్టర్ చాలా వేరని చెప్పారు. సియెర్రా ఈవీ కోసం సాఫ్ట్‌వేర్ కాలిబ్రేషన్, థ్రోటిల్ మ్యాపింగ్, పవర్ డెలివరీని ప్రత్యేకంగా ట్యూన్ చేశారు. ముఖ్యంగా లాంగ్ జర్నీలలో ప్రయాణికులు అలసిపోకుండా ఉండేందుకు వీలుగా ఇందులో 5-లింక్ ఇండిపెండెంట్ రియర్ సస్పెన్షన్ సెటప్‌ను అమర్చారు, ఇది ప్రయాణాన్ని అత్యంత సాఫీగా మారుస్తుంది.

ఒక్కసారి చార్జ్ చేస్తే 665 కిలోమీటర్ల ప్రయాణం
టాటా సియెర్రా ఈవీ మార్కెట్లో విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభించనుంది. ఇందులో అమర్చిన పెద్దదైన 75kWh బ్యాటరీ ప్యాక్ సహాయంతో ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 665 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని ఎమ్ఐడీసీ (MIDC) సర్టిఫైడ్ రేంజ్ స్పష్టం చేస్తోంది.
ఇక దీని మరో వేరియంట్ అయిన 63kWh బ్యాటరీ ప్యాక్ మోడల్ సింగిల్ చార్జ్‌పై 565 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఎలక్ట్రిక్ కార్లలో మైలేజ్ లేదా రేంజ్ గురించి ఆందోళన చెందే వారికి ఈ కారు ఒక సరైన సమాధానంగా నిలవనుంది.
కేవలం 15 నిమిషాల చార్జింగ్‌తో 263 కిలోమీటర్ల మైలేజ్
ఛార్జింగ్ పరంగా కూడా ఈ కారు నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీతో వస్తోంది. ఇందులో 120kW DC ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్‌ను అందించారు. ఈ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 15 నిమిషాల పాటు కారును ఛార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 263 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
అలాగే కారు బ్యాటరీ కేవలం 26 నిమిషాల్లోనే 20 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ అయిపోతుంది. వీటన్నింటికీ మించి కస్టమర్లలో నమ్మకాన్ని పెంచేందుకు టాటా మోటార్స్ తన ఇతర ఈవీ కార్లలాగే ఈ కొత్త సియెర్రా ఈవీపై కూడా ఏకంగా 15 సంవత్సరాల పాటు బ్యాటరీ వారంటీని (15 Years Battery Warranty) అందిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications