ధరలో రూ.3 లక్షల తేడా.. సియెర్రా ఈవీ Vs హారియర్ ఈవీ.. మీ బడ్జెట్‌కు ఏది బెస్ట్ చాయిస్?

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవల మార్కెట్లోకి రెండు సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విడుదల చేసింది. అవే టాటా సియెర్రా ఈవీ, టాటా హారియర్ ఈవీ. ఈ రెండు కార్లు కూడా టాటా సరికొత్త, అడ్వాన్స్డ్ ఈవీ ప్లాట్‌ఫామ్‌పైనే తయారయ్యాయి.

అంతేకాకుండా, ఈ రెండు మోడళ్ల టాప్ వేరియంట్లలో కంపెనీ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌ను కూడా అందించింది. అయితే, కొత్తగా ఈవీ కారు కొనాలనుకునే వారు ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు. సైజ్, ఫీచర్లు, ధర ఆధారంగా ఈ రెండింటిలో ఏది మీ అవసరాలకు సరిపోతుందో ఇక్కడ చూద్దాం.

Tata Sierra EV vs Tata Harrier EV Which Electric SUV Offers Better Value for Your Budget

లుక్, సైజ్‌లో తేడాలు
మొదటగా ఈ రెండు కార్ల సైజ్, డిజైన్ విషయానికి వస్తే.. టాటా హారియర్ ఈవీ చూడటానికి చాలా పెద్దగా, మస్కులర్ లుక్‌తో భీకరంగా కనిపిస్తుంది. సియెర్రాతో పోలిస్తే హారియర్ కారు పొడవు, వీల్‌బేస్ ఎక్కువ. దీనివల్ల కారు లోపల క్యాబిన్ స్పేస్, లెగ్‌రూమ్ కాస్త ఎక్కువగా దొరుకుతుంది. అయితే, గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో రెండు కార్లు 205mm తో సమానంగా ఉన్నాయి.

కానీ, ప్రయాణాల్లో లగేజ్ పెట్టుకునే బూట్ స్పేస్ విషయానికి వస్తే మాత్రం సియెర్రా ఈవీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. సియెర్రాలో ఏకంగా 622 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుండగా, హారియర్ ఈవీలో కేవలం 502 లీటర్ల స్థలం మాత్రమే ఉంది. లుక్ పరంగా రెండింటిలోనూ ఎల్‌ఈడీ లైట్లు, ఫ్యూచరిస్టిక్ అల్లాయ్ వీల్స్, క్లోజ్డ్ గ్రిల్ వంటి మోడరన్ ఫీచర్లు ఉన్నాయి.

Tata Sierra EV vs Tata Harrier EV Which Electric SUV Offers Better Value for Your Budget

క్యాబిన్, ఫీచర్ల జాతర
రెండు కార్ల ఇంటీరియర్ అత్యంత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. అయితే, ఇక్కడే టాటా మోటార్స్ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఇచ్చింది. ధరలో హారియర్ ఈవీ కంటే తక్కువ ఉన్నప్పటికీ.. సియెర్రా ఈవీలో సరికొత్త ట్రిపుల్-స్క్రీన్ సెటప్‌ను అందించారు. అంటే డ్యాష్‌బోర్డ్‌పై మూడు వేర్వేరు స్క్రీన్స్ ఉంటాయి. అందులో ఒకటి కేవలం కో-ప్యాసింజర్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ప్రత్యేకంగా కేటాయించారు.

ఎక్కువ ధర ఉన్న హారియర్ ఈవీలో మాత్రం కేవలం రెండు స్క్రీన్స్ మాత్రమే ఉంటాయి. మ్యూజిక్ లవర్స్ కోసం సియెర్రాలో 12-స్పీకర్ల జేబీఎల్ (JBL) సౌండ్ సిస్టమ్ ఉండగా, హారియర్‌లో 10 స్పీకర్లు మాత్రమే ఉన్నాయి. ఇక పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా వంటి లగ్జరీ ఫీచర్లు రెండింటిలోనూ కామన్‌గా లభిస్తాయి.

Tata Sierra EV vs Tata Harrier EV Which Electric SUV Offers Better Value for Your Budget

బ్యాటరీ పవర్, టాప్ రేంజ్, పికప్ స్పీడ్ రేస్!
ఎలక్ట్రిక్ కార్లకు అత్యంత కీలకమైన రేంజ్, పికప్ విషయాల్లో ఈ రెండు ఈవీలు రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో వస్తాయి. మైలేజ్ లేదా రేంజ్ విషయానికి వస్తే సియెర్రా ఈవీ కాస్త ముందు వరుసలో నిలుస్తుంది. టాటా హారియర్ ఈవీని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 627 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

అదే టాటా సియెర్రా ఈవీ అయితే ఫుల్ ఛార్జ్‌పై ఏకంగా 665 కిలోమీటర్ల టాప్ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక పికప్ విషయానికొస్తే.. సియెర్రా ఈవీ బరువు తక్కువగా ఉండటం వల్ల చాలా ఫాస్ట్‌గా దూసుకెళ్తుంది. ఇది కేవలం 5.8 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కానీ హారియర్ ఈవీ సైజ్ పెద్దదిగా, బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఇదే వేగాన్ని అందుకోవడానికి 6.3 సెకన్ల సమయం తీసుకుంటుంది.

మీ అవసరాలకు ఏది వాల్యూ ఫర్ మనీ?
చివరగా ధరల విషయానికి వస్తే, ఈ రెండింటి మధ్య సుమారు 3 లక్షల రూపాయల వరకు తేడా ఉంది. టాటా సియెర్రా ఈవీ ప్రారంభ ధర రూ. 18.79 లక్షల నుండి ప్రారంభమై టాప్ మోడల్ ధర రూ. 25.99 లక్షల వరకు ఉంది. అదే సమయంలో టాటా హారియర్ ఈవీ ప్రారంభ ధర రూ. 21.69 లక్షల నుండి ప్రారంభమై టాప్ మోడల్ ధర రూ. 28.99 లక్షల వరకు పలుకుతోంది.

ఫైనల్ వర్డిక్ట్: మీకు రోడ్డుపై అందరినీ ఆకట్టుకునే పెద్ద సైజ్ కారు కావాలి, క్యాబిన్‌లో ఎక్కువ స్పేస్ ఉండాలి మరియు ఆఫ్-రోడింగ్ చేయాలనుకుంటే హారియర్ ఈవీ సరైనది. కానీ, మీ బడ్జెట్ పరిధిలో ఉంటూ.. ఎక్కువ మైలేజ్ రేంజ్, తక్కువ సెకన్లలో టాప్ స్పీడ్, అడ్వాన్స్డ్ మూడు స్క్రీన్ల ఫీచర్లు, ఎక్కువ లగేజ్ స్పేస్ కావాలనుకుంటే మాత్రం టాటా సియెర్రా ఈవీనే మీకు అత్యంత లాభదాయకమైన, స్మార్ట్ ఛాయిస్ అవుతుంది.

Article Published On: Wednesday, July 8, 2026, 16:33 [IST]
English summary
Tata sierra ev vs tata harrier ev which electric suv offers better value for your budget
Read more on: #tata motors #electric car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+