కొత్తగా వచ్చిన టాటా కారుకి జనాల నీరాజనం.. కంపెనీకి బంగారు గుడ్లు పెట్టే కోడిలా మారింది!

భారత ఆటోమొబైల్ రంగంలో తనదైన ముద్రను వేస్తూ ముందుకు సాగుతున్న టాటా మోటార్స్ (Tata Motors) మరోసారి తన లెజెండరీ వారసత్వాన్ని గుర్తు చేస్తూ టాటా సియోర్రా (Tata Sierra)ను కొత్త రూపంలో మార్కెట్లోకి తీసుకువచ్చింది. 2025 నవంబర్ 25న విడుదలైన ఈ ఎస్‌యూవీ, కేవలం ఒక కొత్త మోడల్‌గా మాత్రమే కాకుండా, ఒక కాలంలో రోడ్లపై ప్రత్యేక గుర్తింపును సంపాదించిన సియెర్రా పేరు తిరిగి జీవం పొందినట్టుగా భావించబడుతోంది. గతంలో తన ప్రత్యేక డిజైన్, బలమైన ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్న ఈ మోడల్, ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ, స్టైలిష్ ఎలిమెంట్స్‌తో కొత్త తరం వినియోగదారులను ఆకర్షిస్తోంది. కొత్త సియెర్రా రూపకల్పనలో క్లాసిక్ టచ్‌ను కొనసాగిస్తూ, సమకాలీన ట్రెండ్‌లను చక్కగా మిళితం చేశారు.

మొదటి చూపులోనే ఆకట్టుకునే డిజైన్, శక్తివంతమైన స్టాన్స్, ప్రీమియం ఫినిషింగ్ కలిసి ఈ కారును ప్రత్యేకంగా నిలబెడతాయి. నగర రోడ్లపై కూడా, హైవే ప్రయాణాల్లో కూడా ఇది ఒక స్టేట్మెంట్‌గా కనిపించేలా రూపొందించబడింది. ఇదే కారణంగా, ఇది కేవలం ఒక వాహనం కాకుండా, స్టైల్, బ్రాండ్ ఇమేజ్‌ను ప్రతిబింబించే మోడల్‌గా మారింది. ఈ కారుకు మార్కెట్‌లో లభిస్తున్న స్పందన కూడా అదే స్థాయిలో ఉంది.

Tata Sierra March 2026 Sales Reported 9003 Units More Details Inside

తాజాగా వెల్లడైన గణాంకాల ప్రకారం, 2026 మార్చి నెలలో మాత్రమే సియెర్రా 9,003 యూనిట్లు అమ్ముడవ్వడం విశేషం. ఫిబ్రవరిలో ఈ సంఖ్య 7100 యూనిట్లుగా ఉంది. ఈ లెక్కన నెలవారీ ప్రాతిదికన చూస్తే 27 శాతం వృద్ధి చెందింది. తక్కువ సమయంలోనే ఈ స్థాయిలో అమ్మకాలు సాధించడం, సియెర్రా తిరిగి వచ్చిన నిర్ణయం ఎంత సక్సెస్ అయిందో తెలియజేస్తోంది.

ఈ అద్భుతమైన అమ్మకాలతో, సియెర్రా ప్రస్తుతం కంపెనీ లైనప్‌లో మూడవ అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా నిలవడం మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఇప్పటికే పోటీ తీవ్రంగా ఉన్న ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో, ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయికి చేరుకోవడం చిన్న విషయం కాదు. ఇది టాటా మోటార్స్ ప్లానింగ్, ప్రోడక్ట్ స్ట్రాటజీ, మరియు వినియోగదారుల అభిరుచిని అర్థం చేసుకునే సామర్థ్యానికి నిదర్శనం.

Tata Sierra March 2026 Sales Reported 9003 Units More Details Inside

దేశీయ మార్కెట్లో సియెర్రా ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.49 లక్షల నుండి రూ. 21.29 లక్షల వరకు ఉండటం వల్ల, విభిన్న బడ్జెట్‌లకు సరిపోయేలా ఎంపికలు ఉన్నాయి. వేరియంట్ల విషయానికి వస్తే, ఈ కారు స్మార్ట్ ప్లస్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అడ్వెంచర్ ప్లస్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్ అనే పలు ఆప్షన్లలో లభిస్తుంది. ఇది డిజైన్ పరంగా కూడా చాలా ఆకట్టుకునేలా ఉంది.

ఈ ఎస్‌యూవీ 1.5 లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 158 bhp పవర్, 255 Nm టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇంకా, 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ (NA) పెట్రోల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంది. ఇది 105 bhp పవర్, 145 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని 6-స్పీడ్ మాన్యువల్,7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో తీసుకోవచ్చు.

Tata Sierra March 2026 Sales Reported 9003 Units More Details Inside

డీజిల్ ఆప్షన్‌గా 1.5 లీటర్ ఫోర్-సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 116 bhp పవర్, 260 Nm టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్‌ను కూడా 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్‌తో పొందవచ్చు. కీలక విషయం ఏమిటంటే సాధారణంగా టాటా కార్లు భద్రతకు పెట్టింది పేరు. ఈ క్రమంలో సియోర్రా కూడా అధునాతన సేఫ్టీ ఫీచర్స్‌తో వచ్చింది. Bharat NCAP టెస్టుల్లో ఈ ఎస్‌యూవీ 5 స్టార్ పొందింది.

More from DriveSpark

Article Published On: Monday, April 6, 2026, 16:57 [IST]
English summary
Tata sierra march 2026 sales reported 9003 units more details inside
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+