ఇది కారు కాదు ఇనుప కోట..20 అడుగుల గోతిలో పడ్డ మృత్యుంజయులుగా బయటపడ్డ ప్రయాణికులు

మహారాష్ట్రలోని థానే నగరంలో జరిగిన ఒక భీకర రోడ్డు ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. టాటా మోటార్స్ ప్రతిష్టాత్మకంగా పునరుద్ధరించిన టాటా సియెర్రా (Tata Sierra) SUV టెస్ట్ డ్రైవ్ సమయంలో జరిగిన ఈ ప్రమాదం, వాహనాల భద్రత (Car Safety) ఎంత ముఖ్యమో మరోసారి చాటిచెప్పింది. సుమారు 20 అడుగుల లోతైన గోతిలో కారు పడిపోయినప్పటికీ, అందులోని ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టాటా కార్ల బిల్డ్ క్వాలిటీకి ఈ ఘటనే ఒక నిదర్శనమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

అసలేం జరిగింది?
వివరాల్లోకి వెళితే.. థానేలోని పంచపాఖడి ప్రాంతంలో ఒక మహిళా డ్రైవర్ కొత్త టాటా సియెర్రా SUVని టెస్ట్ డ్రైవ్ చేయడానికి షోరూమ్ నుంచి బయటకు తీశారు. కారులో ఆ మహిళతో పాటు ఆమె బంధువు, షోరూమ్ ఉద్యోగి కూడా ఉన్నారు. టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వేగం పెరగడంతో మహిళ కారుపై నియంత్రణ కోల్పోయారు. కారు అదుపుతప్పి ముందున్న ఒక ఆటో రిక్షాను, రెండు మోటార్ సైకిళ్లను బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా రోడ్డు పక్కన ఉన్న బారికేడ్లను ధ్వంసం చేస్తూ, అక్కడ నిర్మాణంలో ఉన్న ఒక భారీ ఫ్లైఓవర్ సైట్‌లోని సుమారు 20 అడుగుల లోతైన గోతిలోకి నేరుగా దూసుకెళ్లింది.

Tata Sierra Plunges into 20 Foot Pit 5 Star Safety Saves Lives During Thane Test Drive Accident

మృత్యువు అంచుల్లోంచి..
కారు అంత ఎత్తు నుంచి గోతిలో పడటాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న థానే మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుంది. కారు బాడీ బలంగా ఉండటం, లోపల ఎయిర్‌బ్యాగ్‌లు సరైన సమయంలో తెరుచుకోవడంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వారిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా బయటకు తీసి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఎవరూ బతికే అవకాశం లేదనిపించినా, కారు భద్రతా ఫీచర్లు వారిని కాపాడాయని అధికారులు చెబుతున్నారు.

సేఫ్టీకి కేరాఫ్ అడ్రస్
టాటా సియెర్రా కారుకు భారత్ NCAP (Bharat NCAP)లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఈ ప్రమాదంలో కారు అద్దాలు పగిలి, ముందు భాగం దెబ్బతిన్నప్పటికీ.. కారు మెయిన్ ఫ్రేమ్ (Chassis) చెక్కుచెదరకుండా ఉంది. దీనివల్ల ప్రయాణికులు కూర్చున్న భాగం (Cabin) నలిగిపోలేదు. హై-స్ట్రెంత్ స్టీల్ బాడీని ఉపయోగించడం వల్లే ఇలాంటి ప్రమాదాల్లోనూ ప్రయాణికులకు రక్షణ లభిస్తుంది. అయితే, ఆ సమయంలో కారులోని ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) యాక్టివ్‌గా లేకపోవడం వల్ల ఆటోమేటిక్ బ్రేకింగ్ పనిచేయలేదని తెలుస్తోంది. ఒకవేళ అది కూడా పనిచేసి ఉంటే ప్రమాద తీవ్రత ఇంకా తక్కువగా ఉండేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tata Sierra Plunges into 20 Foot Pit 5 Star Safety Saves Lives During Thane Test Drive Accident

ఫీచర్లు, ధర
కొత్త టాటా సియెర్రా కేవలం భద్రతలోనే కాదు, ఫీచర్ల పరంగా కూడా అదిరిపోతుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ADAS, 360-డిగ్రీ కెమెరా, హిల్ హోల్డ్, డిసెంట్ కంట్రోల్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.11.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ఉంటుంది. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రమాదం చూసిన తర్వాత, కారు కొనేటప్పుడు మైలేజీ కంటే సేఫ్టీకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వాహన ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, March 12, 2026, 9:40 [IST]
English summary
Tata sierra plunges into 20 foot pit 5 star safety saves lives during thane test drive accident
Read more on: #tata motors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+